కురవి నుంచి చిత్ర సీమలోకి..
‘తండేల్’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా కురవి శ్రీనాథ్
కురవి: అతడికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి. ఎలాగైనా చిత్రసీమలో అడుగుపె ట్టాలని లక్ష్యం పెట్టుకున్నా డు. దీనికి ఒకపక్క చదువుకుంటూనే.. మరోపక్క ష్టార్ట్ ఫిలిమ్స్ తీయడం మొ దలు పెట్టాడు. ఇంకొవైపు సినిమా అవకాశాల కోసం వెతి కాడు. ఈ ప్రయత్నంలో తన ప్రతిభకు పదునుపెట్టాడు. వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టాడు. చివరకు అందమైన రంగుల ప్రపంచం( సినీరంగం)లోకి అడుగుపెట్టి తన ప్రతిభ చాటుకున్నాడు. పెద్ద హీరో, హీరోయిన్లు నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ‘తండేల్’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసి తన లక్ష్యం నెరవేర్చుకున్నాడు. అతడే మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన కోదుమూరి శ్రీనాథ్(కురవి శ్రీనాథ్). శ్రీనాథ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన సినిమా ‘తండేల్’ దేశవ్యాప్తంగా నేడు(శుక్రవారం) విడుదల కానుంది.
ఊరిపేరు ఇంటి పేరుగా మార్చుకుని..
కురవి మండల కేంద్రానికి చెందిన కోదుమూరి వెంకటేశ్వర్లు, నాగమణి(నాగ) దంపతుల చిన్న కుమారుడు శ్రీనాథ్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలపై మక్కువ. ఈ రంగంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా షార్ట్‌ఫిలిమ్స్ తీయడం మొదలుపెట్టాడు. అలాగే, అభిషేకం సీరియల్‌కు అసోసియేట్ డైరెక్టర్ వ్యవరించాడు. ఈ క్రమంలో తెలిసిన వ్యక్తుల ద్వారా టెక్నీషియన్‌గా పలు సినిమాలకు పని చేశాడు. ఇందులో నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా ‘డెవిల్’కు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం పెద్ద సినిమా ‘తండేల్’కు అసోసియేట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. నేడు ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కురవి గ్రామంతోపాటు మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విజయం సాధించి కురవి కుర్రోడు మరింత ఎదగాలని వారు ఆశీర్వదిస్తున్నారు. కాగా, తన పేరుతోపాటు తన ఊరి పేరు కూడా వెండితెరపై కనపడాలనే ఆకాంక్షతో తన పేరు కురవి శ్రీనాథ్‌గా మార్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment