![మరిపె](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06drk052-330033_mr-1738870603-0.jpg.webp?itok=ety2i_iw)
మరిపెడలో రాష్ట్రస్థాయి బంజార కల్చరల్ మీట్
మరిపెడ: మండల కేంద్రంలోని ఆడిటోరియంలో జిల్లా సమగ్ర విద్యాశాఖ, స్థానిక సీతారాంపురం జెడ్పీహెచ్‌ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 5న ప్రారంభమైన రాష్ట్రస్థాయి బంజార కల్చరల్ మీట్ రెండు రోజు గురువారం కూడా కొనసాగింది. రెండో రోజు కార్యక్రమానికి స్టేట్ జెండర్ కోర్డినేటర్ హజారీ శిరీష ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 18 పాఠశాలల బంజార విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ రంగాలకు చెందిన గిరిజన అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బంజార దుస్తులు, అల్లికలు, కుట్లు, ఆహారపు అలవాట్ల స్టాళ్లు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు నత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా స్టేట్ జెండర్ కోర్డినేటర్ హజారి శిరీష మాట్లాడుతూ బంజారాలు ప్రకృతితో మమేకమై జీవిస్తారన్నారు. పంట పొలాలు, పశు సంపదను ప్రేమగా చూసుకుంటారన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రామచంద్రు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా జెండర్ కోర్డినేటర్ గుండ్ల విజయకుమారి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవీందర్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, తహసీల్దార్ సైదులు, ఎంఈఓ జి.అనితాదేవి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయుల, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సంప్రదాయ దుస్తుల స్టాళ్లు
అలరించిన విద్యార్థుల నృత్యాలు
![మరిపెడలో రాష్ట్రస్థాయి బంజార కల్చరల్ మీట్ 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06drk053-330033_mr-1738870603-1.jpg)
మరిపెడలో రాష్ట్రస్థాయి బంజార కల్చరల్ మీట్
Comments
Please login to add a commentAdd a comment