![30 రైళ్ల రద్దు.. 9 దారి మళ్లింపు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/0000633825-000001-reddychickenc_mr-1738870602-0.jpg.webp?itok=LsHaZxQC)
30 రైళ్ల రద్దు.. 9 దారి మళ్లింపు
● నాలుగు రీ–షెడ్యూల్
కాజీపేట రూరల్ : కాజీపేట–విజయవాడ మధ్య నాన్ ఇంటర్‌లాకింగ్ వర్క్ బ్లాక్‌తో కాజీపేట జంక్షన్ నుంచి వెళ్లే పుష్‌ఫుల్ ప్యాసింజర్లు, కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు చేసి నడిపించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.
రద్దయిన రైళ్ల వివరాలు..
ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కాజీపేట–డోర్నకల్ (67765) పుష్‌పుల్, డోర్నకల్–కాజీపేట (67766) పుష్‌పుల్, డోర్నకల్–విజయవాడ (67767) పుష్‌పుల్, విజయవాడ–డోర్నకల్ (67768) పుష్‌ఫుల్, విజయవాడ–భద్రాచలం (67215) సింగరేణి ప్యాసింజర్, భద్రాచలం–విజయవాడ(67216) సింగరేణి ప్యాసింజర్, గుంటూరు–సికింద్రాబాద్ (17201) ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు సికింద్రాబాద్–గుంటూరు (17202) ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు సిర్పూర్‌కాగజ్‌నగర్–సికింద్రాబాద్ (17234) ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 10,11,15,18,19,20వ తేదీల్లో గుంటూరు–సికింద్రాబాద్ (12705) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (12706) ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 11,14,16,18,19,20వ తేదీల్లో విజయవాడ–సికింద్రాబాద్(12713) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–విజయవాడ (12714) ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నం–ఎల్‌టీటీ ముంబాయి (18519) ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 12 నుంచి 22వ తేదీ వరకు ఎల్‌టీటీ ముంబాయి–విశాఖపట్నం (18520) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 20న సాయినగర్ షిర్డీ–కాకినాడ పోర్టు (17205) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 19న కాకినాడ పోర్టు–సాయినగర్‌షిర్డీ (17206) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 19, సాయినగర్ షిర్డీ–మచిలీపట్నం (17207) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 18న మచిలీపట్నం–సాయినగర్‌షిర్డీ (17208) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు టాటా–యశ్వంత్‌పూర్ శ్రీ(18111) ఎక్స్‌ప్రెస్, ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు యశ్వంత్‌పూర్–టాటా (18112) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు కొచ్చివెల్లి–కోబ్రా (22648) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు కోబ్రా–కొచ్చివెల్లి (22647) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు గోరఖ్‌పూర్–కొచ్చివెల్లి (12511) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 18,19న కొచ్చివెల్లి–గోరఖ్‌పూర్ (12512) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు హిసర్–తిరుపతి (04717) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు తిరుపతి–హిసర్ (04718) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 10 నుంచి 17 వరకు బెంగళూరు–దానాపూర్ (06509) ఎక్స్‌ప్రెస్, దానాపూర్–బెంగళూరు (06510) ఎక్స్‌ప్రెస్‌లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
దారి మళ్లింపు..
ఈ నెల 10,11,14,15,17,18,19,20వ తేదీల్లో కా జీపేట, వరంగల్ మీదుగా వెళ్లే 9 రైళ్లను వయా విజ యవాడ, గుంటూరు, సికింద్రాబాద్‌కు దారి మళ్లించినట్లు తెలిపారు. అదేవిధంగా నాలుగు రైళ్లను రీషె డ్యూల్ చేసి నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
16న చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీలు ఈ నెల 16వ తేదీన నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి కన్నా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వెంట చెస్ బోర్డు తెచ్చుకోవాలని సూచించారు. క్రీడాకారులు పేర్లు నమోదు, ఇతర వివరాలకు 90595 22986 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
లారీ డ్రైవర్, క్లీనర్లపై
ఫైనాన్స్ నిర్వాహకుల దాడి
వరంగల్/ఖిలా వరంగల్ : లారీ డ్రైవర్ అబ్బాస్‌ఖా న్, క్లీనర్ వసీంఖాన్‌పై దాడి చేసిన ఫైనాన్స్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు ఏనుమాముల ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. ఫైనాన్స్ బకా యిలు ఉన్నాయంటూ బుధవారం రాత్రి పది మంది యువకులు లేబర్ కాలనీ నుంచి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మార్గంలో ఆగి ఉన్న లారీ డ్రైవర్ అబ్బాస్‌ఖాన్, క్లీనర్ వసీంఖాన్‌పై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దాడిలో క్లీనర్ వసీంఖా న్ కాలు నుజ్జునుజ్జయిందన్నారు. బాధితుల ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఫైనాన్సర్ల వేధింపుల నుంచి రక్షించండి
లారీ యజమానులపై ఫైనాన్స్ ఏజెంట్ల ఆగడాలు, కలెక్షన్ ఏజెన్సీల పేరుతో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దాడులనుంచి రక్షణ కల్పించాలని ‘ది వరంగల్ జి ల్లా లారీ అసోసియేషన్’ అధ్యక్షుడు వేముల భూ పాల్ కోరారు. ఫైనాన్స్ కట్టలేదన్న నెపంతో అబ్బాస్‌ఖాన్, క్లీనర్ వసీంఖాన్‌లపై దాడి చేయడాన్ని ఖండించారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment