రూ. 76000 మ్యాక్‌బుక్‌ ఆర్డర్ చేస్తే.. ఏమొచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు! | Man Ordered rs 76000 apple macbook but he gets rs 3000 boat speakers | Sakshi
Sakshi News home page

Flipkart: రూ. 76000 మ్యాక్‌బుక్‌ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్!

Published Fri, Aug 25 2023 2:51 PM | Last Updated on Fri, Aug 25 2023 3:33 PM

Man Ordered rs 76000 apple macbook but he gets rs 3000 boat speakers - Sakshi

ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో ఏమి కావాలన్నా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, ఉన్న చోటే కావలసిన వస్తువులను పొందుతున్నారు. ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో బట్టల దగ్గర నుంచి ల్యాప్‌టాప్స్ వరకు అన్ని బుక్ చేసుకుంటున్నారు. ఈ ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్లలో అప్పుడప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. 'అథర్వ ఖండేల్‌వాల్' ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ మ్యాక్ బుక్ కోసం ఆర్డర్ చేసాడు. అయితే అతనికి డెలివరీ విషయంలో కొంత ఆలస్యం జరిగింది, కావున అతడే నేరుగా ఫ్లిప్‌కార్ట్‌ హబ్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకున్నాడు. అయితే పార్సిల్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. ఎందుకంటే అందులో మ్యాక్ బుక్ బదులు 'బోట్ స్పీకర్స్' ఉన్నాయి.

ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా?

నిజానికి అతడు బుక్ చేసుకున్న యాపిల్ మ్యాక్ బుక్ ధర రూ. 76000. అయితే అతనికి కేవలం రూ. 3000 విలువైన బోట్ స్పీకర్స్ రావడంతో ఒక్కసారిగా నిర్గాంతపోయాడు. అతనికి జరిగిన నష్టాన్ని రీఫండ్ చేయాలనీ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేసి అడిగితే వారు ఓపెన్ బాక్స్‌కు వర్తించే నో రీఫండ్ పాలసీ ప్రకారం, రీఫండ్ ఇవ్వడం కుదరదని చెప్పినట్లు సమాచారం. దీనికి సంబందించిన సమాచారం అతడు ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్లిప్‌కార్ట్ ల్యాప్‌టాప్ అమౌంట్ రీఫండ్ చేస్తుందా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement