ఓఎల్‌ఎక్స్‌లో సోఫా.. ఫోన్‌ చేసి కొంటామన్నారు కాకపోతే.. | Hyderabad: Man Lost Money Of Online Fraud | Sakshi
Sakshi News home page

ఓఎల్‌ఎక్స్‌లో సోఫా.. ఫోన్‌ చేసి కొంటామన్నారు కాకపోతే..

Published Wed, Aug 25 2021 8:52 AM | Last Updated on Wed, Aug 25 2021 9:50 AM

Hyderabad: Man Lost Money Of Online Fraud - Sakshi

సాక్షి,అంబర్‌పేట(హైదరాబాద్‌): సోఫా సెట్‌ అమ్ముతానని ఓఎల్‌ఎక్స్‌లో పోస్టులు పెట్టిన ఓ యువకుడికి సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. ఈ సంఘటన మంగళవారం అంబర్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవీందర్‌ సమాచారం మేరకు... బాగ్‌ అంబర్‌పేటలో నివసించే అక్షయ్‌ ఇంట్లో ఉన్న సోఫాను రూ. 9 వేలకు అమ్ముతానని ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దీనికి స్పందనగా సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి మీ సోఫా కొంటామని, ముందుగా క్యూ ఆర్‌ కోడ్‌ అందిస్తామని దాన్ని స్కాన్‌ చేయాలని కోరారు. క్యూ ఆర్‌ను స్కాన్‌ చేసిన అక్షయ్‌కు పంపారు. ఆ కోడ్‌ ఓపన్‌ చేసిన అతని ఖాతాలోంచి రూ. 63 వేలు కాజేశారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న అక్షయ్‌ అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: పక్కా ప్లాన్‌.. భర్తని అడ్డుతొలగించుకుంది

                 chicken: భర్త చికెన్‌ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement