సాక్షి,నిజామాబాద్ అర్బన్: బ్యాంక్ ఖాతాకు పాన్‌కార్డు లింక్ చేయమని వచ్చిన మెసేజ్ వచ్చింది. తన మొబైల్‌లో క్లిక్ చేసిన వ్యక్తి రూ. 4.90 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాలివి. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి బ్యాంక్ అకౌంట్‌కు పాన్‌కార్డు లింక్ చేయాలని సెప్టెంబర్ 30త తేదీ మెసేజ్ వచ్చింది. తన మొబైల్‌లో లింక్ క్లిక్ చేశాడు. కావలసిన సమాచారం అందించాడు.
అంతలోనే తన మొబైల్ నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌చేసి ఎస్‌బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పమని అడిగారు. ఆ నంబర్ చెప్పిన కాసేపటికే తన బ్యాంక్ ఖాతాలోని రూ.4.90 లక్షల 330 విత్‌డ్రా అయినట్లు మెస్సేజ్ వచ్చింది. అకౌంట్ నుంచి డబ్బు పోయినట్లు గుర్తించిన బాధితుడు శనివారం మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు. ఈ తరహాలో మోసపోతే 24 గంటల్లోపు 155260 లేదా డయల్ 100 కు ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు. గుర్తు తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దన్నారు.
చదవండి: కొడుకు పుడితేనే మా ఇంటికి రా..!.. భర్త, అత్త వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment