
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ & డేటా సెంటర్‌ను ప్రారంభించారు. దీనిద్వారా ఒకేసారి భారీ స్క్రీన్‌పై 5వేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉంది. 10 లక్షల కెమెరా దృశ్యాలను నెల రోజులపాటు స్టోర్ చేసేలా భారీ సర్వర్ల ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను కూడా సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే వీక్షించే అవకాశం ఉంది. (తప్పుడు సమాచారమిస్తే కఠిన చర్యలే)