హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామ సమీపంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న మహిళపై ఆగంతకుడు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారైయ్యాడు.
ఈ క్రమంలో సదరు మహిళ బైక్‌పై నుంచి కిందపడి ... తీవ్రంగా గాయపడ్డింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.