దొంగకు షాకిచ్చిన మహిళ | The woman shocked the thief | Sakshi
Sakshi News home page

దొంగకు షాకిచ్చిన మహిళ

Jan 4 2016 3:40 PM | Updated on Sep 4 2018 5:07 PM

నగరంలో గొలుసు దొంగతనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

నగరంలో గొలుసు దొంగతనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రోడ్లపై నడుచుకుంటూ వెళ్లేవారినీ, పొద్దునే వాకింగ్‌కు వెళ్లే మహిళలనే టార్గెట్‌గా చేసుకునే చైన్‌స్నాచర్..తాజాగా రూటు మార్చారు. ఇళ్లలోకి చొరబడి మరీ దొంగతనాలకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం ఇలాంటి సంఘటనే మీర్‌పేటలో చోటుచేసుకుంది.

మీర్‌పేట పరిధిలోని మిథిలానగర్‌లో ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి అనురాధ(28) అనే మహిళ మెడలోని తాళిబొట్టును అపహరించేందుకు ప్రయత్నించాడు. అనురాధ తీవ్రంగా ప్రతిఘటించడంతో తాళిబొట్టును వదిలేసి దుండగుడు పరారయ్యాడు. తాళిబొట్టు దొంగిలించే సమయంలో దుండగుడు ఆమె ముఖం మీద ముసుగు వేయడంతో దుండగుడిని గుర్తుపట్టలేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement