గొలుసు వదిలి పరారైన చైన్ స్నాచర్ | chain snatcher ran away in hyderabad | Sakshi
Sakshi News home page

గొలుసు వదిలి పరారైన చైన్ స్నాచర్

Published Thu, Nov 12 2015 10:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

గొలుసు వదిలి పరారైన చైన్ స్నాచర్

గొలుసు వదిలి పరారైన చైన్ స్నాచర్

హైదరాబాద్ : స్కూల్లో పిల్లల్ని దింపి ఇంటి తిరిగి నడిచి వెళ్తున్న అనిత (30) అనే మహిళపై చైన్ స్నాచర్ దాడి చేసి... మెడలో గొలుసు లాక్కుని... పరారవుతున్న క్రమంలో కిందపడ్డాడు. ఇంతలో తెరుకున్న అనిత బిగ్గరగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దాంతో చైన్ స్నాచర్ గొలుసు వదిలి కొద్దిదూరంలో బైక్పై వెయిట్ చేస్తున్న వ్యక్తితో కలసి పరారయ్యాడు.

స్థానికులు బైక్పై వెంబడించిన... చైన్ స్నాచర్లు మాత్రం కన్ను తెరచి మూసే లోపు మాయమయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మీర్పేట ఆర్ఎన్రెడ్డి నగర్లో గురువారం చోటు చేసుకుంది. అనిత పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement