meerpet hyderabad
-
ఆ సినిమా చూసి.. మాధవి కేసులో మరిన్ని కొత్త విషయాలు!
హైదరాబాద్, సాక్షి: సంచలనం సృష్టించిన మీర్‌పేట వెంకట మాధవి హత్య కేసులో.. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. మలయాళ హిట్ మూవీ సూక్ష్మదర్శిని ప్రేరణతోనే గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని మాయం చేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు.. ఈ కేసు దాదాపుగా ఓ కొలిక్కి రావడంతో నిందితుడిపై పోలీసులు చర్యలకు దిగనున్నారు.వెంకట మాధవి మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో అనే ఆలోచనలో గురుమూర్తికి ఈ ఆలోచన తట్టింది. సూక్ష్మదర్శిని సినిమా తరహాలోనే మృతదేహాన్ని డిస్పోస్ చేశాడు గురుమూర్తి. ఆ చిత్రంలో మాదిరే.. భార్య మాధవి మృతదేహాన్ని కెమికల్స్‌లో నానబెట్టి, ఆపై కాల్చి పొడి చేశాడు గురుమూర్తి. ఇవాళ డీఎన్ఏ రిపోర్ట్‌తో పాటు క్లూస్‌టీం ఆధారంగా ఇచ్చే నివేదిక వచ్చే అవకాశం ఉంది. దీంతో.. సాయంత్రంలోగా నిందితుడపై యాక్షన్‌కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.నజ్రియా, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో ఎం.సి.జతిన్ రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’. మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం ప్రస్తుతం అందుబాటులో ఉంది. తన చుట్టు పక్కల జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ ఉన్న ఇల్లాలు.. తన పక్క ఇంట్లో జరిగిన ఓ ఘోరమైన నేరాన్ని ఎలా బయట పెట్టిందన్నది ఈ చిత్ర కథ.దుర్వాసన రాకుండా..మీర్‌పేట పరిధి జిల్లెలగూడ న్యూవెంకటేశ్వరనగర్ కాలనీలో ఉండే మాజీ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకాశం జిల్లాలోని సొంతూరులో మరో మహిళతో వివాహేతర బంధం వ్యవహారం తెలిసినప్పుడు భార్య తరఫు కుటుంబీకులు గురుమూర్తిపై దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు భార్య మరణం విషయం తెలిస్తే దారుణంగా స్పందిస్తారేమోనని భయపడ్డాడు. ఇంటర్నెట్లో మృతదేహం ఎలా ముక్కలు చేయాలని వెతికాడు. చైతన్యపురిలో నర్సు హత్య ఉదంతంతోపాటు వెబ్‌సిరీస్‌లు, సినిమాల ప్రేరణ పొందాడు. ఇంట్లో అందుబాటులో ఉన్న హ్యాక్సా బ్లేడుతో తలను వేరుచేసి మొండేన్ని మూడు ముక్కలు చేశాడు. ఆ తర్వాత బకెట్లో వేడినీటిలో ముక్కల్ని ఉడికించిన తర్వాత మళ్లీ పెద్ద స్టవ్ మీద కాల్చాడు. ఈ క్రమంలో ముక్కలు మాంసం ముద్దలుగా మారిపోయాయి. పొరుగింట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని ద్రావణాలు వాడాడు. సాయంత్రం వరకూ ఈ పనిపూర్తి చేసి మీర్‌పేటలోని పెద్ద చెరువులో వేశాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్లు భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంకట మాధవి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాక అతడిచ్చిన సమాచారంతో చెరువులో మృతదేహం ముక్కల కోసం పోలీసులు వెతికారు. ఎలాంటి ఆనవాళ్లు లభించక.. పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే దఫదఫాలుగా ఫోరెన్సిక్, క్లూస్‌టీంలతో ఇంటిని పరిశీలించినప్పుడు తల వెంట్రుకలు, స్టవ్, వాటర్ బకెట్, హీటర్ వద్ద కొన్ని రక్తం, ఆనవాళ్లు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి విశ్లేషించారు. ఇవన్నీ వెంకట మాధవివేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇక ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ పోలీసులకు కొత్త విషయాలు వెలుగు తెలుస్తున్నాయి. ఘటన తర్వాత ఎనిమిది సార్లు గురుమూర్తి ఫోన్ మాట్లాడాడు. అందులో.. బడంగ్‌పేటలో ఉన్న సోదరితోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితుడి ఫోన్ కాల్ డాటా సేకరణలో ఈ విషయాలు వెలుగు చూశాయి. -
మీర్పేట్ మాధవి కేసు..దర్యాప్తులో కీలక ముందడుగు
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. భర్త గురుమూర్తే వెంకట మాధవిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేశారు. గురుమూర్తిపై బీఎన్ఎస్(BNS) 101 సెక్షన్ పెట్టారు.క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలను పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపారు. వెంకటమాధవిగా భావిస్తున్న శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలను ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపారు. మాధవి పిల్లలు, తల్లి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించారు. వీటితో మాధవి డీఎన్ఏ మ్యాచింగ్ కోసమే ఫోరెన్సిక్ పరీక్షలకు పోలీసులు నిర్ణయించారు. మరికొన్ని గంటల్లో పోలీసులకు డీఎన్ఏ నివేదిక చేరనుంది. డీఎన్ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.ఇక, ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు విషయమై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. కాగా, నేడు పోలీసుల చేతికి డీఎన్ఏ రిపోర్టు అందే అవకాశం ఉంది.కేసులో ఈ పురోగతితో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించినట్లయింది. కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. డీఎన్ఏ పరీక్షలతో కేసును పోలీసులు కొలిక్కి తీసుకొస్తున్నారు. -
మీర్పేట్ మర్డర్ మిస్టరీ కొత్త టెక్నాలజీతో కేసు విచారణ
-
యజమాని వేధింపులు..శానిటైజర్ తాగిన యువతి
-
వారు పండుగకు వెళ్లారు.. వీరు ఇళ్లు చక్కబెట్టారు
సాక్షి, దిల్సుఖ్నగర్: హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. పండుగ సందర్భంగా ఊరెళ్లగా ఏకకాలంలో మూడు ఇళ్లలో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. రాఘవ నగర్ కాలనీలో ఇరిగేషన్ డిపార్టుమెంట్లో ఇ.ఇగా పనిచేస్తున్న ఖాసీం ఇంట్లో 35 తులాల బంగారం, రూ.4లక్షల నగదు చోరీ చేశారు. ప్రగతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మీర్పేట్ పోలీసు స్టేషన్ హోంగార్డు మదనాచారి ఇంట్లో 2.5తులాల బంగారంచ రూ.10 వేల నగదు చోరీ చేశారు. అలాగే ప్రగతి నగర్ కాలనీ ఆటో డ్రైవర్ శివ ఇంట్లో 2 తులాల బంగారం, రూ.15 వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చెడ్డీ గ్యాంగ్ ముఠా వీరంగం
-
గొలుసు వదిలి పరారైన చైన్ స్నాచర్
హైదరాబాద్ : స్కూల్లో పిల్లల్ని దింపి ఇంటి తిరిగి నడిచి వెళ్తున్న అనిత (30) అనే మహిళపై చైన్ స్నాచర్ దాడి చేసి... మెడలో గొలుసు లాక్కుని... పరారవుతున్న క్రమంలో కిందపడ్డాడు. ఇంతలో తెరుకున్న అనిత బిగ్గరగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దాంతో చైన్ స్నాచర్ గొలుసు వదిలి కొద్దిదూరంలో బైక్‌పై వెయిట్ చేస్తున్న వ్యక్తితో కలసి పరారయ్యాడు. స్థానికులు బైక్‌పై వెంబడించిన... చైన్ స్నాచర్లు మాత్రం కన్ను తెరచి మూసే లోపు మాయమయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట ఆర్‌ఎన్‌రెడ్డి నగర్లో గురువారం చోటు చేసుకుంది. అనిత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.