సాక్షి, దిల్‌సుఖ్‌నగర్: హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. పండుగ సందర్భంగా ఊరెళ్లగా ఏకకాలంలో మూడు ఇళ్లలో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. రాఘవ నగర్ కాలనీలో ఇరిగేషన్ డిపార్టుమెంట్‌లో ఇ.ఇగా పనిచేస్తున్న ఖాసీం ఇంట్లో 35 తులాల బంగారం, రూ.4లక్షల నగదు చోరీ చేశారు. ప్రగతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మీర్‌పేట్ పోలీసు స్టేషన్ హోంగార్డు మదనాచారి ఇంట్లో 2.5తులాల బంగారంచ రూ.10 వేల నగదు చోరీ చేశారు. అలాగే ప్రగతి నగర్ కాలనీ ఆటో డ్రైవర్ శివ ఇంట్లో 2 తులాల బంగారం, రూ.15 వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.