Woman Ran Away with Lover Abroad Living Husband - Sakshi
Sakshi News home page

సీమా హైదర్‌, అంజూ తరహాలో రాజస్థాన్‌ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు..

Published Tue, Aug 15 2023 12:51 PM | Last Updated on Tue, Aug 15 2023 2:41 PM

Woman Ran Away with Lover Abroad Leaving Husband - Sakshi

సీమా హైదర్‌, అంజూల తరువాత రాజస్థాన్‌లోని డూంగర్‌పూర్‌ జిల్లాకు చెందిన దీపిక ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. దీపిక తన భర్త, పిల్లలను వదిలేసి తన ప్రియునితో విదేశాలకు వెళ్లిపోయిందని సమాచారం. ఈ విషయమై ఇటీవలే దీపిక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. ఇప్పటి వరకూ పోలీసులకు ఆమె ఆచూకీ తెలియలేదు. స్థానికులు ఈ వ్యవహారాన్ని లవ్‌ జిహాద్‌ అని చెబుతున్నారు. 

ఈ ఘటన డూంగర్‌పూర్‌ జిల్లాలోని భౌమయీ గ్రామంలో  చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తమ ఇంటిలో చెప్పకుండా జూలై 10న మరో వర్గానికి చెందిన యువకునితో విదేశాలకు వెళ్లిపోయింది. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తెకు 11 ఏళ్లు, మరొక కుమార్తెకు 7 ఏళ్లు. భార్య ఉన్నట్టుండి ఇంటినుంచి మాయం కావడంతో భర్త.. చిత్రీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో స్థానికులు ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. 

మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో పాటు గ్రామంలో ఉంటుంది. ముంబైలో భర్త పనిచేస్తుంటాడు. అయితే భర్తకు  తెలియకుండా ఆమె వైద్యచికిత్స పేరుతో గుజరాత్‌, ఉదయ్‌పూర్‌ ప్రాంతాలకు తరచూ వెళుతుంటుంది. ఇదేవిధంగా జూలై 10న ఆమె అనారోగ్యానికి చికిత్స పేరుతో గుజరాత్‌ వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు.

అయితే ఆమె భర్తకు వాట్సాప్‌ కాల్‌ చేసి ‘నువ్వు నాతో సంతోషంగా లేవు. అందుకే నేను నీకు దూరం అవుతున్నాను’ అని తెలిపింది. ఈ మాటలు వినగానే భర్తకు గుండె గుభేల్‌మంది. వెంటనే అతను హడావుడిగా ముంబై నుంచి గ్రామానికి వచ్చి చూడగా, ఇంటిలో భార్య లేదు. అలాగే ఇంటిలోని విలువైన నగలు, నగదు కూడా మాయమయ్యింది. వెంటనే భర్త తన భార్య మాయమవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

ఈ విషయమై చిత్రీ పోలీస్‌స్టేషన్‌ అధికారి గోవింద్‌ సింగ్‌ మాట్లాడుతూ ముఖేష్‌ పాటీదార్‌ అనే వ్యక్తి తన భార్య దీపిక మాయమయ్యిందంటూ జూలై 7 ఫిర్యాదు చేశాడని తెలిపారు. దర్యాప్తులో ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు లభ్యమయ్యాయని తెలిపారు. వాటిలో ఆమె బుర్ఖా ధరించిన ఒక యువకుని పక్కన కనిపిస్తున్నదన్నారు. ఈ విషయమై స్థానికులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ మహిళ కువైట్‌ వెళ్లివుంటుందని అంటున్నారు. 
ఇది కూడా చదవండి: ‘నా కల సాకారమైన వేళ..’ అరబిందో స్ఫూర్తిదాయక సందేశం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement