ran away
-
డీ అడిక్షన్ సెంటర్ నుంచి 13 మంది యువతులు పరార్..
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాకు చెందిన పర్వానూలో డీ అడిక్షన్ సెంటర్ (మత్తు పదార్థాల వినియోగం నుంచి విముక్తి కల్పించే సంస్థ) నుంచి 13 మంది యువతులు పారిపోయారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. అనంతరం బాలికలను అడవిలో గుర్తించి, రక్షించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పర్వానూలోని ఖాదిన్ గ్రామంలో డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ ఉంది. ఇక్కడ మొత్తం 17 మంది బాలికలు చికిత్స పొందుతున్నారు. శనివారం 13 మంది బాలికలు సెంటర్లోని కిటికీ అద్దాలు పగులగొట్టుకుని, బయటపడి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. అయితే డి-అడిక్షన్ సెంటర్ సిబ్బంది పోలీసుల సహకారంతో ఈ యువతులను వెదికిపట్టుకుని తిరిగి సెంటర్‌కు తరలించారు. ఈ ఘటన డీ అడిక్షన్ సెంటర్ల పనితీరుపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సెంటర్లో పంజాబ్ హర్యానాలకు చెందిన యువతులు చికిత్స పొందుతున్నారు. పంజాబ్‌లో డీ-అడిక్షన్ సెంటర్లపై నిషేధం విధించిన తర్వాత మత్తుమందు బాధితులు చికిత్స కోసం హర్యానా, హిమాచల్‌లకు వస్తున్నారు. అయితే హిమాచల్‌లో డీ అడిక్షన్ సెంటర్లు ప్రారంభించినప్పటి నుండి ఈ సెంటర్లలో పలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. కాగా డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ల నుంచి పారిపోయిన యువతులు.. పోలీసుల విచారణలో తమకు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదని అందుకే పారిపోయామని ఫిర్యాలు చేశారు. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక ఎస్పీ సోలన్ తెలిపారు. ఇది కూడా చదవండి: కొత్త ఏడాదిలో నూతన ఎక్స్‌ప్రెస్‌వే.. నాలుగు రాష్ట్రాలకు నజరానా! -
సీమా హైదర్, అంజూ తరహాలో రాజస్థాన్ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు..
సీమా హైదర్, అంజూల తరువాత రాజస్థాన్‌లోని డూంగర్పూర్ జిల్లాకు చెందిన దీపిక ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. దీపిక తన భర్త, పిల్లలను వదిలేసి తన ప్రియునితో విదేశాలకు వెళ్లిపోయిందని సమాచారం. ఈ విషయమై ఇటీవలే దీపిక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకూ పోలీసులకు ఆమె ఆచూకీ తెలియలేదు. స్థానికులు ఈ వ్యవహారాన్ని లవ్ జిహాద్ అని చెబుతున్నారు. ఈ ఘటన డూంగర్పూర్ జిల్లాలోని భౌమయీ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తమ ఇంటిలో చెప్పకుండా జూలై 10న మరో వర్గానికి చెందిన యువకునితో విదేశాలకు వెళ్లిపోయింది. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తెకు 11 ఏళ్లు, మరొక కుమార్తెకు 7 ఏళ్లు. భార్య ఉన్నట్టుండి ఇంటినుంచి మాయం కావడంతో భర్త.. చిత్రీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో స్థానికులు ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో పాటు గ్రామంలో ఉంటుంది. ముంబైలో భర్త పనిచేస్తుంటాడు. అయితే భర్తకు తెలియకుండా ఆమె వైద్యచికిత్స పేరుతో గుజరాత్, ఉదయ్‌పూర్ ప్రాంతాలకు తరచూ వెళుతుంటుంది. ఇదేవిధంగా జూలై 10న ఆమె అనారోగ్యానికి చికిత్స పేరుతో గుజరాత్ వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. అయితే ఆమె భర్తకు వాట్సాప్ కాల్ చేసి ‘నువ్వు నాతో సంతోషంగా లేవు. అందుకే నేను నీకు దూరం అవుతున్నాను’ అని తెలిపింది. ఈ మాటలు వినగానే భర్తకు గుండె గుభేల్మంది. వెంటనే అతను హడావుడిగా ముంబై నుంచి గ్రామానికి వచ్చి చూడగా, ఇంటిలో భార్య లేదు. అలాగే ఇంటిలోని విలువైన నగలు, నగదు కూడా మాయమయ్యింది. వెంటనే భర్త తన భార్య మాయమవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయమై చిత్రీ పోలీస్‌స్టేషన్ అధికారి గోవింద్ సింగ్ మాట్లాడుతూ ముఖేష్ పాటీదార్ అనే వ్యక్తి తన భార్య దీపిక మాయమయ్యిందంటూ జూలై 7 ఫిర్యాదు చేశాడని తెలిపారు. దర్యాప్తులో ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు లభ్యమయ్యాయని తెలిపారు. వాటిలో ఆమె బుర్ఖా ధరించిన ఒక యువకుని పక్కన కనిపిస్తున్నదన్నారు. ఈ విషయమై స్థానికులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ మహిళ కువైట్ వెళ్లివుంటుందని అంటున్నారు. ఇది కూడా చదవండి: ‘నా కల సాకారమైన వేళ..’ అరబిందో స్ఫూర్తిదాయక సందేశం! -
విపక్షాలు పారిపోయాయి
న్యూఢిల్లీ: విపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభ నుంచి పారిపోయాయని ఎద్దేవా చేశారు. దాన్ని దేశమంతా వీక్షించిందన్నారు. మణిపూర్ హింసాకాండపై చర్చ విషయంలో వాటికి చిత్తశుద్ధే లేదని ఆరోపించారు. మణిపూర్ ప్రజలకు అవి ద్రోహం చేశాయన్నారు. ప్రజా సంక్షేమం కంటే స్వార్థ రాజకీయాలకే విపక్షాలు ప్రాధాన్యమిచ్చాయని దుమ్మెత్తిపోశారు. దాంతో కీలక సమస్యలకు పార్లమెంటులో చర్చ ద్వారా పరిష్కారం సాధించే సువర్ణావకాశం చేజారిందని ఆవేదన వెలిబుచ్చారు. దేశవ్యాప్తంగా విపక్షాలు వ్యాప్తి చేస్తున్న ప్రతికూల భావజాలాన్ని తమ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. పశి్చమ బెంగాల్లో పంచాయతీ రాజ్ పరిషత్‌ను ఉద్దేశించి శనివారం మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. వారికి రాజకీయాలే ముఖ్యం రెండు రోజుల క్రితమే విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని 140 కోట్ల భారతీయుల ఆశీర్వాదంతో ఓడించామని మోదీ అన్నారు. ‘అలాగే వారు వ్యాప్తి చేస్తున్న ప్రతికూలతనూ ఓడించాం. మణిపూర్ అంశంపై చర్చించాలని కేంద్రం భావిస్తోందంటూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యే ముందే విపక్షాలకు లేఖ రాశామని. కానీ ఏం జరిగిందో మీరంతా చూశారు. దానిపై చర్చను అవే అడ్డుకున్నాయి. అంతటి సున్నిత అంశంపై చర్చ జరిగి ఉంటే మణిపూర్ ప్రజలకు కాస్త ఊరటన్నా దక్కి ఉండేది. సమస్యకు కొన్నయినా పరిష్కారాలు దొరికి ఉండేవి. కానీ మణిపూర్ హింసాకాండకు మూల కారణానికి సంబంధించిన వాస్తవాలు విపక్షాలను ఎంతో బాధిస్తాయి. కనుక కావాలనే చర్చను జరగనీయలేదు. అసలు పార్లమెంటులో ఏ చర్చ జరగడమూ వారికి ఇష్టం లేదు. ప్రజల బాధ వాటికి పట్టదు కావాల్సిందల్లా కేవలం రాజకీయాలు’ అంటూ తూర్పారబట్టారు. విపక్షాల నిజ రూపాన్ని దేశ ప్రజల ముందు బట్టబయలు చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ప్రజల విశ్వాసమే నాకు స్ఫూర్తినిస్తుంది. నా ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది’ అని అన్నారు. మమతది అరాచక పాలన గత నెల బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విపక్షాలను భయభ్రాంతులను చేసేందు కు పాలక తృణమూల్ కాంగ్రెస్ భాయోతోత్పాతానికి, బెదిరింపులకు దిగిందని విమర్శించారు. పైగా ప్రజాస్వామ్య పరిరక్షకుల్లా పోజు లు కొడుతోందని మండిపడ్డారు. -
వీడేం లవర్‌రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది..
ప్రేమంటే ఏంటో నాకు నీ వల్లే తెలిసింది.., గుండె మాత్రం నాదే.. కానీ అది చేసే చప్పుడు నీది.., ఒకటా రెండా.. ఎన్ని కబుర్లు చెబుతారో ప్రేమలో ఉన్నప్పుడు. బాబోయ్.. వీళ్ల మాటలను కుప్పేస్తే.. కాళిదాసుకు కూడా కన్నీరొస్తుంది! కానీ అసలు పరీక్ష ఎదురైనప్పుడు కదా..! ఆ ప్రేమకు కడదాక అండగా నిలబడగలిగేదెవరో తెలిసేది. ప్రాణ సంకటం ఎదురైనప్పుడు కదా..! ప్రేమికురాలికి నిజం తెలిసేది. సరిగ్గా ఇలాంటి సంఘటన గురించే మీరు తెలుసుకోబోతున్నారు. ఓ ప్రేమ జంట చేతిలో చేయి వేసుకుని రోడ్డు వెంట నడుస్తున్నారు. బహుశా.. తమ మనసులు మ్యాచ్ అయ్యాయని చెప్పడానికనుకుంట.. మ్యాచింగ్ డ్రస్‌లు వేసుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు వారిని అడ్డగించారు. కత్తితో బెదిరించి ఆ అమ్మాయి వద్ద ఉన్న బ్యాగ్‌ను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో భయపడిన ప్రియుడు పలాయనం చిత్తగించాడు. దిక్కుతోచని స్థితిలో ఆ అమ్మాయి.. దొంగపై ఏ మాత్రం ప్రతిఘటన చేయకుండా ప్రియుని వైపు, దొంగ వైపు చూస్తూ దీనంగా ఉండిపోయింది. బ్యాగును దొంగ కొట్టేయడం కంటే ప్రియుడి స్వభావమే ఎక్కువగా బాధ కలిగించినట్లు అతని వైపే చూసింది. ఈ ఘటనతో బైక్ ఎక్కి పారిపోయే ప్రయత్నం చేసిన దొంగ మనసు కరిపోయింది. ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పి బ్యాగును తిరిగి ఇచ్చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్య మాల్లో తెగ వైరల్ అయింది. Her lover ran away but the robber felt sorry for her. 😂pic.twitter.com/owFtEGVHPE — The Best (@Figensport) June 27, 2023 వీడియోపై నెటిజన్ల స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. ప్రేమ పరీక్షలో ప్రియుడు విఫలమయ్యాడని కొందరు కామెంట్ చేశారు. లవర్ పారిపోకపోతే.. ఆ దొంగకు సానుభూతి కలిగేది కాదని మరికొందరు స్పందించారు. ఈ క్రెడిట్ కూడా ప్రియుడిదే అని కొందరు చెప్పుకొచ్చారు. మరికొంత మంది నెటిజన్లు దొంగ స్వభావాన్ని మెచ్చుకున్నారు. ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో -
నిశ్చితార్ధం చెడగొట్టి ఆమెతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ముహుర్తం టైమ్‌కి..
సాక్షి, సంగారెడ్డి: వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లలో చెప్పి ఎంతో కష్టం మీద పెళ్లికి ఒప్పించారు. తీరా.. పెళ్లి సమయానికి వరుడు వివాహ వేడుక నుంచి పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కాగా, వరుడు వెళ్లిపోడానికి కారణం తెలిసి అక్కడున్న వారంత ఖంగుతిన్నారు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అతనికి తమ కూతురుని ఇవ్వడానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాకుండా.. ఈ ఏడాది జనవరిలో ఇదే జిల్లా కంగ్టి మండలానికి చెందిన ఓ యువకుడితో అమ్మాయికి నిశ్చితార్థం జరిపించారు. ఇక, తన లవర్ పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియుడు రంగంలోకి దిగాడు. నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తికి ఫోన్ చేసి తాను యువతిని ప్రేమిస్తున్నానని, వదిలేయాలని బెదిరించాడు. దీంతో, ఈ విషయాన్ని పెళ్లి కూతురు పేరెంట్స్ చెప్పి అతను పెళ్లికి నిరాకరించాడు. దీంతో, వధువు పేరెంట్స్ చేసేదేమీ లేక.. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకున్నారు. అనంతరం, పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కొండాపూర్ మండలంలోని ఒక గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే, పెళ్లికి కొద్ది గంటలే సమయం ఉందనగా వరుడు ప్లేట్ ఫిరాయించాడు. తనకు కట్నంగా రూ.15 లక్షలు ఇస్తేనే తాళి కడతానని మొండికేసి కూర్చున్నాడు. దీంతో, అంత ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబీకులు చెప్పినా వరుడు వినిపించుకోలేదు. అనంతరం.. అందరి కళ్లుగప్పి పెళ్లి పీటలపై నుంచే పరారయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా, ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత వధువు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: త్వరలో సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య.. వందేభారత్ -
వాహనదారుడి దాష్టికం! కారుతో కానిస్టేబుల్ కాలుని తొక్కించి...
సాక్షి, బంజారాహిల్స్: ఫ్రీ లెఫ్ట్‌లో కారును అడ్డు తొలగించాలని కోరిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై వాహనదారుడు కారుతో కాలును తొక్కించడమే కాకుండా దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని తాజ్‌కృష్ణా జంక్షన్లో ఓ కారు డ్రైవర్ ఫ్రీ లెఫ్ట్‌లో కారు నిలపడంతో అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎల్.నగేష్ అడ్డు తొలగాలని సైగలు చేశాడు. అయినాసరే సదరు వాహనదారుడు వినిపించుకోలేదు. వెంటనే కానిస్టేబుల్ ఆ కారు దగ్గరికి వెళ్ళగా ఆగ్రహంతో ఊగిపోతున్న డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్ కాలుపైకి కారును పోనిచ్చాడు. అంతే కాకుండా కిందకు దిగి పిడిగుద్దులతో దాడి చేసి చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ బట్టలు కూడా చిరిగాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
తెల్లారితే పెళ్లి.. ఊహించని ట్విస్టు ఇచ్చిన వధువు
గౌరిబిదనూరు: తెల్లవారితే పెళ్లి.. కుటుంబ సభ్యులు, బంధువులతో ఇళ్లంతా కలకలలాడుతోంది. వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటున్న వరుడికి.. ఇంటి సభ్యులకు వధువు ఊహించని షాకిచ్చింది. రాత్రికి రాత్రే తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9:30 గంటలకు విదురాశ్వత్థం చన్నరాయస్వామి కల్యాణ మండపంలో వివాహం జరగాల్సి ఉండగా ఆ పెళ్లి నిలిచిపోయింది. వధువు పరారు కావడమే ఇందుకు కారణం. నగర శివారులోని నాగరెడ్డి కాలనీకి చెందిన వెన్నెల(22), కరేకల్లహళ్లివాసి సురేశ్‌కు పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం రాత్రి నిబ్బళం జరిపించి అందరూ నిద్రపోయారు. అప్పిరెడ్డిహళ్లికి చెందిన తన ప్రియుడు, మేనమామ అయిన ప్రవీణ్ (25)తో గుట్టుగా పరారైంది. ఉదయం చూస్తే వధువు లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయం ముందే చెప్పి ఉంటే మేనమామతోనే పెళ్లి చేసేవారమని వారిమని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెళ్లి కొడుకు సైతం తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఇది కూడా చదవండి: భర్త మృతదేహంతో రెండు రోజులు ఇంట్లోనే.. -
హత్యకేసులో ఆధారాలు ఎత్తుకెళ్లిన కోతి!
జైపూర్: ఓ హత్య కేసులో కోర్టు ఎదుట హాజరైన పోలీసులు చెప్పిన సమాధానం విని జడ్జి బిత్తర పోయారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలన్నింటిని ఓ కోతి ఎత్తుకెళ్లిపోయిందట. ఈ ఘటన రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది. ఓ హత్య కేసులో పోలీసులు.. హత్యకు ఉపయోగించిన ఆయుధం, ఇతర వస్తువులను ఓ బ్యాగ్‌లో ఉంచారట. అయితే ఆ సంచిని కోతి ఎత్తుకెళ్లిందని పోలీసులు, కోర్టు ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. 2016, సెప్టెంబర్‌లో.. జైపూర్ చాంద్వాజీ సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శశికాంత్ శర్మ అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన తర్వాత న్యాయం కోసం మృతదేహాంతో అతని కుటుంబం ఢిల్లీ-జైపూర్ హైవేని దిగ్భంధించింది కూడా. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఐదురోజుల తర్వాత రాహుల్, మోహన్‌లాల్ కండేరా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే స్టేషన్లో జాగా లేకపోవడంతో.. ఈ కేసులో సేకరించిన పూర్తి ఆధారాలను ఓ బ్యాగులో ఉంచి.. స్టేషన్ బయట ఓ చెట్టుకింద పెట్టాడట డ్యూటీ కానిస్టేబుల్. ఆ టైంలో కోతి వచ్చి ఆ బ్యాగును ఎత్తుకెళ్లిందట. ఈ కేసులో కోర్టు విచారణ.. ఏళ్ల తరబడి సాగింది. ఈమధ్యే ఈ కేసు విచారణకు రాగా.. ఆ సమయంలో ఎవిడెన్స్ ఏవని? జడ్జి ప్రశ్నించారు. దీంతో.. కోతి ఎత్తుకెళ్లిందని సమాధానం ఇచ్చారు పోలీసులు. ఆ బ్యాగులో మొత్తం 15 వస్తువులు కేసుకు సంబంధించినవి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసులు కోర్టుకు సమర్పించిన రాత పూర్వక స్టేట్మెంట్లో.. ఈ విషయాన్ని కింది న్యాయస్థానానికి తెలియజేశామని, ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలియజేసింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ను ఘటన తర్వాత సస్పెండ్ చేశారట. ఆ తర్వాత ఆయన రిటైర్డ్ కావడంతో పాటు మరణించాడని సదరు స్టేట్మెంట్లో కోర్టుకు వివరించారు పోలీసులు. ఇది కోతి కథతో పోలీసులు ఇచ్చిన వివరణ. -
UP News: కటౌట్ చూసి పరిగెత్తాలి డ్యూడ్
కటౌట్లంటే రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు భారీ ప్రచారమనే విషయం చెప్పనక్కర్లేదు. కానీ, వైవిధ్యమైన ఆలోచనలు ఎప్పుడూ జనాల ఆసక్తిని తమ వైపు మళ్లించుకుంటాయి. ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా అలాంటి దృశ్యమే ఒకటి కనిపించింది. యూపీ మీరట్‌లో కోతులను తరిమేందుకు అటవీ అధికారులు.. కొండముచ్చుల (కొండెంగల) కటౌట్లను ఉంచారు. మరి ఈ ఐడియా ఫలితం ఇచ్చిందా?.. ఇచ్చిందనే అంటున్నారు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజేశ్ కుమార్. ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చిందని, చిన్నచిన్న మార్పులతో ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. కోతుల బెడదతో ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టేందుకే జనాలు వణికిపోయిన రోజులున్నాయి. ఈ తరుణంలో అధికారులు ఇలా కటౌట్ల ప్రయోగంతో కోతుల్ని తరమడం విశేషం. ఇదివరకు లక్నో మెట్రో స్టేషన్లో ఇలా కొండముచ్చుల Langoor Cutouts కటౌట్లతో ఫలితం రాబట్టారు అధికారులు. అదే చూసే మీరట్ అధికారులు ఈ పని చేశారు. అఫ్కోర్స్.. ఇదేం కొత్త ఐడియా కాదు.. చాలా చోట్ల చూసే ఉంటారు. -
ఢిల్లీ చూడాలని.. 15 ఏళ్ల బాలిక..
ధర్మవరం అర్బన్: దేశ రాజధాని ఢిల్లీ చూడాలన్న మోజుతో ఓ బాలిక ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ధర్మవరం పోలీసులు రంగంలోకి దిగి మధ్యప్రదేశ్‌లో పట్టుకున్నారు. ఆ బాలికను తిరిగి తల్లి వద్దకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ కరుణాకర్ ధర్మవరం అర్బన్ పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని పీఆర్టీ వీధిలో తరుగు ఆదిలక్ష్మి కుటుంబం నివాసం ఉంటోంది. ఈమెకు 15 ఏళ్ల వయసు గల కుమార్తెతో పాటు కుమారుడు ఉన్నారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఎక్కువగా టీవీ, సెల్‌ఫోన్ చూస్తుండిపోయిన కుమార్తె ఢిల్లీలోని పలు ప్రదేశాలను చూడాలనిపిస్తోందని తల్లి వద్ద అంటుండేది. ఎలాగైనా అక్కడికి వెళ్లాలనుకున్న కుమార్తె అందుకు అవసరమైన డబ్బు కోసం తల్లి భద్రపరుచుకున్న రూ.లక్ష నగదు బ్యాగును తీసుకుని సెప్టెంబర్ 24న తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. (చదవండి: గృహ నిర్మాణ శాఖలో కొండంత అవినీతి..) స్పందించిన పోలీసులు.. తన కూతురు కనిపించడం లేదని ఆదిలక్ష్మి అదే రోజు సాయంత్రం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలిక వద్ద గల సెల్‌నంబర్‌ను ట్రేస్ చేయగా ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తిరుపతికి చేరుకుని, అక్కడి నుంచి వేలూరుకు వెళ్లేందుకు బస్టాండ్‌లో ఉన్నట్లు తేలింది. 25వ తేదీ సాయంత్రం 6.20 గంటలకు మొబైల్ ఆన్ చేయగా సిగ్నల్ లొకేషన్ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ చూపించింది. అదేరోజు రాత్రి 8.15గంటలకు సెల్ లొకేషన్ ద్వారా జీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళుతున్నట్లు తెలిసింది. 26వ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో జీటీ ట్రైన్‌లోని జనరల్ బోగీలో ఉన్నట్లు గుర్తించి మధ్యప్రదేశ్‌లోని ఇటార్శి రైల్వేస్టేషన్లో జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి జీఆర్పీ పోలీసులు బాలికను పట్టుకుని ఛైల్డ్ వెల్ఫేర్ హోంలో అప్పగించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అనుమతితో డీఎస్పీ రమాకాంత్ ద్వారా ఫారిన్ పాస్‌పోర్టు అందుకుని అర్బన్ ఎస్ఐ సతీష్, సిబ్బంది మధ్యప్రదేశ్‌లోని ఇటార్శికి వెళ్లి స్వాతిని తీసుకుని ధర్మవరం వచ్చారు. బుధవారం తల్లిని స్టేషన్‌కు పిలిపించి బాలికను అప్పగించారు. (చదవండి: వలంటీర్ కళ్లలో కారం కొట్టి..) -
కరోనా : నగ్నంగా బైటికొచ్చి..వృద్ధురాలిని కొరికి
సాక్షి, చెన్నై : కోవిడ్-19 (కరోనా వైరస్) నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. హోం క్వారంటైన్ లో ఉన్న ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించిన వైనం కలకలం రేపింది. విదేశాలనుంచి ఇటీవల తిరిగి వచ్చిన వ్యక్తి (34) ని పోలీసులు క్వారంటైన్ లో వుంచారు. అయితే ఏమైందో ఏమో తెలియదుగానీ, క్వారంటైన్ నుంచి బయటికి నగ్నంగా పరుగులు పెట్టాడు. అంతేకాదు వృద్ధురాలు (90) మరణానికి కారకుడయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం శ్రీలకం నుంచి తమిళనాడులోని థేని జిల్లాకు వచ్చిన వ్యక్తిని ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్ లో ఉంచారు అధికారులు. అయితే శుక్రవారం రాత్రి నిర్బంధంలోంచి నగ్నంగా బయటికి వచ్చిన అతగాడు ఆరు బయట నిద్రిస్తున్న వృద్దురాలిపై దాడి చేసి, ఆమె గొంతు కొరికాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే వృద్దురాలిని ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది. థేని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దీంతో ఈ ప్రాంతంలో ఆందోళన చెలరేగింది. అయితే గతవారం విదేశాలనుంచి తిరిగి వచ్చిన అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలుస్తోంది. -
బంగారుపాలెంలో బెంగుళూరు పిల్లలు
సాక్షి, బంగారుపాళెం(చిత్తూరు) : చదువు ఒత్తిడి కారణంగా బెంగళూరుకు చెందిన నలుగురు విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. దాదాపు వారం రోజుల తరువాత బంగారుపాళెం పోలీసులు తమ కంటబడిన వీరిని ఆదివారం రాత్రి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నగరం అరికిరిలో నివాసం ఉంటున్న శంకర్ కుమారుడు నిఖిల్(14) తొమ్మిదో తరగతి, ధన్సింగ్ కుమారుడు అర్జున్‌సింగ్(13) ఏడో తరగతి, భాస్కర్‌రెడ్డి కుమారుడు సందీప్(15) పదో తరగతి, నిషార్‌సోయబ్ కుమారుడు మహమ్మద్ సోయబ్(14) తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పాఠశాల, ట్యూషన్లో చదువు ఒత్తిడి కారణంగా ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి నలుగురు విద్యార్థులు కలసి బెంగళూరులో రైలు ఎక్కి కోలార్ చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతికి వెళ్లారు. అక్కడి నుంచి ఆదివారం చిత్తూరు చేరుకున్నారు. మండలంలోని నలగాంపల్లె వద్ద నడచుకుంటూ వస్తున్న నలుగురిని రాత్రి బంగారుపాళెం హైవే పోలీసులు గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. చదువు ఒత్తిడి కారణంగా ఇంటి నుంచి పారిపోయినట్లు వారు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం ఇవ్వడంతో వారు బంగారుపాళెం చేరుకున్నారు. పోలీసులు విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు కనిపించకపోవడంతో బెంగళూరులో మూడు పోలీస్స్టేషన్లలో వారి తల్లిదండ్రులు కిడ్నాప్ కేసులు పెట్టినట్లు చెప్పారు. పిల్లలను తమకు అప్పగించడంతో టెన్షన్ తీరిందని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బంగారుపాళెం పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. -
రాత్రయితే ఇంటినుంచి వింత శబ్దాలు
టంకాల శ్రీరామ్..వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి ఉడాయించిన ట్రేడ్ బ్రోకర్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణ ప్రస్తుతం సీఐడీ చేతిలో ఉంది. సంతకవిటి మండలం మందరాడలోని అక్కరాపల్లి రోడ్డులో ఉన్న శ్రీరామ్ ఇంటిని అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ ఇంట్లో నుంచి కొద్ది రోజులుగా రాత్రి పది గంటల తరువాత వింత శబ్దాలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. తలుపులకు అధికారులు వేసిన సీళ్లు ఊడిపోయి ఉండడం.. కిటికీలకు పగుళ్లు ఏర్పడడంతో రాత్రి వేళ ఎవరైనా లోనికి చొరబడి అందులో ఉన్న విలువైన వస్తువులను మాయం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజాం/సంతకవిటి : ట్రేడ్ బ్రోకర్ టంకాల శ్రీరామ్‌కు చెందిన ఇంట్లో వింత శబ్దాలు వస్తున్నారనే ప్రచారం ఈ ప్రాంతంలో జోరుగా సాగుతోంది. దీంతో శ్రీరామ్ ఉదంతం మరోసారి ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. అక్కరాపల్లి రోడ్డుల్లో ఉన్న ఇంట్లో రాత్రి సమయంలో ఏదో జరుగుతోందనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ తాలాడలోని కార్యాలయాన్ని ఎత్తివేసే ముందు మందరాడలో అక్కరాపల్లి రోడ్డులో రూ. 2 కోట్లుతో నూతనంగా ఇల్లు నిర్మించాడు. గృహ ప్రవేశం అనంతరం అందులో వివాహం కూడా చేసుకున్నాడు. అయితే వివాహం నిమిత్తం వేసిన పచ్చని పదిరి తీయకముందే శ్రీరామ్ పరారయ్యాడు. దీంతో పెట్టుబడి పెట్టిన బాధితులంతా అతనిపై కేసులు పెట్టడంతో అతన్ని పోలీసులు పట్టుకొని అరెస్టు చేయడం.. అతనికి చెందిన కొత్త ఇంటిని సీజ్ చేయడం చకచకా జరిగిపోయాయి. – ఆ శబ్దాలు ఏమిటీ? శ్రీరామ్ ఇంట్లో కొద్దిరోజులుగా రాత్రి 10 గంటల తరువాత శబ్దాలు వింటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే రాత్రి వేళలో ఒకరిద్దరు ఆ ఇంటి వద్ద సంచరించడం, గోడలపై నుంచి లోపలికి దూకడం చేస్తున్నారంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ‘సాక్షి’ బుధవారం ఉదయం అక్కడికి వెళ్లి చూడగా ఇంటి బయట కిటికీ వద్ద పోలీసులు అతికించిన సీలు చిరిగి పోయిఉంది. ర్తు తెలియని వ్యక్తులు గోడలు దూకి లోనికి ప్రవేశించి కిటికీ తలుపులు తెరిచే ప్రయత్నం చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎవరికి ఆ ధైర్యం.. ఓ వైపు పోలీసులు, మరో వైపు సీఐడీ కనుసన్నల్లో ఉన్న ఇంట్లోకి చొరబడేందుకు ఎవరు ధైర్యం చేస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంటికి చెందిన కిటీకి తలుపులు కూడా పగిలి కనిపిస్తున్నాయి. బాధితులు తాము పెట్టిన పెట్టుబడులు విషయాన్ని జీర్ణించుకోలేక, అప్పుడప్పుడు రాత్రి సమయాల్లో ఇలా ఇక్కడకు వచ్చి తలుపులు పగలకొట్టడం, ఇంట్లో ఏమైనా ఉన్నాయోమోనని ఆరా తీస్తున్నారా అనే అనుమానాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ ఏమైనా చెబుతుందేమోనని ఎదురుచూపులు ఇదిలా ఉండగా మరికొంతమంది పెట్టుబడిదారులు అప్పుడప్పుడు మందరాడ వచ్చి స్థానికుల వద్ద శ్రీరామ్ గురించి ఆరా తీస్తున్నారు. అతనికి ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయా? ఎవరికైనా పెట్టుబడులు తిరిగి చెల్లిస్తున్నాడా అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కొంతమంది పెట్టుబడిదారులు వివాహాలకు, శుభ కార్యక్రమాలకు పనికి వస్తాయనే ముందుచూపుతో శ్రీరామ్ వద్ద పెట్టుబడులు పెట్టారు. అయితే బోర్డు తిప్పేయడంతో అలాంటి వారంతా ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేక దిగాలుగా ఉన్నారు. అటువంటివారంతా తమకు న్యాయం జరుగుతుందో..లేదో అని గుబులు చెందుతున్నారు. సీఐడీ అధికారులు ఏం చేస్తారోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆరా తీస్తాం సంతకవిటి మండలంలోని మందరాడ గ్రామానికి చెందిన ట్రేడ్ బ్రోకర్ టంకాల శ్రీరామ్ ఇంటి వద్ద జరుగుతున్న తంతుకు సంబంధించి ఆరా తీస్తాం. సంతకవిటి పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తాం. పోలీసులు వేసిన సీల్‌ను తీసేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. కేసు దర్యాప్తులో ఉంది. ఎవరూ కూడా ట్రేడ్ బ్రోకర్ ఆస్తులకు సంబంధించి ఎటువంటి తొందరపాటు ప్రయత్నాలు చేయరాదు. – ఎల్ఆరేకే నాయుడు, సీఐడీ ఎస్సై, విశాఖపట్నం -
945 గ్రాముల బంగారంతో ఉడాయించిన వ్యక్తి
జంగారెడ్డిగూడెం : బంగారు ఆభరణాలు తయారుచేసే ఒక వ్యక్తి బంగారు షాపు యజమానుల నుంచి బంగారం తీసుకుని ఉడాయించిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. 945 గ్రాముల బంగారం (సుమారు 118 కాసులు)తో అతను పరారయ్యాడు. ఎస్సై జీజే విష్ణువర్థన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మునసబుగారి వీధిలో బంగారు నగలు తయారు చేసే ముషరాఫ్ ముల్లా అనే వ్యక్తి అదే వీధిలోను, పట్టణంలో పలు బంగారు షాపుల యజమానుల నుంచి వస్తువులు తయారు చేసేందుకు బంగారం తీసుకున్నాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన అతను ఇక్కడకు వచ్చి కొన్నాళ్లుగా వస్తువులు తయారు చేస్తున్నాడు. సోమేశ్వర జ్యూయలర్స్ యజమాని కొనకళ్ల సురేష్‌బాబు బంగారు వస్తువులు తయారు చేయమని 203 గ్రాముల బంగారం ముషరాఫ్‌కు ఇచ్చినట్టు తెలిపారు. కొనకళ్ల ఉదయ్‌కుమార్ అనే బంగారు షాపు యజమాని 200 గ్రాములు, ఎస్కే జాని 103 గ్రాములు, తిరివీధి హనుమంతరావు 326 గ్రాములు, కె.మోహన్ 90 గ్రాములు, రమేష్ 23 గ్రాములు, మొత్తం 945 గ్రాముల బంగారం ముషరాఫ్‌కు ఇచ్చారు. అయితే అతడు ఆ బంగారాన్ని తీసుకుని ఈనెల 21వ తేదీ రాత్రి ఉడాయించాడు. 22, 23 తేదీల్లో అతడి కోసం గాలించిన యజమానులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. కాగా 2016లో కూడా ముషరాఫ్ ఇలాగే బంగారం తీసుకుని ఉడాయించగా, అప్పట్లో పోలీసులు పశ్చిమ బెంగాల్ వెళ్లి అతడిని అరెస్ట్ చేసి బంగారం రికవరీ చేశారు. అయితే ఇటీవల ముషరాఫ్ పట్టణానికి వచ్చి బంగారు షాపుల యజమానులను బతిమలాడి తాను పనిచేసుకుంటానని నమ్మించి మళ్లీ బంగారంతో ఉడాయించాడు. -
ఇంటి నుంచి పారిపోయి.. హీరోయిన్ అయ్యింది..!
ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాల్లో ట్రయింగ్యులర్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఇంట్రస్టింగ్ మూవీ కాదలి. సినిమా కథ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన గుజరాతీ భామ పూజ స్టోరినే ఓ సినిమా కథలా ఆకట్టుకుంటోంది.గుజరాత్ రాజ్ కోట్ లోని సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ భామ, తన కలను నెరవేర్చుకోవటం కోసం పెద్ద సాహసమే చేసింది. చిన్నప్పటి నుంచి సిల్వర్ స్క్రీన్ మీద వెలిగిపోవాలనే కలను కంటూ పెరిగింది పూజ. అయితే ఆమె కుటుంబ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉండేవి. 'అచ్చీ ఘర్ కి లడికి యా ఫిలిం మే యాక్టింగ్ నహీ కర్తే' అంటూ తల్లి దండ్రులు ఆంక్షలు విధించారు. అయితే ఎలాగైన తన కలను నిజం చేసుకోవాలనుకున్న పూజ ఇంటినుంచి పారిపోయిన ముంబై రైలెక్కేసింది. ఏడాది పాటు ఫోటో షూట్ లు, యాడ్స్ చేసిన పూజకు అదృష్టం తలుపు తట్టింది. కాదలి టీం నుంచి ఫోన్ వచ్చింది. ఆడిషన్ లాంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకోని ఓ ఇంట్రస్టింగ్ ట్రయాంగ్యులర్ లవ్ స్టోరితో తెలుగు తెరకు హీరోయిన్ పరిచయం అయ్యింది. -
గొలుసు వదిలి పరారైన చైన్ స్నాచర్
హైదరాబాద్ : స్కూల్లో పిల్లల్ని దింపి ఇంటి తిరిగి నడిచి వెళ్తున్న అనిత (30) అనే మహిళపై చైన్ స్నాచర్ దాడి చేసి... మెడలో గొలుసు లాక్కుని... పరారవుతున్న క్రమంలో కిందపడ్డాడు. ఇంతలో తెరుకున్న అనిత బిగ్గరగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దాంతో చైన్ స్నాచర్ గొలుసు వదిలి కొద్దిదూరంలో బైక్‌పై వెయిట్ చేస్తున్న వ్యక్తితో కలసి పరారయ్యాడు. స్థానికులు బైక్‌పై వెంబడించిన... చైన్ స్నాచర్లు మాత్రం కన్ను తెరచి మూసే లోపు మాయమయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట ఆర్‌ఎన్‌రెడ్డి నగర్లో గురువారం చోటు చేసుకుంది. అనిత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
విద్యార్థిని కిడ్నాప్ చేసి.. పరారైన లేడీ టీచర్
ముంబై: మైనర్ విద్యార్థితో కలసి పారిపోయిన లేడీ టీచర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఆమెపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన 23 ఏళ్ల అంజలీ సింగ్ అనే టీచర్.. తొమ్మిదో తరగతి చదివే 16 ఏళ్ల విద్యార్థితో స్నేహంగా ఉండేవారని పోలీసులు చెప్పారు. వీరిద్దరూ వాట్స్ యాప్ ద్వారా సంప్రదించుకోవడంతో పాటు తరచూ బయటకు వెళ్లేవారు. గత జనవరి 25 న దుస్తులు కొనుగోలు చేయాలని బయటకి వెళ్లిన విద్యార్థి ఆ తర్వాత ఇంటికి రాలేదు. అతని తండ్రి అదే జోరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజలి కూడా అదే రోజు నుంచి కనిపించడం లేదని పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరి గురించి వాకబు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిద్దరూ మొదట గోవాకు వెళ్లారు. తమ ఆచూకీ తెలియకుండా ఉండేందుకోసం మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసింది. అనంతరం అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోయి అక్కడే మకాం వేశారు. అంజలి ఓ మాల్లో ఉద్యోగంలో కూడా చేరింది. పోలీసులు ఎట్టకేలకు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని ముంబైకి తీసుకెళ్లారు.