ముంబై: మైనర్ విద్యార్థితో కలసి పారిపోయిన లేడీ టీచర్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఆమెపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ముంబైకి చెందిన 23 ఏళ్ల అంజలీ సింగ్ అనే టీచర్.. తొమ్మిదో తరగతి చదివే 16 ఏళ్ల విద్యార్థితో స్నేహంగా ఉండేవారని పోలీసులు చెప్పారు. వీరిద్దరూ వాట్స్ యాప్ ద్వారా సంప్రదించుకోవడంతో పాటు తరచూ బయటకు వెళ్లేవారు. గత జనవరి 25 న దుస్తులు కొనుగోలు చేయాలని బయటకి వెళ్లిన విద్యార్థి ఆ తర్వాత ఇంటికి రాలేదు. అతని తండ్రి అదే జోరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజలి కూడా అదే రోజు నుంచి కనిపించడం లేదని పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరి గురించి వాకబు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిద్దరూ మొదట గోవాకు వెళ్లారు. తమ ఆచూకీ తెలియకుండా ఉండేందుకోసం మొబైల్ ఫోన్ను ధ్వంసం చేసింది. అనంతరం అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోయి అక్కడే మకాం వేశారు. అంజలి ఓ మాల్లో ఉద్యోగంలో కూడా చేరింది. పోలీసులు ఎట్టకేలకు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని ముంబైకి తీసుకెళ్లారు.
విద్యార్థిని కిడ్నాప్ చేసి.. పరారైన లేడీ టీచర్
Published Sat, Mar 8 2014 10:14 PM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
Advertisement
Advertisement