Lady Teacher
-
Kanyaputri Dolls: బిహార్ బొమ్మలట- కొలువుకు సిద్ధమట
ప్రతి సంస్కృతిలో స్థానిక బొమ్మలుంటాయి. మనకు కొండపల్లి, నిర్మల్... బిహార్‌లో కన్యాపుత్రి. అయితే బార్బీలు, బాట్‌మేన్‌ల హోరులో అవన్నీ వెనుకబడ్డాయి. కాని పిల్లలకు ఎటువంటి బొమ్మలు ఇష్టమో తెలిసిన టీచరమ్మ నమితా ఆజాద్ అక్కడ వాటికి మళ్లీ జీవం పోసింది. కొలువు తీర్చింది. సంస్కృతిలో భాగమైన ఆ బొమ్మలను చూడగానే పిల్లలకు ప్రాణం లేచివస్తు్తంది. నమిత చేస్తున్న కృషి గురించి.. ఒక టీచరమ్మ కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మల కోసం బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగం వదిలేసింది. మనుషులు అలాగే ఉంటారు. ఏదైనా మంచి పని చేయాలంటే చేసి తీరుతారు. పట్నాకు చెందిన నమితా ఆజాద్‌ను వారం క్రితం బిహార్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘బిహార్ హస్తకళల పురస్కారం–2023’తో సత్కరించింది. పిల్లల బొమ్మల కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేయడమే అందుకు కారణం. కన్యాపుత్రి బొమ్మలు వీటిని బిహార్‌లో ‘గుడియా’ అని కూడా అంటారు. బిహార్‌లో చంపారన్ జిల్లాలో గుడ్డ పీలికలతో తయారు చేసే బొమ్మలు ఒకప్పుడు సంస్కృతిలో భాగంగా ఉండేవి. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఒక ప్రత్యేకమైన రోజున ఇంటి ఆడపిల్లలు ఈ బొమ్మలను విశేషంగా అలంకరించి దగ్గరలోని చెరువు ఒడ్డున నిమజ్జనం చేస్తారు. వారి అన్నయ్యలు ఆ బొమ్మలను వెలికి తెచ్చి చెల్లెళ్లకు ఇస్తారు. ఆ తర్వాత మిఠాయిలు పంచుకుంటారు. కన్యాపుత్రి బొమ్మలు ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లల్లో ఉంచుతారు. పిల్లలు ఆడుకుంటారు. కొత్త పెళ్లికూతురు అత్తారింటికి వచ్చేటప్పుడు తనతో పాటు కొన్ని అలంకరించిన కన్యాపుత్రి బొమ్మలు తెచ్చుకోవడం ఆనవాయితీ. ‘నా చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మలు ఈ బొమ్మలు చూపిస్తూ ఎన్నో కథలు చెప్పడం జ్ఞాపకం’ అంటుంది నమితా ఆజాద్. వదలని ఆ గుడియాలు నమితా ఆజాద్... చంపారన్ జిల్లాలో పుట్టి పెరిగింది. ఎం.ఏ. సైకాలజీ చేశాక చండీగఢ్‌లోని ‘ప్రాచీన్ కళాకేంద్ర’లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌లో మాస్టర్స్ చేసింది. ఆ సమయంలోనే ఆమెకు బాల్యంలో ఆడుకున్న కన్యాపుత్రి బొమ్మలు గుర్తుకొచ్చాయి. వాటిని తిరిగి తయారు చేయాలని అనుకుంది. ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళలతో కొన్ని బొమ్మలు తయారు చేసి ఒక ప్రదర్శనలో ఉంచితే వెంటనే అమ్ముడుపోయాయి. ఆమెకు ఉత్సాహం వచ్చింది ఆ రోజు నుంచి ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కన్యాపుత్రి బొమ్మలను తయారు చేస్తూ హస్తకళల ప్రదర్శనలో ప్రచారం చేసింది. 2013 నాటికి వాటికి దక్కుతున్న ఆదరణ, వాటి అవసరం అర్థమయ్యాక ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్నే మానేసింది. పిల్లల సైకాలజీ తెలిసి పిల్లల సైకాలజీ తెలిసిన వారికి బొమ్మలు పిల్లల వికాసానికి ఎంతగా ఉపయోగపడతాయో తెలుస్తుంది అంటుంది నమితా. ఆ బొమ్మలతో పశు పక్ష్యాదులను తయారు చేస్తారు కనుక కవాటి వల్ల సమిష్టి కుటుంబాలు, మైక్రో కుటుంబాలు, అన్నా చెల్లెళ్ల బంధాలు, సామాజిక బంధాలు, పర్యావరణ స్పృహ అన్నీ తెలుస్తాయి అంటుంది నమితా. పిల్లలకు సామాజిక సందేశాలు ఇవ్వాలన్నా, కొన్ని పాఠాలు వారికి అర్థమయ్యేలా చెప్పాలన్నా ఈ బొమ్మలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆమె టీచర్లకు నిర్వహించి వర్క్‌షాప్‌ల ద్వారా తెలియచేస్తోంది. నమితా లాంటి సంస్కృతీ ప్రేమికులు ప్రతిచోటా ఉంటే సిసలైన పిల్లల బొమ్మలు వారిని సెల్ఫోన్ల నుంచి వీడియో గేమ్స్ నుంచి కాపాడుతాయి. ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు కన్యాపుత్రి బొమ్మలు ప్లాస్టిక్ లేనివి. అదీగాక మారణాయుధాలు, పాశ్చాత్య సంస్కృతి ఎరగనివి. మన దేశీయమైనవి. టైలర్ల దగ్గర పడి ఉండే పీలికలతో తయారు చేసేవి. అందుకే నమితా ఇప్పుడు ‘ఎన్‘ క్రియేషన్స్ అనే సంస్థ పెట్టి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించి ఈ బొమ్మలు తయారు చేస్తోంది. అంతే కాదు బిహార్ అంతా తిరుగుతూ వాటిని తయారు చేయడం మహిళలకు నేర్పించి వారికి ఉపాధి మార్గం చూపుతోంది. -
భలే... పేడ కళ
‘ఇంకేం మిగిలింది పేడ’ అని వ్యంగ్యంగా అనవచ్చు. పేడ విలువ మన పూర్వికులకు తెలుసు. దాని ఉపయోగాలూ తెలుసు. పేడ అలికిన ఇల్లు శుభదాయకమైనది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పుడొక టీచరమ్మ పేడతో కళాకృతులు తయారు చేస్తోంది. ఆధ్యాత్మిక చిహ్నాలను పేడతో రూపొందిస్తోంది. వీటి అలంకరణ ఇంటికి సంప్రదాయకళ తెస్తుందని చెబుతోంది. ప్రస్తుతం జనం వాటిని కొనేందుకు సిద్ధమవుతున్నారు. పేడతో పిడకలు కొట్టడం, కళ్లాపి చల్లుకోవడం, ఇల్లు అలుక్కోవడం తరతరాలు చేస్తున్నదే. కాని పేడతో కళాకృతులు చేయడం ద్వారా ఒట్టిపోయిన ఆవులను, ఎడ్లను కూడా రోడ్ల మీద వదలడమో, కబేళాకు తరలించడమో చేయకుండా వాటి ఆలనా పాలనా చూడొచ్చు అంటుంది 42 ఏళ్ల పూజా గాంగ్వర్. కిలో పేడ ఎంత? కిలో పేడ మనం ఎంతకు కొంటాం? ఎంతకీ కొనం. ఎందుకంటే పేడ ఎక్కడైనా దొరుకుతుంది. ‘కాని వాటితో కళాకృతులు చేస్తే కిలో పేడ కళాకృతులకు 2000 రూపాయలు వస్తాయి. సంపాదించవచ్చు’ అంటోంది పూజా గాంగ్వర్. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు సమీపంలోని రాజన్‌పూర్ అనే గ్రామంలో ప్రైమరీ టీచర్‌గా పని చేస్తున్న పూజా గాంగ్వర్ పేడతో కళాకృతులు చేయడమే కాదు. వాటివల్ల ఒక డజను మందికి ఉపాధి కల్పిస్తోంది, ఆదాయమూ గడిస్తోంది. వాల్ హ్యాంగింగులు, నేమ్ ప్లేట్లు, బొమ్మలు, పెన్ హోల్డర్లు, అగర్ బత్తీలు, చెప్పులు... ఇలా ఎన్నో తయారు చేస్తూ ఆకట్టుకుంటోంది. తేలిక బొమ్మలు పేడతో తయారయ్యే వస్తువులు తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే పేడను సేకరించి, ఎండబెట్టి, పొడి చేసుకుని, జల్లెడ పట్టుకుని, ఆ వచ్చిన మెత్తటి పొడికి మైదా పిండిగాని, చెట్టు బంక గాని, ముల్తానీ మట్టిగాని కలిపి సాగే లక్షణం కలిగిన బంక పదార్థంగా (క్లే) చేసుకుని దానితో కళాకృతులు తయారు చేస్తారు. ‘ఇనుము, రాగి, ఫైబర్ మూసల్లో పేడ క్లేను మూసబోసి ఆరబెట్టి బొమ్మలను తయారు చేస్తాం’ అని తెలిపింది గాంగ్వర్. బొప్పాయి పాలు ‘మూసలో పోసి ఆరబెట్టుకున్న కళాకృతులకు పాలిష్ కోసం బొప్పాయి పాలుగాని, అవిసె గింజల నూనె గాని వాడతాం. ఈ కళాకృతులు పాడుగావు. నీళ్లు తగలకుండా చూసుకుంటే ఐదారేళ్లు ఉంటాయి. మా ఊళ్లోని యాభై ఆవుల పేడను నేను ఈ బొమ్మల కోసం వాడుతున్నాను. ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల నుంచి స్త్రీలు వచ్చి నేర్చుకుంటామంటున్నారు. వారికి ట్రయినింగ్ ఇస్తే ఆవు పేడ సద్వినియోగం అవుతుంది. ఆవుల సంరక్షణా జరుగుతుంది’ అని తెలిపింది పూజ.. -
కదిరి: గవర్నమెంట్ టీచర్ హత్య.. పార్థీ గ్యాంగ్ పనేనా?
అనంతపురం క్రైం/ కదిరి: కదిరి ఎన్జీఓ కాలనీలో మంగళవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే రెండిళ్లలో చోరీకి తెగబడ్డారు. నగల అపహరణతో ఆగకుండా ఉషారాణి (47) అనే టీచర్‌ను హతమార్చి..పక్కింట్లో ఉండే టీస్టాల్ రమణ భార్య శివమ్మనూ తీవ్రంగా గాయపరిచారు. అది కూడా జనసంచారం మొదలయ్యే ఉదయం 5.15 నుంచి 5.40 గంటల మధ్య ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది. ఈ తరహా దొంగతనాలు జిల్లా, అంతర్ జిల్లాల దొంగలు చేసే అవకాశం లేదని, మధ్యప్రదేశ్‌కు చెందిన కరుడుగట్టిన ‘పార్థీ గ్యాంగ్’ పని అయ్యిండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడానికి పోలీసు శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప 10 నుంచి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి..పోలీసులకు తగిన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో వేలిముద్రలు, ఇతరత్రా ఆధారాలు సేకరించారు. ఈ తరహా కేసుల ఛేదింపులో అనుభవం కల్గిన పోలీసు అధికారులు, సీసీఎస్ కానిస్టేబుళ్లను ప్రత్యేక బృందాల్లో నియమించారు. ఈ బృందాలు ఇప్పటికే పని మొదలుపెట్టాయి. కదిరి సమీపంలోని టోల్గేట్తో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెక్‌పోస్టులు, ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాటిలో అనుమానితుల ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెప్పారు. కదిరి ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరైనా వచ్చారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలైన పులివెందుల, మదనపల్లి, హిందూపురం తదితర ప్రాంతాలకూ బృందాలను పంపి, ఆ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు పరిశీలించేందుకు చర్యలు చేట్టారు. పార్థీ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నందున మధ్యప్రదేశ్‌కూ ఓ బృందాన్ని పంపుతున్నట్లు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగానే ఛేదిస్తామని చెప్పారు. లాడ్జీల్లో తనిఖీలు ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవరైనా వచ్చి బస చేశారా అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు కదిరి పట్టణంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 15 లాడ్జీల్లో తనిఖీలు చేయడంతో పాటు సీసీ ఫుటేజీ కూడా పరిశీలించారు. అలాగే పాత నేరస్తులపై నిఘా వేశారు. శోకసంద్రంలో చీకిరేవులపల్లి అమడగూరు : దొంగల చేతిలో ప్రభుత్వ టీచర్ ఉషారాణి హత్యకు గురికావడంతో మండలంలోని చీకిరేవులపల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి, ఉషారాణి దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. శంకర్‌రెడ్డి ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ హైసూ్కల్లో బయోలాజికల్ సైన్స్ టీచర్ కాగా.. ఉషారాణి ఓడీచెరువు జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రణీత్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా... చిన్నకుమారుడు దీక్షిత్‌రెడ్డి విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్నారు. ఉషారాణి మృతదేహాన్ని కదిరి నుంచి చీకిరేవులపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు బంధువులు, తోటి ఉపాధ్యాయులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆమె మృతదేహంపై పడి కుమారులు, భర్త రోదించిన తీరు పలువురిని కలచివేసింది. ఎంపీపీ గజ్జల ప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కడగుట్ట కవితతో పాటు మండల వైఎస్సార్సీపీ నాయకులు హతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు కదిరి ప్రభుత్వాస్పత్రిలో ఉషారాణి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి పరిశీలించి..కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
కీచక బాబాకు సాయం.. మహిళా టీచర్లపై పోక్సో చట్టం
సాక్షి, చెన్నై: కీచక బాబా కోసం విద్యార్థినులను మభ్యపెట్టినట్లు తేలడంతో ఇద్దరు మహిళా టీచర్లపై పోక్సో చట్టంతో పాటు తొమ్మిది సెక్షన్ల కింద మంగళవారం కేసులు నమోదు చేశారు. హాస్టల్లో ఉండే విద్యార్థినులను భారతి, దీప అనే టీచర్లు బలవంతంగా బాబా ఆశ్రమంలోని గదిలోకి తీసుకెళ్లే వారని విచారణలో తేలింది. మరికొందరు టీచర్ల హస్తం కూడా ఉందన్న సమాచారంతో విచారణ వేగం చేశారు. చెంగల్పట్టు జిల్లా కేలంబాక్కంలోని సుశీల్‌హరి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ బాబా లీలలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయనపై ఫిర్యాదులు హోరెత్తడంతో సీబీసీఐడీ విచారణను వేగవంతం చేసింది. ఆయన ఝార్కండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం రావడంతో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లి విచారించింది. బాబా జాడ కానరాలేదు. విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నట్టు సీబీసీఐడీ గుర్తించింది. ఆయన విమానాశ్రయాలకు మంగళవారం లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు. రూ. 700 కోట్ల ఆస్తులు బాబా వీడియో ఒకటి తాజాగా వైరల్ అయింది. అందులో తనకు రూ.700 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు స్వయంగా శివశంకర్ బాబా మహిళలతో ముచ్చటించారు. బాలికలు, వితంతువులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చదవండి: తీర్పులాంటి ప్రశ్న ఇదేం ఆర్గ్యుమెంట్? -
మహిళా టీచర్లపై అసభ్య ప్రవర్తన
శాలిగౌరారం: మహిళా ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరుగురు విద్యార్థులను ఉపాధ్యాయులు చితకబాదారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో జరిగిన ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కూల్లో 708 మంది విద్యార్థులున్నారు. వారిలో 500 మంది పాఠశాల స్థాయిలో ఉండగా, మరో 208 మంది ఇంటర్ విద్యార్థులు. మోడల్ స్కూల్లో 8 మంది మహిళా టీచర్లు ఉన్నారు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఆరుగురు విద్యార్థులు మహిళా ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో విద్యార్థులను ఉపాధ్యాయులు సోమవారం ప్రిన్సిపాల్ చాంబర్లోకి పిలిపించి విచారించారు. చాంబర్‌లోని సీసీ కెమెరాలను నిలిపివేసి ఉపాధ్యాయులు విద్యార్థులను కర్రలతో కొట్టారు. ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి నకిరేకల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో విషయం వెలుగులోకి రావడంతో పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మయ్య పాఠశాలను సందర్శించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. -
చదువులమ్మలు
సాక్షి, హైదరాబాద్ : బోధన రంగంలో మహిళల వాటా పెరుగుతోంది. ఉన్నత విద్యలో ముందంజలో ఉంటున్న మహిళలు బోధన రంగంలోనూ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు. నాలుగేళ్ల కిందట బోధన రంగంలో మహిళల సంఖ్య 39 శాతం ఉండగా, తాజాగా అది 42 శాతానికి పెరిగింది. 2014–15లో ఉన్నత విద్యా సంస్థల్లో 61 శాతం మంది అధ్యాపకులు పురుషులు ఉంటే 39 శాతం మంది మహిళలు ఉన్నారు. 2017–18లో బోధన రంగంలో 58 శాతం పురుషులు ఉండగా, 42 శాతం మహిళలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలు తేల్చింది. తొలిసారిగా సమగ్ర వివరాలు సేకరణ దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమగ్ర వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) సేకరించింది. గతంలో విద్యా సంస్థల వారీగా ఎంత మంది అధ్యాపకులు ఉన్నారు, అందులో మహిళలు ఎంత మంది, పురుషులు ఎంత మంది, తదితర వివరాలను మాత్రమే సేకరించిన కేంద్రం.. ఈసారి సమగ్ర వివరాలను తీసుకుంది. విద్యా సంస్థల వారీగా ఆయా విద్యా సంస్థల్లో చేరిన తేదీ, వారు ఆ వృత్తిలో అడుగుపెట్టిన ఏడాది, వారికున్న విద్యార్హతలు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, ఆధార్ నంబర్లతో సహా పక్కా వివరాలను తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం దేశంలో 12,84,755 మంది అధ్యాపకులు ఉన్నట్లు తేల్చింది. అందులో 12,68,597 మందిఅధ్యాపకుల సమగ్ర వివరాలను సేకరించినట్లు వెల్లడించింది. వారిలో పురుషులు 7,45,158 మంది ఉండగా, మహిళలు 5,39,597 మంది ఉన్నట్లు తెలిపింది. 1.88 లక్షల మంది తగ్గుదల సంఖ్యా పరంగా చూస్తే దేశవ్యాప్తంగా అధ్యాపకుల సంఖ్య నాలుగేళ్లలో భారీగా తగ్గిపోయింది. 2014–15లో దేశవ్యాప్తంగా 14,73,255 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 12,84,755కు పడిపోయింది. ఆ మేరకు 1,88,500 మంది తగ్గిపోయారు. అప్పట్లో అధ్యాపకుల్లో పురుషులు 8,98,686 మంది ఉండగా, మహిళలు 5,74,569 మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఓవైపు విద్యా సంస్థలు పెరుగుతుంటే అధ్యాపకుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గుముఖం పడుతుండటంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పేపర్లపై అధ్యాపకుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించిన యాజమాన్యాలు ఇపుడు పక్కా సమాచారం ఇవ్వాలని అడుగుతుండటంతో అలాంటి తప్పిదాలకు పాల్పడం లేదని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలే ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇష్టానుసారం లెక్కలు ఇవ్వకుండా పక్కా సమాచారాన్నే ఇస్తున్నాయని, అందువల్లే సంఖ్య తగ్గుదల కనిపిస్తోందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల్లో మూడో స్థానంలో తెలంగాణ దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ (13.48 శాతం ఎస్సీలు, 1.6 శాతం ఎస్టీలు) ఉండగా, మహారాష్ట్ర (11.04 శాతం ఎస్సీలు, 0.41 శాతం ఎస్టీలు) రెండో స్థానంలో నిలిచింది. 10.77 శాతం ఎస్సీ అధ్యాపకులు, 3.4 శాతం ఎస్టీ అధ్యాపకులతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. జనరల్ కేటగిరీ వారే ఎక్కువ బోధన రంగంలో రిజర్వేషన్ కాకుండా జనరల్ కేటగిరీ అధ్యాపకులే అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలు తేల్చింది. చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీలు, ఎస్టీలే ఉండగా, బోధించే అధ్యాపకులు మాత్రం ఇతర కేటగిరీల వారే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అందులో 56 శాతం జనరల్ కేటగిరీ అధ్యాపకులు ఉండగా, 32.3 శాతం బీసీలు, 8.6 శాతం ఎస్సీలు, 2.27 శాతం ఎస్టీలు ఉన్నట్లు తేల్చింది. ‘ప్రైవేటు’లో తెలంగాణ, ఏపీ టాప్ దేశవ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. దేశంలో సగటున 78 శాతం కాలేజీలు ప్రైవేటు రంగంలో ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 82 శాతం కాలేజీలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత 76.2 శాతంతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. అయితే అసోంలో మాత్రం కేవలం 12 శాతం, చండీగఢ్‌లో 8 శాతమే ప్రైవేటు విద్యా సంస్థలు ఉండటం గమనార్హం. పురుషుల కంటే మహిళా అధ్యాపకులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కేరళ, పంజాబ్, హరియాణా, చండీగఢ్, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ, గోవా -
బికినీలో టీచర్ల రచ్చ
సోషల్ మీడియాలో హాట్‌గా ఫోటోలు పెట్టిందన్న ఒకే ఒక్క కారణం ఆ ఉపాధ్యాయురాలి పాలిట శాపంగా మారింది. పలువురు పేరెంట్స్ ఫిర్యాదు చేయటంతో ఆమె ఉద్యోగం ఊడింది. మరెక్కడా ఆమెకు పని దొరకటం లేదు. ఈ విషయం తెలిసిన తోటి ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు!! మాస్కో: 26 ఏళ్ల విక్టోరియా పోప్‌రోవా ఓమ్స్క్ పట్టణంలో 7 సిటీ స్కూల్లో హిస్టరీ టీచర్‌గా పని చేస్తుండేది. ఆ మధ్య సెలవులపై కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె.. బికినీలో ఓ ఫోటోషూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. అయితే ఆమెను ఫాలో అయ్యే వారిలో ఆమె స్టూడెంట్లు కూడా ఉన్నారు. ఈ విషయం కొందరు పేరెంట్స్ దృష్టికి రావటంతో వారంతా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె నుంచి వివరణ కోరిన స్కూల్ మేనేజ్మెంట్.. చివరకు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. విషయం తెలిసిన టీచర్ల అసోసియేషన్ మండిపడింది. టీచర్స్ ఆర్ హ్యూమన్స్ టూ(#TeachersAreHumansToo) పేరిట వినూత్నంగా నిరసనకు పిలుపునిచ్చింది. అందులో మొత్తం 11 వేల మంది టీచర్లు ఫ్లాష్‌మాబ్‌లో పాల్గొన్నారు. వారంతా బికినీలతో ఫోటోలు దిగి విక్టోరియా పోప్రోవాకు మద్దతు తెలిపారు. ఆమెకు న్యాయం జరగకపోతే ఉద్యమం మరో రూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఈ ఉద్యమం సోషల్ మీడియాను కదిలించింది. దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆమెకు మద్ధతు ప్రకటిస్తూ.. తమ ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బికినీ ఉద్యమం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. -
విద్యార్థిని కిడ్నాప్ చేసి.. పరారైన లేడీ టీచర్
ముంబై: మైనర్ విద్యార్థితో కలసి పారిపోయిన లేడీ టీచర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఆమెపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన 23 ఏళ్ల అంజలీ సింగ్ అనే టీచర్.. తొమ్మిదో తరగతి చదివే 16 ఏళ్ల విద్యార్థితో స్నేహంగా ఉండేవారని పోలీసులు చెప్పారు. వీరిద్దరూ వాట్స్ యాప్ ద్వారా సంప్రదించుకోవడంతో పాటు తరచూ బయటకు వెళ్లేవారు. గత జనవరి 25 న దుస్తులు కొనుగోలు చేయాలని బయటకి వెళ్లిన విద్యార్థి ఆ తర్వాత ఇంటికి రాలేదు. అతని తండ్రి అదే జోరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజలి కూడా అదే రోజు నుంచి కనిపించడం లేదని పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరి గురించి వాకబు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిద్దరూ మొదట గోవాకు వెళ్లారు. తమ ఆచూకీ తెలియకుండా ఉండేందుకోసం మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసింది. అనంతరం అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోయి అక్కడే మకాం వేశారు. అంజలి ఓ మాల్లో ఉద్యోగంలో కూడా చేరింది. పోలీసులు ఎట్టకేలకు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని ముంబైకి తీసుకెళ్లారు. -
సంస్కృత పాఠశాలలో....విష సంస్కృతి!
పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్: పేరుకే అది సంస్కృత పాఠశాల ....అక్కడ కొంతమంది ఉపాధ్యాయులు ఆ దేవనాగరి భాష నేర్పిన సంస్కృతిని మరిచి, పశువుల కన్నా హీనంగా ప్రవరిస్తున్నారు. చెల్లిగా, మాతృ సమానురాలిగా గౌరవించ వలసిన తోటి ఉపాధ్యాయురాలి పట్ల అత్యంత హేయంగా లైంగిక వేధింపులు కు దిగారు. మానసికంగా తీవ్రంగా వేధించారు. ఆరు నెలల క్రితం వరకూ ఓ టీచర్ వెంటపడితే, అతని నుంచి ఎలాగోలా ఆమె తప్పించుకుంది. ఇప్పుడు పాఠశాలను క్రమశిక్షణలో నడపవలసిన ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్న హెచ్ఎం దారితప్పాడు. ఆమెను వేధించడం ప్రారంభించాడు, చివరకు భౌతికదాడికి దిగాడు. గతంలో స్థానిక టీఆర్ఎం గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినుల పట్ల కూడా అక్కడ కొంతమంది ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించారు. గురుతర బాధ్యతతో మెలగవలసిన ఉపాధ్యాయులే ఇలా ప్రవర్తించడంతో తమ పిల్లల భవిష్యత్ ఏం కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హెచ్ఎంపై ఆ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కీచక పర్వం వెలుగుచూసింది. చాలా కాలంగా ... స్థానిక మున్సిపాలిటీ సంస్కృత ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని అక్కడి ప్రధానోపాధ్యాయుడు చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. హెచ్ఎం ప్రవర్తనపై ఆమె తోటి ఉపాధ్యాయుల వద్ద మొరపెట్టుకుంది. అయితే వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం తనపై హెచ్ఎం వేధింపులకు, దాడికి దిగినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయమై రాజీ చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నట్టు తెలిసింది. గతంలో కూడా ఇదే ఉపాధ్యాయునిని ఇదే స్కూల్లో పనిచేసిన ఓ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించడంతో ఆమె స్థానిక పెద్దలను ఆశ్రయించారు. వారు తీవ్రంగా హెచ్చరించడంతో ఆ ఉపాధ్యాయుడు వేధింపులను విరమించుకున్నట్టు సమాచారం. ఆ తరువాత హెడ్మాస్టర్ వేధిం పులకు పాల్పడుతున్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాం... ఈ విషయమై ఎస్ఐ డి.దీనబంధు వద్ద ప్రస్తావించగా స్థానిక సంకావీధిలోని మున్సిపల్ సంస్కృత పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం ఎం.నాగభూషణం తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆ పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు తమకు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రిక్వెస్ట్...దయచేసి వదిలేయండి... ఈ విషయమై హెచ్ఎం నాగభూషణం వద్ద ప్రస్తావించగా రిక్వెస్ట్...దయచేసి వదిలేయండంటూ ప్రాథేయపడ్డారు. హెచ్ఎం కుటుంబ సభ్యులు పట్టణంలోని అధికార పార్టీకి చెందిన ఓ పెద్దమనిషి పేరు చెబుతూ ఫోన్ చేయండంటూ కేకలు వేశారు. ఇప్పటికీ తేలని టీఆర్ఎం గర్ల్స్ హైస్కూల్ వ్యవహారం పార్వతీపురంలో మున్సిపాలిటీలోని టీఆర్ఎం గర్ల్స్ హైస్కూల్లో కొంతమంది విద్యార్థుల పట్ల ఆ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితులు నేరుగా ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినుల పట్ల ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు కీచక చర్యలకు పాల్పడగా, భరించలేని వారు నేరుగా అప్పటి మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఐటీడీఏ పీఓ బీఆర్ అంబేద్కర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ కమిషనర్‌కు విచారణకు ఆదేశించగా, రాజకీయ పలుకుబడి కలిగిన ఆ ఉపాధ్యాయులు నేరుగా కమిషనర్‌ను అధికార పార్టీ నేతలతో బెదిరించినట్లు సమాచారం. దీంతో ఆ విచారణ బుట్టదాఖలయినట్లు తె లుస్తోంది. ఇలా ఒకటీ అరా వెలుగు చూసినప్పటికీ రాజకీయ పలుకుబడితో ఉపాధ్యాయులు కీచక చర్యలు మానుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
మాయలా(లే)డి టీచర్
విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించాల్సిన ఉపాధ్యాయురాలు, వారిని దొంగతనాలు చేయాలని ప్రోత్సహిస్తోందని అయ్యవారిపల్లికి చెందిన ప్రజలు ఆరోపించారు. సోమవారం ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని అయ్యవారిపల్లె పాఠశాలలో షమీంబీ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. అదే పాఠశాలలో స్థానికులైన తిప్పన్న, పుష్పవతి దంపతుల కూతురు మహాలక్ష్మి 3వ తరగతి చదువుతోంది. నాలుగు రోజుల క్రితం తిప్పన్న జేబులో నుంచి రూ.1180 మాయమైంది. ప్రతి రోజూ ఒకటి రెండు రూపాయలతో తినుబండారాలు కొనుగోలు చేసే మహాలక్ష్మి వద్ద రెండు రోజులుగా పది రూపాయల నోట్లు కనిపించడంతో వారి ఇంటి సమీపంలోని దుకాణదారు ఆ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేశాడు. దీంతో అతను కూతురిని నిలదీయగా, తమ టీచర్ చెప్పడం వల్లే జేబులోని డబ్బు తీసుకెళ్లి ఇచ్చినట్లు సమాధానమిచ్చింది. అందులోంచి తనకు రూ. 80 ఇచ్చిందని తెలిపింది. దీంతో వారు రూ.500 నోటుపై సంతకం చేసి కూతురుకు ఇచ్చి పంపారు. సోమవారం టీచర్ షమీంబీ యథా ప్రకారం ఎవరెవరు ఏమేం తీసుకువచ్చారంటూ విద్యార్థులను పరిశీలించింది. మహాలక్ష్మి వద్ద ఉన్న రూ.500 తీసుకుని తన పర్సులో వేసుకుంది. అంతలో మహాలక్ష్మి తల్లిదండ్రులు, స్థానికులతో కలసి పాఠశాలకు వెళ్లి టీచర్‌ను నిలదీశారు. ఆమె పర్సు తీసుకుని పరిశీలించగా అందులో సంతకం చేసిన రూ.500 నోటు లభించింది. ఇదెక్కడిదని ప్రశ్నించగా, దారిలో దొరికిందంటూ మహా లక్ష్మే తనకు ఇచ్చిందని టీచర్ బుకాయించింది. ఈ సమాధానంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రధానోపాధ్యాయుడు రుద్రమ నాయక్ కలుగజేసుకుని సర్దిచెప్పాడు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరుగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి శాంతింపజేశాడు. ఈ విషయమై మండల విద్యాధికారి కే.వేణుగోపాల్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణగా కోరగా ఈ సమస్య తన దృష్టికి వచ్చిం దని, విద్యార్థుల తల్లిదండ్రులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.