Minor student
-
బాలిక స్కూల్ డ్రెస్‌పై అభ్యంతరం: తండ్రి ‘సోషల్’ నిరసన
ఒట్టావా: ఓ మైనర్ విద్యార్థిని దుస్తులు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని ఆరోపించి బాలికను ఇంటికి పంపించిన ఘటన కెనడాలో చోటు చేసుకుంది. దీనిపై ఆమె తండ్రి ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాడు. అంతేగాక తనకు, తన కూతురికి మద్దతుగా నిలవాలంటూ సోషల్ మీడయాలో పోస్టు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాలు.. కెనడాలోని నోర్కమ్ సీనియర్ సెకండరీ స్కూల్లో క్యారిస్ అనే విద్యార్థిని చదువుతోంది. ఈ క్రమంలో ఆమె ఇటీవల వైట్ ఫుల్ లెన్త్ స్లీవ్, పొడవాటి నెక్ షర్ట్‌పై బ్లాక్ సింగిల్ స్ట్రీప్, మెకాలి పోడవు ఉన్న లేస్ టాప్ ధరించి స్కూల్‌కు వెళ్లింది. దీంతో క్లాస్‌లో ఓ మహిళా ఉపాధ్యాయురాలు తన మిగతా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేల ఉందని, పాఠాలు చెప్పే సమయంలో ఉపాధ్యాయులంతా ఏకాగ్రత కోల్పోయే విధంగా తన ఆమె దుస్తులు ఉన్నాయని విద్యార్థినితో పేర్కొంది. అంతేగాక క్యారిస్నున స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకుని వెళ్లడంతో, ప్రిన్సిపల్ కూడా ఉపాధ్యాయురాలికి మద్దుతు పలికారు. క్యారిస్ దుస్తులు లోదుస్తులను తలపించేలా ఉన్నాయని, ఇలాంటి దుస్తులను బహిష్కరించాలన్నారు. అంతేగాక క్యారిస్ను ఇంటికి పంపిచామని చెప్పారు. ప్రిన్సిపల్ చెప్పడంతో బాలికను పాఠశాల యాజమాన్యం తిరిగి ఇంటికి పంపించేసింది. ఇంటికి వెళ్లాక జరిగిన విషయాన్ని బాలిక తన తండ్రి క్రిస్టోపర్ విల్సన్‌కు వివరించింది. దీంతో అతడు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను తన కూతురిని అవమానించారని స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాడు. అంతేగాక ఆ మరుసటి రోజు క్యారిస్ తోటి విద్యార్థులంతా మద్దతు పలుకుతూ క్లాస్ రూం నుంచి వాకౌట్ చేశారు. ఇక క్యారిస్ తండ్రి విల్సన్ ‘ఇవాళ నా కూతురిని స్కూలు నుంచి ఇంటికి పంపించారు. తన డ్రెస్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని ఆరోపించారు. దీనిని నేను వ్యతిరేకిస్తున్నాను. దయచేసిన నాకు, నా కూతురికి మద్దుతుగా నిలిచి ఇలాంటి ఘటనలు మరోసారి పునరావుతం కాకుండా చేస్తారని ఆశిస్తున్నాను’ అంటూ ఫేస్బుక్లో పోస్టు చేశాడు. అంతేగాక ఈ విషయం తనను బాధించిందని, 2021లో కూడా ఇలా జరగడంపై తాను నిరాశకు గురయ్యానని పేర్కొన్నాడు. ఈ దీనికి కారణమైన స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు పాఠశాల సూపరెండెంట్ విల్సన్‌తో పేర్కొన్నట్లు తెలిపాడు. -
పెళ్లి చేసుకోవాలంటూ బాలికకు బెదిరింపులు
కౌడిపల్లి (మెదక్): తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ బాలికను బెదిరించిన బాలుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైదేశ్వర్ తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సోమక్కపేట తండాకు చెందిన మైనర్ విద్యార్థిని కౌడిపల్లిలోని బాలికల హాస్టల్లో ఉంటూ స్థానిక ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. కొల్చారం మండలం వరిగొంతం తండాకు చెందిన బాలుడు (16) గతేడాది ఇక్కడే పదోతరగతి చదివి ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం ఇంటివద్ద ఉంటున్నాడు. కాగా, బాలుడు ఈనెల 4న హాస్టల్‌కు వచ్చి తనను పెళ్లిచేసుకోవాలని.. లేకుంటే చంపుతానంటూ బాలికను బెదిరించాడు. గతంలో సైతం పలుమార్లు వేధించడంతో ఆమె విషయం తల్లిదండ్రులకు తెలిపింది. ఈ మేరకు విద్యార్థిని సోదరుడు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. -
విద్యార్థినిపై టీచర్ అత్యాచారం
గోపేశ్వర్: విద్యాబుద్ధులు నేర్పించి, ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. అభం శుభం తెలియని చిన్నారిపై దురాగతానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి కటకటాలపాలయ్యాడు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అనుసూయ ప్రసాద్ తివారి అనే ఉపాధ్యాయుడు నాలుగో తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా ఆ చిన్నారిని వేధిస్తూ అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితురాలి బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కీచక టీచర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. -
విద్యార్థిని కిడ్నాప్ చేసి.. పరారైన లేడీ టీచర్
ముంబై: మైనర్ విద్యార్థితో కలసి పారిపోయిన లేడీ టీచర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఆమెపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన 23 ఏళ్ల అంజలీ సింగ్ అనే టీచర్.. తొమ్మిదో తరగతి చదివే 16 ఏళ్ల విద్యార్థితో స్నేహంగా ఉండేవారని పోలీసులు చెప్పారు. వీరిద్దరూ వాట్స్ యాప్ ద్వారా సంప్రదించుకోవడంతో పాటు తరచూ బయటకు వెళ్లేవారు. గత జనవరి 25 న దుస్తులు కొనుగోలు చేయాలని బయటకి వెళ్లిన విద్యార్థి ఆ తర్వాత ఇంటికి రాలేదు. అతని తండ్రి అదే జోరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజలి కూడా అదే రోజు నుంచి కనిపించడం లేదని పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరి గురించి వాకబు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిద్దరూ మొదట గోవాకు వెళ్లారు. తమ ఆచూకీ తెలియకుండా ఉండేందుకోసం మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసింది. అనంతరం అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోయి అక్కడే మకాం వేశారు. అంజలి ఓ మాల్లో ఉద్యోగంలో కూడా చేరింది. పోలీసులు ఎట్టకేలకు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని ముంబైకి తీసుకెళ్లారు. -
మైనర్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య
కాన్పూర్: మైనర్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. అభిషేక్ (15) అనే విద్యార్థి ట్యుషన్ నుంచి తిరిగి వచ్చి ఇంట్లో ఈ సంఘటనకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఆ సమయంలో విద్యార్థి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. వైద్యుడిని కలిసేందుకు వెళ్లిన తాము ఇంటికి తిరిగివచ్చేసరికి తలుపుకు గడియ వేసి వుందని, ఎంత పిలిచినా అభిషేక్ నుంచి స్పందన రాకపోవడంతో తలుపును పగలకొట్టినట్టుగా వారు తెలిపారు. తాము లోపలికి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతున్న అభిషేక్ ను గుర్తించమని, అయితే అప్పటికే తమ కుమారుడు మృతిచెందినట్టు వెల్లడించారు. కాగా అభిషేక్ ఆత్మహత్యకు గల కారణాలపై ట్యూషన్ టీచర్ ను, తల్లిదండ్రులను విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.