గోపేశ్వర్: విద్యాబుద్ధులు నేర్పించి, ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. అభం శుభం తెలియని చిన్నారిపై దురాగతానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి కటకటాలపాలయ్యాడు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
అనుసూయ ప్రసాద్ తివారి అనే ఉపాధ్యాయుడు నాలుగో తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా ఆ చిన్నారిని వేధిస్తూ అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితురాలి బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కీచక టీచర్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్కు ఆదేశించారు.
విద్యార్థినిపై టీచర్ అత్యాచారం
Published Sat, Apr 5 2014 5:48 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement