పెళ్లి చేసుకోవాలంటూ బాలికకు బెదిరింపులు | Gril to get warning to marry from boy | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోవాలంటూ బాలికకు బెదిరింపులు

Published Tue, Jul 7 2015 11:52 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

Gril to get warning to marry from boy

కౌడిపల్లి (మెదక్): తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ బాలికను బెదిరించిన బాలుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సైదేశ్వర్ తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సోమక్కపేట తండాకు చెందిన మైనర్ విద్యార్థిని కౌడిపల్లిలోని బాలికల హాస్టల్‌లో ఉంటూ స్థానిక ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. కొల్చారం మండలం వరిగొంతం తండాకు చెందిన బాలుడు (16) గతేడాది ఇక్కడే పదోతరగతి చదివి ఫెయిల్ అయ్యాడు.

ప్రస్తుతం ఇంటివద్ద ఉంటున్నాడు. కాగా, బాలుడు ఈనెల 4న హాస్టల్‌కు వచ్చి తనను పెళ్లిచేసుకోవాలని.. లేకుంటే చంపుతానంటూ బాలికను బెదిరించాడు. గతంలో సైతం పలుమార్లు వేధించడంతో ఆమె విషయం తల్లిదండ్రులకు తెలిపింది. ఈ మేరకు విద్యార్థిని సోదరుడు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement