వీడేం లవర్‌రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది.. | Her Lover Ran Away But the Robber Felt Sorry For Her | Sakshi
Sakshi News home page

వీడేం లవర్‌రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది..

Published Wed, Jun 28 2023 6:30 PM | Last Updated on Wed, Jun 28 2023 6:38 PM

Her Lover Ran Away But the Robber Felt Sorry For Her - Sakshi

ప్రేమంటే ఏంటో నాకు నీ వల్లే తెలిసింది.., గుండె మాత్రం నాదే.. కానీ అది చేసే చప్పుడు నీది.., ఒకటా రెండా.. ఎన్ని కబుర్లు చెబుతారో ప్రేమలో ఉన్నప్పుడు. బాబోయ్‌.. వీళ్ల మాటలను కుప్పేస్తే.. కాళిదాసుకు కూడా కన్నీరొస్తుంది! కానీ అసలు పరీక్ష ఎదురైనప్పుడు కదా..! ఆ ప్రేమకు కడదాక అండగా నిలబడగలిగేదెవరో తెలిసేది. ప్రాణ సంకటం ఎదురైనప్పుడు కదా..! ప్రేమికురాలికి నిజం తెలిసేది. సరిగ్గా ఇలాంటి సంఘటన గురించే మీరు తెలుసుకోబోతున్నారు.

ఓ ప్రేమ జంట చేతిలో చేయి వేసుకుని రోడ్డు వెంట నడుస్తున్నారు. బహుశా.. తమ మనసులు మ్యాచ్ అయ్యాయని చెప్పడానికనుకుంట.. మ్యాచింగ్ డ్రస్‌లు వేసుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు వారిని అ‍డ్డగించారు. కత్తితో బెదిరించి ఆ అమ్మాయి వద్ద ఉన్న బ్యాగ్‌ను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో భయపడిన ప్రియుడు పలాయనం చిత్తగించాడు. 

దిక్కుతోచని స్థితిలో ఆ అమ్మాయి.. దొంగపై ఏ మాత్రం ప్రతిఘటన చేయకుండా ప్రియుని వైపు, దొంగ వైపు చూస్తూ దీనంగా ఉండిపోయింది. బ్యాగును దొంగ కొట్టేయడం కంటే ప్రియుడి స్వభావమే ఎక్కువగా బాధ కలిగించినట్లు అతని వైపే చూసింది. ఈ ఘటనతో బైక్ ఎక్కి పారిపోయే ప్రయత్నం చేసిన దొంగ మనసు కరిపోయింది. ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పి బ్యాగును తిరిగి ఇచ్చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్య మాల్లో తెగ వైరల్ అయింది. 

వీడియోపై నెటిజన్ల స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. ప్రేమ పరీక్షలో ప్రియుడు విఫలమయ్యాడని కొందరు కామెంట్ చేశారు. లవర్‌ పారిపోకపోతే.. ఆ దొంగకు సానుభూతి కలిగేది కాదని మరికొందరు స్పందించారు. ఈ క్రెడిట్‌ కూడా ప్రియుడిదే అని కొందరు చెప్పుకొచ్చారు. మరికొంత మంది నెటిజన‍్లు దొంగ స్వభావాన్ని మెచ్చుకున్నారు.  

ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement