![Boyfriend Turn to Thief For His Lover maintenance - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/27/loveer.jpg.webp?itok=79ZppENl)
బల్వీర్‌సింగ్
అమీర్‌పేట: ప్రియురాలి అవసరాలు తీర్చేందుకు నేరాల బాట పట్టిన ఉన్నత విద్యావంతుడిని శుక్రవారం అమీర్‌పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడకు చెందిన బల్వీర్‌సింగ్ సంపన్న కుటుంబంలో పుట్టాడు. ఉన్నత చదువులు చదివాడు. జాతీయ స్థాయి విద్యాసంస్థలో చదువుతున్న ఓ యువతిని ప్రేమిస్తున్న అతను ఆమె అవసరాలు తీర్చడం కోసం దొంగగా మారాడు. ఇటీవల బల్కంపేటలోని ఓ ఇంట్లో చొరబడి 30 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు.సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బల్వీందర్ సింగ్‌ను గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అతను నగరంలో ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment