వాహనదారుడి దాష్టికం! కారుతో కానిస్టేబుల్‌ కాలుని తొక్కించి... | Man Ran Over Traffic Constables Leg With Car Assaulted At Banjara Hills | Sakshi
Sakshi News home page

వాహనదారుడి దాష్టికం! కారుతో కానిస్టేబుల్‌ కాలుని తొక్కించి...

Published Wed, Jan 11 2023 7:57 AM | Last Updated on Wed, Jan 11 2023 8:05 AM

Man Ran Over Traffic Constables Leg With Car Assaulted At Banjara Hills - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: ఫ్రీ లెఫ్ట్‌లో కారును అడ్డు తొలగించాలని కోరిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై వాహనదారుడు కారుతో కాలును తొక్కించడమే కాకుండా దాడి చేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లోని తాజ్‌కృష్ణా జంక్షన్‌లో ఓ కారు డ్రైవర్‌ ఫ్రీ లెఫ్ట్‌లో కారు నిలపడంతో అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఎల్‌.నగేష్‌ అడ్డు తొలగాలని సైగలు చేశాడు.

అయినాసరే సదరు వాహనదారుడు వినిపించుకోలేదు. వెంటనే కానిస్టేబుల్‌ ఆ కారు దగ్గరికి వెళ్ళగా ఆగ్రహంతో ఊగిపోతున్న డ్రైవర్‌ కోపంతో కానిస్టేబుల్‌ కాలుపైకి కారును పోనిచ్చాడు. అంతే కాకుండా కిందకు దిగి పిడిగుద్దులతో దాడి చేసి చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ బట్టలు కూడా చిరిగాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై సెక్షన్‌ 353 కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement