తెల్లవారుజామున ఇంటి ముందు కల్లాపి చల్లుతూ.. ముగ్గులు వేస్తున్న మహిళల మెడ నుంచి బంగారు చైన్లను దుండగలు
పీలేరులో చైన్‌స్నాచర్ల హల్ చల్
ముగ్గులేస్తున్న మహిళల మెడలోని తాళిబొట్ల అపహరణ
తెల్లవారుజామున ఇంటి ముందు కల్లాపి చల్లుతూ.. ముగ్గులు వేస్తున్న మహిళల మెడ నుంచి బంగారు చైన్లను దుండగలు అపహరించారు. రెప్పపాటులో తాలిబొట్లను తెంపి ఉడాయించారు. దాడి నుంచి మహిళలు తేరుకునే లోపే అక్కడి నుంచి మాయమయ్యారు.
పీలేరు: చైన్ స్నాచర్లు పీలేరు పట్టణంలో హల్‌చల్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు తాళిబొట్లను లాక్కెల్లారు. ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్యలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన స్నాచర్లు ఇళ్ల ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేస్తున్న సమయంలో తమ ప్రతాపం చూపారు. రెప్పపాటు వ్యవధిలో ఈ ఘటనలతో మహిళలు దిగ్భ్రాంతికి గురయ్యారు. గట్టిగా కేకలు వేసేలోపే మాయమయ్యారు. పట్టణంలో ఈ సంఘటనలు తీవ్ర కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని బాలాజీ థియేటర్ సమీపంలో మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో మనోహర్ భార్య రూపాదేవి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేస్తుండగా బుల్లెట్ పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని 7 సవర్ల బంగారు తాళిబొట్టును లాక్కెల్లారు.
అలాగే పట్టణంలోని ఇందిరానగర్‌లో ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుని భార్య ఇంటి ముందు చెత్త ఊడుస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన స్నాచర్లు శ్రీనివాసులురెడ్డి ఇళ్లెక్కడని అడగడం, ఆమె సమాధానం చెప్పేలోపే ఆమె మెడలోని బంగారు బొట్టుచైన్‌ను తెంపేశారు. అలాగే ఇందిరానగర్‌లో ఇళ్లముందు ముగ్గులు వేసుకుం టున్న ఇద్దరు మహిళళను ఏమార్చబోయారు. అయితే వారు అప్రమత్తం కావడంతో స్నాచర్లు పరారయ్యారు. ఇందిరానగర్‌కు చెందిన బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి విముఖత వ్యక్తం చేశారు.