
గొలుసుదొంగలకు దేహశుద్ధి
హైదరాబాద్: హైదరాబాద్‌లో గొలుసుదొంగలకు ప్రజలు బుద్ధిచెప్పారు. నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కోహెడ గ్రామంలో కందల లక్ష్మమ్మ అనే మహిళ మంగళవారం ఉదయం పాలు పోయాడానికి వెళ్లి వస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. లక్ష్మమ్మ వెంటనే కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పారిపోతున‍్న ఇద్దరు స్నాచర్లను పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నాలుగున్నర తులాల బంగారు గొలుసు తిరిగి దక్కడంతో లక్ష్మమ్మ ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.