నల్గొండ జిల్లా కోదాడ శివారులో చైన్ స్నాచర్ బి. శివారెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
నల్గోండ: నల్గొండ జిల్లా కోదాడ శివారులో చైన్ స్నాచర్ బి. శివారెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్కు తరలించిన పోలీసులు శివారెడ్డిని తనదైన శైలిలో విచారిస్తున్నారు. నిందితుడి శివారెడ్డిపై ఇప్పటికే కృష్ణా జిల్లా మైలవరం, ఏ కొండూరు, రెడ్డి గూడెం పోలీసు స్టేషన్లతోపాటు నల్గొండ జిల్లా హుజూర్నగర్, కోదాడ, చిలుకూరు పోలీసు స్టేషన్లలో పలు దొంగతనం కేసులు నమోదయాయి.