జిల్లాలో తరుచూ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న పాత నేరస్థుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
నల్లగొండ : జిల్లాలో తరుచూ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న పాత నేరస్థుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలో జరిపిన తనిఖీల్లో పాత నేరస్థుడు కొత్తేటి రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నల్లగొండలో జరిగిన మీడియా సమావేశంలో రాజును పోలీసులు ప్రవేశపెట్టారు. వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన రాజు చైన్‌స్నాచింగ్‌లకు అలవాటు పడ్డాడు.
ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. కాగా తనిఖీల్లో పట్టుకున్న రాజు వద్ద నుంచి పోలీసులు 23 తులాల బంగారం, ఒక టీవీఎస్ మోపెడ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో రాజు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది చైన్‌స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నాడు.