ఇండోర్లో ఓ మహిళ తన గొలుసు కొట్టేసిన వాడిని కిలోమీటరు దూరం వరకు వెనక పరుగెత్తి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఎవరైనా మెడలో గొలుసు కొట్టేస్తే ఒక్కసారిగా సాధారణ మహిళలైతే కంగారు పడతారు. ధైర్యవంతులైతే వాళ్ల వెనకాల పడి పట్టుకుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో ఓ మహిళ ఇలాగే ధైర్యం చూపించి పదిమందికీ ఆదర్శంగా నిలిచారు. తన గొలుసు కొట్టేసిన వాడిని కిలోమీటరు దూరం వరకు వెనక పరుగెత్తి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
హరిద్వార్ నగరంలో ప్రైవేటు ట్యూషన్లు చెప్పుకొనే నిర్మలా పండిట్ తన బంధువుల ఇంటికి ఇండోర్ వచ్చారు. బయటకు వెళ్లినప్పుడు ఉన్నట్టుండి ఓ వ్యక్తి వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసు కొట్టేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అందరిలా భయపడేందుకు బదులు అతడిని కిలోమీటరు దూరం వరకు పరిగెత్తి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆమె ధైర్యానికి మెచ్చుకున్న పోలీసులు 10 వేల రూపాయల రివార్డు ఇచ్చి సత్కరించారు.