నాగాయలంక (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా నాగాయలంకలో ఆదివారం ఒక మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిన దొంగను స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు నాగాయలంకలో ఉప్పల ప్రమీలారాణి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా కోడూరు మండలం మర్రిపాలెంకు చెందిన రంగప్రసాద్ ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరుగుతీశాడు. ఆమె కేకలు వేయడంతో గ్రామస్తులు వెంబడించి అతణ్ణి పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేశారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు.