అప్పుడే పుట్టిన ఆడపిల్లను నడిరోడ్డుపై వదిలివెళ్లిన సంఘటన విజయనగరం జిల్లా ఎస్. కోట మండలం అమ్మపాలెంలో సోమవారం చోటుచేసుకుంది.
అప్పుడే పుట్టిన ఆడపిల్లను నడిరోడ్డుపై వదిలివెళ్లిన సంఘటన విజయనగరం జిల్లా ఎస్. కోట మండలం అమ్మపాలెంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బొడ్డు పేగు కూడా తెగని పసికందు(బాలిక)ను గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పై వదిలి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పసికందును వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.