నడివీధిలో శైశవ గీతం! | Neonatologist, is on the road | Sakshi
Sakshi News home page

నడివీధిలో శైశవ గీతం!

Published Thu, Nov 3 2016 6:11 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

నడివీధిలో శైశవ గీతం!

నడివీధిలో శైశవ గీతం!

మంటగలుస్తున్న మానవత్వం
రోడ్డు పాలవుతున్న పసికందులు
శిశువిహార్‌కి ఏటా వంద మందికి పైనే
పదేళ్లలో 2346 మంది... సామాజిక-ఆర్థిక కారణాలే నేపథ్యంత

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం.. కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ.. ఏమీ ఎరుగని పూవుల్లారా,అరుుదారేడుల పాపల్లారా...తండ్రిసందిటా..తల్లి కౌగిటా ఉండాల్సిన..మీరు వీధి పాలవుతున్నారు... ఈ పాపం ఎవరిది..?  ఈ అమానుషానికి అంతం ఎప్పుడు?

..మహానగరంలో మానవత్వం మంటగలుస్తోంది... పక్షానికో పసికందు రోడ్డు పాలవుతోంది...గడిచిన నెల రోజుల కాలంలోనే నలుగురు చిన్నారులు బోడ్డూడక ముందే పొత్తిళ్లకు దూరమై వార్తల్లోకి ఎక్కారు... వీరిని అక్కున చేర్చుకునే శిశువిహార్‌కు దశాబ్ద కాలంలో 2346 మంది చేరారు. వీరిలో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉంటున్నారు. ఈ ఉదంతాల వెనుక సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా వీధుల పాలవుతున్న వారిలో కొందరు బతికి బట్టకడుతుండగా... వీధి జంతువుల బారినపడి ప్రాణాలు వదులుతున్న సంఘటనలూ ఉన్నారుు.              - సాక్షి, సిటీబ్యూరో

సిటీబ్యూరో: నగరంలో వివిధ కారణాలతో రోడ్డు పాలవుతున్న పసిగుడ్డుల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉంటున్నారు. ఆడపిల్ల అంటే చులకన భావన, భారం అనే ఉద్దేశం ఇప్పటికీ అనేక మందిలో ఉంది. కాస్త వైద్యపరమైన అవగాహన కలిగిన వారు గర్భస్థ దశలోనే స్కానింగ్ తదితరాలను ఆశ్రరుుంచడం ద్వారా పుట్టబోయేది ఎవరో తెలుసుకుంటున్నారు. ఇలాంటి పరీక్షలను ప్రభుత్వం నిషేధించిన ‘డిమాండ్’ను బట్టి జరుగుతూనే ఉన్నారుు. అలా పుట్టబోయే వారి వివరాలు తెలుసుకుంటున్న వారిలో అనేక మంది గర్భస్రావం వంటి వాటి వైపు మొగ్గుతూ భ్రూణ హత్యలు చేస్తున్నారు. ఇలాంటి పరిజ్ఞానం లేని దిగువ మధ్య తరగతి, కింది తరగతులకు చెందిన వారు బిడ్డ పుట్టే వరకు ఆగి ఆపై ఆడపిల్ల అరుుతే వీధుల పాలు చేస్తున్నారు. రోడ్డు పాలవుతున్న ఆడశిశువులతో పోలిస్తే మగ శిశువుల సంఖ్య 5 శాతం కూడా ఉండట్లేదు.

కారణాలు అనేకం...
మాతృత్వాన్ని మరిచి పుట్టిన బిడ్డల బొడ్డూడక ముందే నడిరోడ్డుపై వదిలేయడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సామాజిక నేపథ్యం, ఆర్థిక కారణాలు, కుంటుంబ పరిస్థితులు వీటన్నింటి ప్రభావం ఉందని వివరిస్తున్నారు. ఆడపిల్లలను వదిలించుకోవాలనే భావన  ప్రధాన కారణంగా ఉంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, భార్యాభర్తల మధ్య స్పర్థలు, సక్రమంగా లేని కుటుంబ నేపథ్యాల కారణంగానూ మాతృత్వాన్ని మర్చిపోతున్నారు. దీనికి తోడు పుట్టిన బిడ్డలో వైకల్యాలు, గుండెకు రంధ్రం వంటి దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నప్పుడూ వారిని వదిలించుకోవాలని చూస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలానా బిడ్డ కావాలంటూ ఎదురు చూసిన తల్లిదండ్రులు ఆ ఫలితం లభించకపోరుునా వదిలించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్య నగరాల కంటే దాని చుట్టుపక్కల విస్తరించి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోందని వివరిస్తున్నారు.

 అసాంఘికశక్తులుగా మారే ప్రమాదం...
ఈ రకంగా వీధుల పాలవుతున్న శిశువులు పెరిగే కొద్దీ మానసికంగా ధ్వేషభావాన్ని పెంచుకునే అవకాశం ఉందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాజంపై ఏహ్యభావం పెరగడం, ఆలనాపాలనా లేకపోవడం ఫలితంగా పెడదారులు పట్టి అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. పెరిగే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాల కారణంగా వీరిలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డెవలప్ అవుతుందని, త్వరగా వ్యసనాలకు బానిసలు కావడంతో పాటు కరుడుగట్టిన వారిగానూ మారే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఇలా పసిగుడ్డులు రోడ్డు పాలు కావడంతో తల్లి తప్పు ఎంత ఉంటుందో... తండ్రి తప్పూ అదే స్థారుులో ఉంటుంది.

శిశువిహార్‌కు 2346 మంది...
నగరంతో పాటు శివారు జిల్లాల్లోనూ లభించే పసివాళ్లను సంరక్షణ నిమిత్తం అమీర్‌పేట ప్రాంతంలో ఉన్న శిశువిహార్‌కు పంపిస్తారు. ఈ కేంద్రానికి గడిచిన పదేళ్ళ కాలంలో 2346 మంది శిశువులు రాగా... వీరిలో 1720 మంది ఆడశిశువులే. స్పష్టంగా చూస్తే ఇక్కడా ‘వివక్ష’ కనిపిస్తోంది. ఆడపిల్లను స్వేచ్ఛగా బతకనీయలేని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేంద్రం అధికారులు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఆడపిల్లలు కావడం, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య స్పర్థల తదితర కారణాలతో రోడ్డు పాలైన శిశువులను అవసరమైన స్థారుులో సంరక్షిస్తాం. అర్హులను గుర్తించడం ద్వారా పదేళ్ళల్లో 1063 మందిని దత్తతిచ్చాం. మరో 229 మంది తల్లిదండ్రుల్ని గుర్తించి వారికి అప్పగించాం. ఇక్కడకు వచ్చిన శిశువుల్ని కంటికి రెప్పలా కాపాడటంతో పాటు వారి కాళ్ళపై వాళ్ళు నిలిచే వారకు తోడుగా ఉంటాం’ అని అన్నారు. అనేక సందర్భాల్లో పోలియోతో పాటు ఇతర వ్యాధులు సోకిన, అవయవాలు సరిగ్గా లేకండా పుట్టిన శిశువుల్ని ఇలా వదిలేయడం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు.

ఇవి హత్యలు కాదా?
19.04.2016: చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డ బావి నాలాలో నాలుగు రోజుల పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

16.05.2016: రెండు రోజుల వయస్సున్న ఆడ శిశువు మృతదేహాన్ని కవర్‌లో చుట్టి ఓ ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి ఎస్సార్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్పెంటర్ శివ ఇచ్చిన సమాచారంతో ఇది వెలుగులోకి వచ్చింది.

04.07.2016: చిక్కడపల్లి ఠాణా పరిధిలోని హరినగర్‌లోని ఓ ఇంటి పై భాగంలో పడి ఉన్న ఆడ శిశువు మృతదేహాన్ని స్థానికుల సాయంతో పోలీసులు స్వాధీనం చేసకున్నారు.

6.10.2016: బాలానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఐడీపీఎల్ కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద పొదల్లో ఓ పసికందు ఏడుపు విని స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. అది వచ్చేసరికి శిశువు చనిపోరుుంది.

వీటికి బాధ్యులెవరు?
18.05.2016:హుమాయున్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని కై లాష్ నగర్ వద్ద రోడ్డుపై వెళ్తున్న ఆటోలోంచి గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును గుడ్డల్లో చుట్టి పడేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు శిశువును ఆస్పత్రికి చేర్చారు.

07.08.2016: ఏడాదిన్నర వయస్సున్న ఓ పాపని గుర్తుతెలియని వ్యక్తులు గాంధీ ఆస్పత్రి వద్ద వదిలి వెళ్ళారు. వాహనాలు పార్క్ చేసే సెల్లార్‌లో ఈ పాపను గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చి సమాచారం ఇచ్చాడు. పోలీయో సోకిందనే కారణంగానే పాపను వదిలినట్లు గుర్తించారు. 

04.10.2016: హయత్‌నగర్ నుంచి కుంట్లూరు వెళ్ళే దారిలో పాపయ్య గూడ చౌరస్తా వద్ద చెట్ల పొదల్లో రెండు నెలల శిశువును పోలీసులు గుర్తించారు. పాప ఏడుపు విన్న స్థానికుల సమాచారంతో అక్కడకు వచ్చిన పోలీసులు శిశువును శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. 

10.10.2016: పంజగుట్ట ఠాణా పరిధిలోని రాజ్‌భవన్ రోడ్డులోని అప్పయ్యగుడి వీధిలో ఓ చెత్తకుండీనే శిశువు పొత్తిళ్ళయ్యారుు. చెత్తకుప్ప సమీపంలో పసిగుడ్డు ఉండటాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు చెప్పడంతో వారు రెస్క్యూ చేశారు.

అది నిర్ధారిస్తే నేరమే
‘పసివాళ్ళును ఇలా ఏలాంటి ఆధారం లేకుండా నిర్దాక్షణ్యంగా రోడ్లపై వదిలేయడం కూడా చట్ట ప్రకారం నేరమే. వీరితో పాటు వృద్ధుల కోసం కొన్నేళ్ళ క్రితం ప్రత్యేక చట్టం వచ్చింది. దీని ప్రకారం అలా అమానుషంగా వ్యవహరించే వారికి శిక్షించవచ్చు. అరుుతే ఇలాంటి కేసుల్లో ఆ శిశువుల్ని వదిలేసిన తల్లిదండ్రులు ఎవనేది గుర్తిచడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఈ చట్టం పూర్తిస్థారుులో అమలుకావట్లేదు. అవకాశం ఉన్నా అనేక సందర్భాల్లో విభాగాలు పట్టించుకోవట్లేదు.’ - రామకృష్ణ, మాజీ డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement