
శ్మశానంలో పసికందు
సిద్దిపేట: అప్పుడే పుట్టిన పసికందును శ్మశానంలో వదిలివెళ్లిన ఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలో శనివారం చోటుచేసుకుంది. ఉదయం కోమటి చెరువు పక్క నుంచి స్థానికుడు తోడెంగల కృష్ణ (26) వెళుతుండగా.. శ్మశానంలో ఒక మూల నుంచి ఏడుపు వినిపించింది. దగ్గరకెళ్లి పరిశీలించగా ఓ శిశువు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు.
వెంటనే శిశువును 108 లో సిద్దిపేట మాతాశిశు సంక్షేమ కేంద్రానికి తరలించి అత్యవసర చికిత్సలను చేపట్టడంతో ప్రాణాపాయం తప్పింది. ఐసీడీఎస్ అధికారులు సంగారెడ్డిలోని శిశు వివాహార్‌కు తరలించారు.