Paris Paralympics 2024: భారత్‌ ఖాతాలో 25వ పతకం | Paris Paralympics 2024: Kapil Parmar Scripts History, Wins Indias First Ever Paralympic Medal In Judo | Sakshi
Sakshi News home page

Paris Paralympics 2024: భారత్‌ ఖాతాలో 25వ పతకం

Published Thu, Sep 5 2024 9:23 PM | Last Updated on Fri, Sep 6 2024 9:25 AM

Paris Paralympics 2024: Kapil Parmar Scripts History, Wins Indias First Ever Paralympic Medal In Judo

పారిస్‌ పారాలింపిక్స్‌ 2024లో భారత్‌ ఖాతాలో 25వ పతకం చేరింది. పురుషుల జూడో 60 కేజీల జే1 విభాగంలో కపిల్‌ పర్మార్‌ కాంస్య పతకం సాధించాడు. పారాలింపిక్స్‌ జూడోలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో పర్మార్‌.. బ్రెజిల్‌కు చెందిన ఎలిల్టన్‌ డి ఒలివియెరాపై విజయం సాధించాడు. 

కపిల్‌ ఒలివియెరాపై కేవలం 33 సెకెన్లలో విజయం​ సాధించడం విశేషం. కపిల్‌ కాంస్యంతో భారత్‌ కాంస్య పతకాల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు భారత్‌ 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement