భువనగిరి: మండలంలోని వడాయిగూడెం గ్రామంలో ఉన్న ప్రెసిడెన్సీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎం. నిషిత జాతీయ భౌతిక రసాయన శాస్త్రనైపుణ్య పరీక్షలో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పరీక్షల కమిటీ సమన్వయ కర్తలు భరణి, నరసింహాచారి తెలిపారు. ఈ మేరకు శనివారం పాఠశాల కరస్పాండెంట్ దిడ్డి బాలాజీ విద్యార్థిని నిషితకు రూ.వెయ్యి నగదును అందజేసి అభినందించారు. ఈ నెల 14న పట్టణ శివారులో ఉన్న వెన్నెల బీఈడీ కళాశాలలో అఖిల భారత భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులచే నిర్వహించిన జిల్లా స్థాయిలో పరీక్షలో నిషిత ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు వారు చెప్పారు.
రాష్ట్రస్థాయి పరీక్షకు ఎంపిక
Published Sat, Aug 27 2016 10:29 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
Advertisement
Advertisement