రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు ప్రారంభం
Published Fri, Nov 18 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
భానుగుడి(కాకినాడ) :
ఏపీ పాఠశాలల సమాఖ్య 62వ అంతర్ జిల్లాల స్కేటింగ్ పోటీలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ కుళాయిచెరువు పార్కు స్కేటింగ్ ప్రాంగణంలో జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు ఈ పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్రస్థాయి క్రీడలకు జిల్లా ఆతిథ్యమివ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. పోటీల్లో పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. 262 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 48 మంది క్రీడాకారులను జాతీయ స్థాయిలో కర్ణాటక గుల్‌బర్‌్గలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేశామని పాఠశాల క్రీడల కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. క్రీడాకారులు తమ స్కేటింగ్ ప్రదర్శనలతో ఆహూతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఎస్‌డీఓ పి.మురళీదర్, జిల్లావిద్యాశాఖ ఏడీ విజయలక్ష్మి, స్టేట్ అబ్జర్వర్ బాబూరావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement