compitations
-
బరువు మోసే రిలే పోటీల విజేత
అమృతలూరు : సంక్రాంతి సంబరాల్లో భాగంగా అమృతలూరులో గురువారం సాయంత్రం దావులూరి నాగేశ్వరరావు (చిన్న) స్మారక జిల్లాస్థాయి 50 కేజీల బరువు మోసే రిలే పోటీలను నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. నిర్ణీత దూరాన్ని నలుగురు మోసే రిలే పోటీలలో అమృతలూరుకు చెందిన నవభారత్ (సీహెచ్ వినీల్) యూత్ 1 నిమిషం, 36 సెకన్లలో మోసి ప్రథమస్థానం, చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి చెందిన కె. హనుమాన్ టీమ్ 1 నిమిషం, 46 సెకన్ల మోసి ద్వితీయస్థానం, అమృతలూరుకు చెందిన ప్రతాప్ యూత్ 1 నిమిషం, 53 సెకన్లలో మోసి తృతీయ స్థానం, అమృతలూరుకు చెందిన నవభారత్ (జి. విజయ్‌కుమార్) యూత్ 1 నిమిషం, 56 సెకన్లలో మోసి నాల్గో స్థానం సాధించాయి. ప్రథమ బహుమతి రూ. 3,200, ద్వితీయ బహుమతి రూ.2,400, తృతీయ బహుమతి రూ.1,600, నాల్గో బహుమతి రూ.1,000 విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కరరావు, సర్పంచ్ కూచిపూడి సతీష్‌కుమార్, గొట్టిపాటి భానుగంగాధర్, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా రాపర్ల మల్లికార్జునరావు, దేవరకొండ నాగరాజు వ్యవహరించారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
అమలాపురం జో¯ŒS బాలికల గ్రిగ్స్ ప్రారంభం పుల్లేటికుర్రు(అంబాజీపేట) : పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూలులో సోమవారం ప్రారంభమైన అమలాపురం బాలికల గ్రి గ్స్ ఆటల పోటీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సా గాయి. మూడురోజులు జరిగే పోటీల్లో కోనసీమవ్యాప్తంగా 1000 మంది క్రీడాకారులు, 70 మం ది పీఈటీలు పాల్గొన్నారని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు, హెచ్ఎం పి.వీరభద్రుడు, ఆర్గనైజిం గ్ సెక్రటరీ, పీఈటీ అందె సూర్యనారాయణ తెలి పారు. మొదటి రోజు విజేతల వివరాలను ప్రకటించారు. మార్చ్‌పాస్ట్‌లో ముమ్మిడివరం, గోపవరం, పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూళ్లు, 800 మీ టర్ల రన్నింగ్ సీనియర్స్ విభాగంలో దొమ్మేటి మ నీషా (అంబాజీపేట), ఎ¯ŒSఎస్వవీ శరణ్య (భాష్యం, అమలాపురం), టి.ప్రియ (పాలగుమ్మి), హాకీ సీనియర్స్ విభాగంలో పి.లక్షి్మవాడ, ముని పల్లి, గొల్లవిల్లి స్కూళ్లు, టేబుల్ టెన్నిస్ సింగి ల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, కొమరగిరిపట్నం, డబుల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, వీరవల్లిపాలెం, జూనియర్స్ సింగిల్స్ విభాగంలో శానపల్లిలంక, వీరవల్లిపాలెం, జగన్నాథపురం, డబుల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, కొమరగిరి పట్నం పాఠశాలలు వరుసగా మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. . అలరించిన ఊఫింగ్ డ్రిల్ గ్రిగ్స్ ప్రారంభం సందర్భంగా అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరం జెడ్పీ హైస్కూలుకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు నిర్వహించిన ఊ ఫింగ్ డ్రిల్ ఆకట్టుకుంది. ఈ డ్రిల్‌లో వారికి ప్రధానోపాధ్యాయుడు రంకిరెడ్డి కాశీవిశ్వనాథం, వ్యాయామ ఉపాధ్యాయు డు ఎ.ఉమామహేశ్వరరావు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులను పి. గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అభినందించారు. -
జాతీయ మాస్టర్స్ అ«థ్లెటిక్స్కు నాగబాబు
గంగవరం : జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగి వై.నాగబాబు ఎంపికయ్యారు. శని, ఆదివారాల్లో విజయనగరం జిల్లా ఎస్.కోటలో జరిగిన 37వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపె¯ŒS మీట్– 400, 800, 1500 పరుగు పందేల్లో నాగబాబు బంగారు పతకాలు పొందారు. ఆయన 2017లో కర్నాటకలో మంగుళూరులో జరిగే జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పాల్గొననున్నారు. 2015లో హర్యానాలో, 2016లో లక్నోలో జరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పలు పతకాలను సాధించారు. ఆయనను ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎంపీపీ ప్రభ, జెడ్పీటీసీ సూర్యకాంతం, సర్పంచ్ అక్కమ్మ, డీసీసీబీ డైరెక్టర్ యెజ్జు వెంకటేశ్వరరావు, పీహెచ్సీ వైద్యాధికారి సౌజన్య, సిబ్బంది అభినందించారు. -
అంతర కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం
భానుగుడి(కాకినాడ) : జేఎ¯ŒSటీయూకేలో అంతర కళాశాలల అ«థ్లెటిక్ పోటీలను వీసీ వి.ఎస్.ఎస్.కుమార్ శనివారం ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, పావురాను గాల్లోకి వదిలారు. క్రీడలకు వర్సిటీ పెద్దపీట వేస్తోందని చెప్పారు. వర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. మహిళా విభాగం 1500 మీటర్ల పరుగులో ఎం.సాయి చందన, ఎల్.భార్గవి, కె.దివ్యారెడ్డి, 100 మీటర్ల పరుగులో కె.కీర్తి, షేక్ సబీనా, ఐ.బాలభార్గవి, డిçస్క్త్రోలో కె.వసుధారెడ్డి, సిహెచ్.యామిని, ఎ.సచ్చిదానంద గీతలు, హైజంప్‌లో ఎస్.తనూష, డి.పల్లవి, జి.నాగబిందు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల విభాగం 1500 మీటర్ల పరుగులో కె.శివ, పి.కృష్ణ చైతన్య, కేఎ¯ŒSఎస్కే నితీష్, 100 మీటర్ల పరుగులో వి.తిరుమల రావు, జి.స్వామి, ఎస్.సూర్యపవ¯ŒSకుమార్, ట్రిపుల్ జంప్‌లో బి.వినోద్‌కుమార్, ఎస్.జితేందర్ కుమార్, బి.అఖిల్ గౌతమ్, షాట్‌పుట్‌లో ఎం.పునీత్‌కుమార్, బి.విజయ రోహిత్, బి.రాజేష్, హైజంప్‌లో డి.వెంకటేశ్వరరావు, పి.శశాంక్ చౌదరి, ఎ¯ŒS.గోపాలకృష్ణ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచినట్టు స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్యామ్‌కుమార్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు ప్రారంభం
భానుగుడి(కాకినాడ) : ఏపీ పాఠశాలల సమాఖ్య 62వ అంతర్ జిల్లాల స్కేటింగ్ పోటీలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ కుళాయిచెరువు పార్కు స్కేటింగ్ ప్రాంగణంలో జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు ఈ పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్రస్థాయి క్రీడలకు జిల్లా ఆతిథ్యమివ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. పోటీల్లో పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. 262 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 48 మంది క్రీడాకారులను జాతీయ స్థాయిలో కర్ణాటక గుల్బర్్గలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేశామని పాఠశాల క్రీడల కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. క్రీడాకారులు తమ స్కేటింగ్ ప్రదర్శనలతో ఆహూతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఎస్డీఓ పి.మురళీదర్, జిల్లావిద్యాశాఖ ఏడీ విజయలక్ష్మి, స్టేట్ అబ్జర్వర్ బాబూరావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ‘శ్రీప్రకాష్’ విద్యార్థి
పెద్దాపురం : జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల విద్యార్థి డి.సత్యనారాయణ ఎంపికైనట్టు పాఠశాల డీన్ రాజేశ్వరి తెలిపారు. సోమవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గత నెలలో తిరుపతి వేంకటేశ్వర విద్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించాడన్నారు. సత్యనారాయణను పాఠశాల డైరెక్టర్ సీహెచ్.విజయ్ ప్రకాష్, అధ్యాపక బృందం, లైజాన్ ఆఫీసర్ ఎం.సతీష్ అభినందించారు. -
‘అందాల’ పోటీలపైనా రాజకీయ క్రీనీడ
సాక్షి ప్రతినిధి : వెలుగు జిలుగులు విరజిమ్మే మెర్క్యు రీ లైట్లు. కళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుద్దీపాలు, డిస్కో లైట్లతో ఆ స్టేజ్ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అందరు 18 నుంచి 22 ఏళ్ల వయసులో ఉన్న అందమైన యువతుల తళుకుబెళుకుల క్యాట్‌వాక్. వీనుల విందైన పాశ్చాత్య పాటల హోరుతో స్టేజ్ అదిరిపోతోంది. కాకినాడ పద్మనాభ ఫంక్షన్‌హాలు వేదికగా మిస్ కాకినాడ ఎంపిక మొదలైంది. ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టాలనే ఆసక్తి, ఉత్సాహంతో కాకినాడ పరిసర ప్రాంతాల యువతులు క్యూ కట్టారు. మిస్ కాకినాడ కిరీటం కోసం నిర్వహించిన అందాల పోటీల వేదిక అది. విశాఖకు చెందిన డ్రీమ్ మేకర్స్‌జ్ అనే సంస్ధ ఈ పోటీలు నిర్వహించింది. మిస్ కాకినాడకురూ.లక్ష, రెండు, మూడు∙రన్నరప్‌లకు రూ.50వేలు, నాలుగు సబ్ టైటిల్స్‌కు (బెస్ట్ ఐస్, బెస్ట్ హెయిర్, బెస్ట్ ఫిజిక్, బెస్ట్ స్కిన్ టోన్) రూ.25 వేల చొప్పున నగదు బహుమతి అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలతో యువతలో ఆశలు రేకెత్తించింది. బహుమతులకంటే ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టాలనే కోరికలే గుర్రాలై యువత క్యూ కట్టింది. యువత ఆశలను సొమ్ము చేసుకున్న పలువురు మిస్ కాకినాడ పోటీల్లో నిజాయితీ మిస్ అయ్యేలా వ్యవహరించారు. తనవారిపై ‘పచ్చ’పాతం... గత నెల 17న జరిగిన అందాల పోటీలలో కాకినాడ సిటీకి చెందిన ఇద్దరు స్నేహితుల నిర్వాకం ఫలితంగా ఔత్సాహిక యువతుల ఆశలు అడియాసలయ్యాయి. ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకాయన సిటీలో అధికారపార్టీకి ముఖ్య నేత. మరో స్నేహితుడు అదే పార్టీలో ద్వితీయ శ్రేణి నేత. ఇద్దరిలో ముఖ్యనేతకు కుమార్తెలు లేరు. మిస్ కాకినాడ కిరీటం తన కుమార్తెకు రావాలని ఆ ద్వితీయశ్రేణి నాయకుడు పైరవీలు చేశాడు. స్నేహమేరా జీవితం ... స్నేహమేరా శాశ్వతమంటూ నేరుగా సిఫార్సు చేయకుండా ‘తన స్నేహితుడి కుమార్తె అందాల పోటీల్లో పాల్గొంటోంది, ఆ అమ్మాయి తనకు కూడా కుమార్తెతో సమానమని’ బలమైన హింట్ ఇచ్చారు. అదీ విజేతలను ప్రకటించడానికి ఏడెనిమిది గంటల ముందు మనస్సులో మాట బయటపెట్టారు. అంతే ఒక్కసారి సీన్ మారిపోయింది. నాలుగు రౌండ్లలో నిర్వహించిన మిస్ కాకినాడ పోటీల్లో ఆయన మాటే వేదవాక్కయ్యింది. మొదట రౌండ్లో చీర, రెండవ రౌండ్లో పంజాబీ డ్రెస్, మూడవ రౌండ్లో తమ ఇష్టం మేరకు నచ్చిన డ్రెస్సులతో క్యాట్ వాక్. చివర టాలెంట్ రౌండ్లో డ్యాన్స్, పాటలు, మ్యాజిక్ ఇలా ఎవరి ఇష్టం వారిది. నాలుగు రౌండ్స్‌లో టోటల్‌గా ఉత్తమ ప్రతిభను కనుబరిచిన వారిని మిస్ కాకినాడగా ఎంపిక చేయాలి. నిర్వాహకులు అలానే చేద్దామనుకున్నారో ఏమో తెలియదు. తన స్నేహితురాలి కుమార్తె తన కుమార్తెతో సమానమని ఆ ముఖ్యనేత అందరి సమక్షంలో ప్రకటించడమంటేæఎంపికను ప్రభావితం చేయడం కాదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. చివరకు ఎంపికలో ఆ ముఖ్య నేత చెప్పిన స్నేహితుడి కుమార్తే ఎంపిక కావడంతో తమ బిడ్డలకు అందం, ప్రతిభ ఉన్నా ఫలితం లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలకు సహకరించిన వారే ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం పూర్తిగా నిబంధనలకు విరుద్దమంటున్నారు. ప్రతిభ కనబరిచిన వారి పేర్లను తొలగించవద్దని న్యాయ నిర్ణేతల్లో ఒకరు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. అందం, ప్రతిభ ఆధారంగా రూపొందిన జాబితా తారుమారైపోయిందని, న్యాయనిర్ణేతల్లో ఒకరు మిస్కాకినాడ ఎంపిక తరువాత కొందరు తల్లిదండ్రులకు పంపిన మొబైల్ మెసేజ్‌లు నగరంలో హల్చల్ చేశాయి. చివరకు టాలెంట్ రౌండ్లో పాల్గొనని ఒక యువతిని రెండవ రన్నరప్‌గా ఎంపిక చేయడం మరింత ఆశ్చర్యం కలిగించిందంటున్నారు. ఇటువంటి పోటీలు నిర్వహించడం స్పాన్సర్లు, యాడ్ ఏజెన్సీల నుంచి లక్షలు సమీకరించుకోవడానికా లేక, ఇప్పుడిప్పుడే మెట్రో నగరాలతో పోటీ పడుతోన్న కాకినాడ వంటి నగరాల్లో ఔత్సాహిక యువత ఆశలపై నీళ్లు చల్లడానికా అని మండిపడుతున్నారు. -
రాష్ట్ర స్థాయి ఆటలపోటీలకు వేళంగి విద్యార్థులు
వేళంగి(కరప): రాష్ట్ర స్థాయిలో జరిగే అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనేందుకు వేళంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారు. జిల్లా స్కూలుగేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల గ్రౌండ్లో అండర్–19 విభాగంలో క్రికెట్, అథ్లెటిక్స్ అంశాలలో జరిగిన ఎంపికలో తమ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ ఎస్వీవీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. అథ్లెటిక్స్ 1500 మీటర్ల రన్నింగ్ పోటీలకు కె.శ్రీనివాస్ (ద్వితీయ ఎంపీసీ), టి.తేజ, ఎం.ప్రశాంతకుమార్(ప్రథమ ఎంపీసీ)లు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారని కళాశాల పీడీ జే.రఘురాం తెలిపారు. -
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
కిర్లంపూడి : అక్టోబర్ 1 నుంచి 3 వరకు నెల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి 50వ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా జట్టును గురువారం సాయంత్రం కిర్లంపూడిలో ఎంపిక చేశారు. స్థానిక యంగ్మెన్స్ స్పోర్ట్స్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపిక కార్యక్రమంలో కిర్లంపూడికి చెందిన కేఎల్ పాపారావు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. జట్టులో పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన వై.సతీష్, పి.వెంకటేశ్వరరావు, ఆర్.గంగాధర్‌రావు, కొవ్వాడ గ్రామానికి చెందిన ఎం.కృష్ణ, తాళ్లరేవుకు చెందిన బి.సతీష్, ఏవీ శేఖర్, ఇంద్రపాలెంకు చెందిన టీకే పవన్, దివిలికి చెందిన హరీష్, నాగబాబు, ఏపీ త్రయంకు కె.సాయిరాం, విరవాడకు చెందిన ఎం.వెంకటరమణ, దివిలికి చెందిన ఆర్.శివ ఇతర సభ్యులు. జట్టుకు కోచ్‌గా బి.ఆదినారాయణ, ప్రగతి పీడీ జి.అప్పారావు వ్యవహరించనున్నారు. వారం రోజులుగా కిర్లంపూడిలో నిర్వహిస్తున్న శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమాన్ని ఉద్ధేశించి జగపతినగరం సర్పంచి పెంటకోట నాగబాబు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు నలమాటి జానకిరాయమ్మ, కార్యదర్శి కె.పట్టాభిరామ్, కోశాధికారి కె.శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ చదలవాడ బాబి తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా బ్యాడ్మింటన్ పోటీలు
ప్రీ క్వార్టర్స్ దశకు చేరిన టోర్నీ కొత్తపేట: కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్–19 షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2016లో భాగంగా రెండోరోజు గురువారం నాటి మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. మెయిన్ డ్రా ఉదయం పది గంటలకు ప్రారంభం కాగా పోటీలను ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు,జిల్లా అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బాలురు, బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. రెండో రౌండ్ విజేతలు.. గురువారం మొదటి, రెండో రౌండు మ్యాచ్‌లు ముగిసి టోర్నీ ప్రీక్వార్టర్స్ దశకు చేరింది. బాలుర విభాగంలో రెండో రౌండ్లో సాయికిరణ్(విశాఖ)పై జశ్వంత్(చిత్తూరు), జి.శ్రీనివాసరావు(విజయనగరం)పై టి. విజయ్‌కుమార్(పశ్చిమ గోదావరి), సుజిత్(కృష్ణ)పై చారి(విశాఖ), పాల్‌ప్రీత్ శిలాస్(అనంతపురం)పై శ్రీకర్(శ్రీకాకుళం), గణేష్(ప్రకాశం)పై గిరిష్‌నాయుడు(తూర్పుగోదావరి), మనోహర్ (కర్నూలు)పై దత్తాత్రేయరెడ్డి(కడప), అమన్గౌడ్(తూర్పుగోదావరి)పై సాయికిషోర్(పశ్చిమగోదావరి), ప్రశాంత్‌కుమార్(పశ్చిమగోదావరి)పై చంద్రాజ్పట్నాయక్(విశాఖ), కార్తీక్(కృష్ణ)పై శివసుందర్సాయి(చిత్తూరు), సాయిదత్తా(శ్రీకాకుళం)పై రోహిత్‌కుమార్(విశాఖ), వరప్రసాద్(విజయనగరం)పై ప్రణయ్(విశాఖ), రాహుల్(కర్నూలు)పై రాయుడు(తూర్పుగోదావరి), శ్రీకర్(అనంతపురం)పై డి.శరత్(గుంటూరు), యశ్వంత్(విశాఖ)పై వేదవ్యాస్సాయి(ప్రకాశం) గెలుపొంది ప్రీక్వార్టర్స్‌కు చేరారు. బాలికల విభాగంలో జయశ్రీ(ప్రకాశం)పై మేఘన(పశ్చిమ గోదావరి), దీక్షితారాణి(అనంతపురం)పై నివేదిత(విశాఖ), షర్మిలా(కృష్ణా)పై వెన్నెల(తూర్పుగోదావరి), యామినిశ్రీ(శ్రీకాకుళం)పై వెన్నెల(కడప), మల్లిక(కృష్ణా)పై షన్విత(తూర్పుగోదావరి), హర్షిణి(పశ్చిమగోదావరి)పై బాలభువనేశ్వరి(విజయనగరం), పద్మజ(కృష్ణా)పై లక్ష్మి(విశాఖ) అంజలి(ప్రకాశం)పై నవ్యస్వరూప(తూర్పుగోదావరి), కాశీబాయ్(చిత్తూరు)పై సంజన(పశ్చిమగోదావరి), శ్రీలత(కడప)పై ^è రిష్మా(పశ్చిమగోదావరి), తేజా(తూర్పుగోదావరి)పై అసియా(కర్నూలు), సుష్మ(శ్రీకాకుళంపై)పై శ్వేత(అనంతపురం) గెలుపొంది ప్రీక్వార్టర్స్‌కు చే రారని ఛీప్ రిఫరీ ఎస్.సూరిబాబు, డిప్యూటీ రిఫరీ బి.పాపయ్యశాస్త్రి, మ్యాచ్ కంట్రోలర్ కె.రమేష్ తెలిపారు. స్టేట్, నేషనల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు స్టేట్, నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొంటూ ఖ్యాతి తీసుకువస్తున్నారు. క్రికెట్ తరువాత షటిల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్తపేటలో అండర్–19 సెలక్షన్స్ చక్కగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి పున్నయ్యచౌదరి కృషి ఎంతగానో ఉంది. –కాశీ విశ్వనాథ్, ఏపీబీఏ అంపైర్ ఆరోగ్యానికి దోహదపడే క్రీడ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడను ఎక్కువ మంది ఆరోగ్యపరంగా ఎంచుకుని ఆడుతున్నారు. ప్రభుత్వం పట్టణ, పలు గ్రామీణ ప్రాంతాల్లో స్టేడియంలను అందుబాటులోకి తీసుకువస్తే మరింత మంది దేశానికి పేరుతెచ్చే క్రీడాకారులు తయారవుతారు. ఖరీౖదైన ఈ క్రీడ ప్రధానంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు వెళుతుంది. –భద్రం, ఏపీబీఏ సీనియర్కోచ్ అంతర్జాతీయస్థాయిలో ఆడడమే లక్ష్యం షటిల్ బ్యాడ్మింటన్‌లో ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా రాణించాలన్నదే నా లక్ష్యం. షటిల్ ఎంజాయ్మెంట్ గేమ్. కాన్ఫిడెంట్‌గా ఆడవచ్చు. జైపూర్‌లో జరిగిన అండర్–17 నేషనల్స్ ఆడాను. ఇక్కడ పోటీల ప్రారంభం కార్యక్రమం ఎంతో అందంగా జరిగింది. సౌకర్యాలు, మర్యాదలు చాలా బాగున్నాయి. – పి.నిషిత, విశాఖ శ్రీకాంత్ నాకు స్ఫూర్తి షటిల్ బ్యాడ్మింటన్ ఇండియా నెంబర్ వన్ ప్లేయర్ శ్రీకాంత్ నాకు స్ఫూర్తి. కోచ్ సుధాకరరెడ్డి శిక్షణలో రాణిస్తున్నాను. గతేడాది అండర్–19 సౌత్ జోన్లో గోల్డ్‌మెడల్ సాధించాను. ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాను. ఇక్కడ సౌకర్యాలు ఎంతో బాగున్నాయి. – ఎ.వేదవ్యాస్, ప్రకాశం జిల్లా -
16న జాతీయ బృందగాన పోటీలు
కాకినాడ రూరల్ : భారత్ వికాస్ పరిషత్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ బృందగాన పోటీలను కాకినాడ మున్సిపల్ కార్యాలయం వద్దనున్న గాంధీభవన్‌లో అక్టోబర్ 16న నిర్వహిస్తున్నట్టు పరిషత్ కాకినాడ శాఖ అధ్యక్షుడు గళ్లా సుబ్బారావు వివరించారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పోటీలు హిందీ, సంస్కృతంలో ఉంటాయని, భారత్ వికాస్ పరిషత్ వారి చేతనా కే స్వర్ పుస్తకంలో గల పాటలనే పాడాల్సి ఉంటుందన్నారు. 6 నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు అర్హులని వివరించారు. చేతనా కె స్వర్ పాట లింక్స్‌ను డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ బీవీపీ ఇండియా డాట్ కమ్ నుంచి పొందవచ్చని చెప్పారు. అక్టోబర్ 14లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. -
నేటి నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
సిద్ధమైన కొత్తపేట ఇండోర్ షటిల్ స్టేడియం కొత్తపేట : రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్–19 బాలురు, బాలికల చాంపియన్ షిప్ 2016 పోటీలకు కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియం సిద్ధమైంది. బుధవారం నుంచి శనివారం వరకూ నాలుగు రోజుల పాటు ఈ పోటీల నిర్వహణకు కొత్తపేట కాస్మొపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ (సీఆర్ఎస్)–జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియన్ సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది. పోటీల వివరాలను మంగళవారం సీఆర్ఎస్ ఫౌండర్ అండ్ చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్ఎస్), జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి విలేకర్లకు వివరించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో రావులపాలెం సీఆర్సీ–కొత్తపేట సీఆర్ఎస్ సంయుక్తంగా రెండు ఇండోర్ స్టేడియంలలో జాతీయ షటిల్ పోటీలు నిర్వహిస్తామని ఆర్ఎస్ తెలిపారు. తేతలి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచి సింగిల్– 2, డబుల్ 1 చొప్పున బాలురు, బాలికలు టీమ్‌లు రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ఆరు చొప్పున పాల్గొంటాయని, తొలిరోజు క్వాలిఫై టీములు ఆడతాయన్నారు. మలి రోజు నుంచి 20 మ్యాచ్‌లు, ఆఖరి రోజు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయన్నారు. విజేతలు త్వరలో జరిగే సౌత్ జోన్, నేషనల్స్‌కు వెళతారని తెలిపారు. -
జిల్లాస్థాయికి ఎంపికైన క్రీడాకారులు
జగిత్యాల రూరల్ : ఇటీవల జరిగిన జోనల్‌స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన మండలంలోని పొలాస జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు లోకేశ్, శివకుమార్, వెంకటేశ్‌లను శనివారం అభినందించారు. క్రికెట్లో లోకేశ్, కబడ్డీలో శివకుమార్, వెంకటేశ్ ఎంపికయ్యారు. వీరిని సర్పంచ్ చిర్ర నరేశ్, ఎంపీటీసీ గాజంగి భారతి, రాజన్న, పీఈటీ దత్తాత్రి అభినందించారు. -
24 నుంచి రాష్ట్రస్థాయి నాటక పోటీలు
కాకినాడ కల్చరల్ : స్థానిక సూర్య కళామందిర్లో ఈ నెల 24 నుంచి 27 వరకూ పంతం పద్మనాభం మెమోరియల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన 17వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు నిర్వహించనున్నారు. పంతం పద్మనాభం స్మారక నాటక పరిషత్ వేదికపై ఈ పోటీలు జరుగుతాయి. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయి. 24వ తేదీన శుభారంభ సభతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం కళాంజలి (హైదరాబాద్) ఆధ్వర్యాన కొల్లా రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జగమే మాయ’ నాటకం ప్రదర్శిస్తారు. 25వ తేదీన మహేశ్వరి ప్రసాద్ యంగ్ థియేటర్ ఆధ్వర్యాన ఆర్.వాసుదేవరావు దర్శకత్వంలో ‘అశ్శరభ శరభ’ నాటకం ప్రదర్శిస్తారు. అనంతరం ఒంగోలు భానూదయ ఆధ్వర్యాన వెంకట్ కందుల దర్శకత్వంలో ‘జగమంతా కుటుంబం’ నాటకం ప్రదర్శిస్తారు. 26వ తేదీన మారుతీ క్రియేషన్స్ (హైదరాబాద్) ఆధ్వర్యాన సుబ్బరాయవర్మ దర్శకత్వంలో ‘మిస్టరీ’ నాటకం ప్రదర్శిస్తారు. అనంతరం కేవీ మెమోరియల్ ఆర్ట్స్ (విశాఖపట్నం) ఆధ్వర్యాన పి.శివప్రసాద్ దర్శకత్వంలో ‘మీ వెంటే మేం ఉంటాం’ నాటకం ప్రదర్శిస్తారు. 27వ తేదీన అమరావతి ఆర్ట్స్ (గుంటూరు) ఆధ్వర్యాన కావూరి సత్యనారాయణ దర్శకత్వంలో ‘జీవితార్థం’ నాటకం ప్రదర్శిస్తారు. తరువాత శ్రీఅరవింద్ ఆర్ట్స్(తాడేపల్లి) ఆధ్వర్యాన ‘రంకె’ నాటిక ప్రదర్శిస్తారు. ఈ నాటిక 2015 నంది నాటకోత్సవంలో అవార్డు పొందినదని నిర్వాహకులు తెలిపారు. -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఇద్దరి ఎంపిక
మామిడికుదురు : అండర్–19 రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు మామిడికుదురు నవయువ క్రీడా యువజన సేవా సంఘంలో శిక్షణ పొందుతున్న ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్ బొంతు మధుకుమార్ గురువారం తెలిపారు. రామచంద్రపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం జరిగిన సెలక్షన్స్‌లో వీరి ఎంపిక జరిగిందన్నారు. 54–57 కిలోల విభాగంలో పి.జ్యోతి, 51–54 కిలోల విభాగంలో కె.సాయిపవన్ ఎంపికయ్యారని చెప్పారు. జ్యోతి పి.గన్నవరం సిద్ధార్థ జూనియర్ కళాశాలలో, సాయిపవన్ పేరూరు శ్రీవంశీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారని చెప్పారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఈ విద్యార్థులకు బాక్సింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని మధుకుమార్ చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వై.తాతబ్బాయి, కోచ్ మధుకుమార్, తదితరులు అభినందించారు. -
హిందీ దివస్ జిల్లాస్థాయి పోటీలు
కాకినాడ కల్చరల్ : హిందీ దివస్ పురస్కరించుకొని రాషీ్ట్రయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ‘హిందీ దివస్’ అంశంపై జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించారు. అ««ధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు. న్యాయనిర్ణేతలుగా పరిషత్ అధ్యక్షుడు దాడి చంద్రశేఖర్, కార్యదర్శి ఏఏవీఎస్ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కె.రాధాకృష్ణ, పరిషత్ మహిళా కార్యదర్శి ఎ.స్వర్ణమంజుల, గౌరవ అధ్యక్షుడు వి.పళ్లంరాజు వ్యహరించారు. వ్యాస రచన పోటీలలో సీనియర్ విభాగంలో ఎన్.ప్రశాంత్( జెడ్పీ పాఠశాల, గైగోలుపాడు), జూనియర్ విభాగంలో ఆర్.బిందు (మార్గదర్శి హైస్కూల్, తాళ్లరేవు), వక్తృత్వపోటీలలో ఎం.అనూష ( పగడాలపేట మున్సిపల్ ఉన్నతపాఠశాల, కాకినాడ) విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని న్యాయనిర్ణేతలు తెలిపారు. వీరు హిందీ దివస్ (సెప్టెంబర్14) నాడు ఏలూరులోని యంగ్‌మెన్ హిందూ అసోసియేసన్లో జరిగే రాష్ట్రాస్థాయి పోటీల్లో పాల్గొంటారని పరిషత్ అధ్యక్షుడు దాడి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా ప్రతాలు, బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట సత్యం, హిందీ సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. -
హెల్త్ వర్సిటీ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
22 కళాశాలల నుంచి హాజరైన 200 మంది విద్యార్థులు తొలిరోజులు ఉత్సాహభరితంగా పలు పోటీలు కాకినాడ సిటీ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉభయ తెలుగు రాష్ట్రాల మెడికల్, డెంటల్ కాలేజీల విద్యార్థుల అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు 14 ఈవెంట్లలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 22 మెడికల్, డెంటల్ కళాశాలల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు 100, 400, 1500 మీటర్ల పరుగు, 4“100 మీటర్ల రిలే, లాంగ్ జంప్, షాట్‌పుట్ విభాగాల్లో విద్యార్థినీ విద్యార్థులకు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తొలుత ప్రారంభోత్సవంలో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించారు. ఇతర ప్రముఖులతో కలిసి పోటీల ప్రారంభసూచికగా బెలూన్లను ఎగురవేశారు. అనంతరం కళాశాలల వారీగా విద్యార్థులు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న మహలక్ష్మి మాట్లాడుతూ మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. పోటీల ద్వారా విద్యార్థులు క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలని కోరారు. అంతర్రాష్ట్ర హెల్త్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ పోటీలను రంగరాయ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ఫిజికల్ డైరెక్టర్లను అభినందించారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజులు, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ త్రిమూర్తులు, ‘రామ్‌కోశా’ కార్యదర్శి డాక్టర్ ఆనంద్, ఆర్ఎంసీ పీడీ స్పర్జన్‌రాజు, వివిధ కళాశాలల పీడీలు పాల్గొన్నారు. -
తైక్వాండో పోటీల్లో జిల్లాకు 10 పతకాలు
కాకినాడ సిటీ : విజయనగరం జిల్లాలో ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగిన తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు 10 మెడల్స్ వచ్చాయి. క్యాడెట్, జూనియర్ స్థాయిల్లో 28 కేటగిరీల్లో క్రీడాకారులు రెండు గోల్డ్, రెండు సిల్వర్, ఆరు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. శుక్రవారం జిల్లా క్రీడామైదానంలో జరిగిన కార్యక్రమంలో డీఎస్డీఓ మురళీధరరావు క్రీడాకారులను అభినందించారు. 55 కిలోల వెయిట్లో యు.సుష్మా, 68 కిలోల వెయిట్లో జి.మేరీగోల్డ్.. గోల్డ్ మెడల్స్ పొంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే 63 కిలోల్లో ఎస్ఎంవీవీ సాయి, 78 కిలోల్లో ఎం.భానుప్రసాద్ సిల్వర్ మెడల్స్, 63 కిలోల్లో పళ్ల శ్రీసత్య ఆకాంక్ష, 59 కిలోల్లో కె.రేష్మా, 57 కిలోల్లో ఎల్జీఈ నితిన్, 55 కిలోల్లో వి.తరుణ్ వరప్రసాద్, 37 కిలోల్లో టి.చరణ్, 29 కిలోల్లో పి.భార్గవీశ్రీకళ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. జాతీయ స్థాయికి ఎంపికైన వారికి ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో జరిగే తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి బి.అర్జున్‌రావు తెలిపారు. -
క్రీడలకు విశేష ప్రాధాన్యం
ఎల్ఐసీ హెచ్ఆర్డీ ఆర్ఎం నరసింహారావు సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్, చెస్ టోర్నీ ప్రారంభం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సౌత్ సెంట్రల్ జోన్ రీజనల్ మేనేజరు(హెచ్ఆర్డీ) కెవీపీవీ నరసింహారావు పేర్కొన్నారు. తమ సంస్థలో పనిచేస్తున్న క్రీడాకారులు జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయి పోటీలలో రాణించి పతకాలు సాధిస్తున్నారన్నారు. సోమవారం స్థానిక జేఎన్ రోడ్‌లోని సూర్య గార్డెన్స్‌లో సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం రోజున టోర్నమెంటును నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్యారమ్స్ క్రీడాకారిణి అపూర్వ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలకు దేశం తరఫున ఎంపికైందని తెలిపారు. ఎల్ఐసీలో పనిచేస్తున్న క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకరిస్తూ పూర్తి సహాయసహాకారాలు అందిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ జె.రంగారావు అపూర్వను పూలబొకే, శాలువాతో సత్కరించారు. అనంతరం క్యారమ్స్, చెస్ పోటీలను నరసింహారావు, రంగారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజరు ఈఏ విశ్వరూప్, మేనేజర్(పీఆర్) నాగేంద్రకుమార్, స్పోర్ట్స్ ప్రమోషన్‌బోర్డు సభ్యులు జాన్సన్, మంజునాథ్, ఎన్బీ మేనేజర్ అహ్మద్ ఆలీషా, చెస్ చీఫ్ ఆర్బిటర్ జీవీ కుమార్, క్యారమ్స్ చీఫ్ రిఫరీ ఎస్కే అస్మదుల్లా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు, ఎల్ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు. తొలి రోజు పోటీల ఫలితాలు క్యారమ్స్ పురుషుల విభాగంలో 18 మంది,మహిళల విభాగంలో 18మంది పోటీపడ్డారు. తొలిరోజు పోటీలు క్వార్టర్ ఫైనల్స్ వరకూ జరిగాయి. పురుషుల విభాగంలో కె.బాలగురవయ్య(బెంగళూరు)–డి.వీరలింగం(దర్బాన్), కె.రఘునాథరావు(హైదరాబాద్)–జగన్నాథరావు(విశాఖపట్నం) , మహిళల విభాగంలో ఎస్.అమలాదేవి(బెంగళూరు)–ఎస్.అపూర్వ(హైదరాబాద్), పి.నిర్మల(వరంగల్)–వీకే కేగివల్లి(దర్బన్) సెమీ ఫైనల్స్‌లో తలపడనున్నారని చీఫ్ రిఫరీ ఎస్కే అస్మదుల్లా తెలిపారు. చెస్ పురుషుల విభాగంలో 18మంది, మహిళల విభాగంలో 18మంది పోటీపడ్డారు. ఆరు రౌండ్ల పోటీల్లో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి పురుషుల విభాగంలో కె.నారాయణభట్(షియోగా) మూడుకు మూడు పాయింట్లు, రవిప్రకాష్(మైసూరు) మూడుకి 2.5పాయింట్లు, మహిళల విభాగంలో రాధాకుమారి(రాజమహేంద్రవరం) మూడుకి మూడు పాయింట్లు, రాధికాదేవి(మచిలీపట్నం) మూడుకు మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారని చెస్ చీఫ్ ఆర్బిటర్ జి.వి.కుమార్ తెలిపారు. -
28, 29 తేదీల్లో అంతర్ జిల్లా కుస్తీ పోటీలు
కాకినాడ సిటీ : జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 3వ అంతర జిల్లా సబ్ జూనియర్ రెజ్లింగ్ (కుస్తీ) పోటీలు జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్నాయి. రెండు సంఘాల ప్రతినిధులు శుక్రవారం విలేకరులకు వివరాలు తెలిపారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన వారికి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేస్తారని, ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారు. రాష్ట్రజట్టుకి రెండు నెలలు శిక్షణనిచ్చి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చిత్తూరులో జరిగే జాతీయస్థాయి పోటీలకు పంపుతారు. అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొనేవారు 16, 17 ఏళ్ల వయసు (2000 లేదా 2001లో పుట్టినవారు) కలిగి ఉండాలి. 10 వెయిట్ కేటగిరీలలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు, 100 మంది టెక్నికల్ అధికారులు, కోచ్‌లు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరవుతారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు, కార్యదర్శి కె.పద్మనాభం, జిల్లా రెజ్లింగ్ సంఘ అధ్యక్షుడు డాక్టర్ ఎ.ఎలీషాబాబు, కార్యదర్శి పి.లక్ష్మణరావు, జిల్లా బేస్‌బాల్ సంఘం కార్యదర్శి డాక్టర్ స్పర్జన్‌రాజు, జిల్లా హాకీ సంఘం కార్యదర్శి వి.రవిరాజు పాల్గొన్నారు. -
నేడు, రేపు సాక్షి టీవీలో స్పెల్‌బీ ఫైనల్స్
సాక్షి, హైదరాబాద్: విజ్ఞాన్ యూనివర్సిటీ సహకారంతో సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ-2015’ ఫైనల్ పోటీలు శని, ఆదివారాల్లో సాక్షి టీవీలో ప్రసారం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఫైనల్స్ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, తెలంగాణకు సంబంధించిన ఫైనల్ పోటీలు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సాక్షి టీవీలో ప్రసారమవుతాయని నిర్వాహకులు వెల్లడించారు. -
బండలాగుడు పోటీలు ప్రారంభం
బేతంచర్ల : కర్నూలు జల్లా బేతంచర్ల మండలంలోని యాబై గ్రామంలో రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. చెన్నకేశవ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉత్సవాల సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను వీక్షించడానికి చుట్ట ప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సవాలకు తరలివచ్చారు. ఈ పోటీలను ఎంపీటీసీ సభ్యురాలు నాగలలితమ్మ, సర్పంచ్ వరప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ఏర్పాట్లను సమీక్షించారు.