క్రీడలకు విశేష ప్రాధాన్యం
-
ఎల్‌ఐసీ హెచ్‌ఆర్‌డీ ఆర్‌ఎం నరసింహారావు
-
సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్, చెస్ టోర్నీ ప్రారంభం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) :
భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సౌత్ సెంట్రల్ జోన్ రీజనల్ మేనేజరు(హెచ్‌ఆర్‌డీ) కెవీపీవీ నరసింహారావు పేర్కొన్నారు. తమ సంస్థలో పనిచేస్తున్న క్రీడాకారులు జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయి పోటీలలో రాణించి పతకాలు సాధిస్తున్నారన్నారు. సోమవారం స్థానిక జేఎన్ రోడ్‌లోని సూర్య గార్డెన్స్‌లో సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం రోజున టోర్నమెంటును నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్యారమ్స్ క్రీడాకారిణి అపూర్వ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు దేశం తరఫున ఎంపికైందని తెలిపారు. ఎల్‌ఐసీలో పనిచేస్తున్న క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకరిస్తూ పూర్తి సహాయసహాకారాలు అందిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ జె.రంగారావు అపూర్వను పూలబొకే, శాలువాతో సత్కరించారు. అనంతరం క్యారమ్స్, చెస్ పోటీలను నరసింహారావు, రంగారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజరు ఈఏ విశ్వరూప్, మేనేజర్(పీఆర్) నాగేంద్రకుమార్, స్పోర్ట్స్ ప్రమోషన్‌బోర్డు సభ్యులు జాన్సన్, మంజునాథ్, ఎన్‌బీ మేనేజర్ అహ్మద్ ఆలీషా, చెస్ చీఫ్ ఆర్బిటర్ జీవీ కుమార్, క్యారమ్స్ చీఫ్ రిఫరీ ఎస్‌కే అస్మదుల్లా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు, ఎల్‌ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
తొలి రోజు పోటీల ఫలితాలు
క్యారమ్స్ పురుషుల విభాగంలో 18 మంది,మహిళల విభాగంలో 18మంది పోటీపడ్డారు. తొలిరోజు పోటీలు క్వార్టర్ ఫైనల్స్ వరకూ జరిగాయి. పురుషుల విభాగంలో కె.బాలగురవయ్య(బెంగళూరు)–డి.వీరలింగం(దర్బాన్), కె.రఘునాథరావు(హైదరాబాద్)–జగన్నాథరావు(విశాఖపట్నం) , మహిళల విభాగంలో ఎస్.అమలాదేవి(బెంగళూరు)–ఎస్.అపూర్వ(హైదరాబాద్), పి.నిర్మల(వరంగల్)–వీకే కేగివల్లి(దర్బన్) సెమీ ఫైనల్స్‌లో తలపడనున్నారని చీఫ్ రిఫరీ ఎస్‌కే అస్మదుల్లా తెలిపారు. చెస్ పురుషుల విభాగంలో 18మంది, మహిళల విభాగంలో 18మంది పోటీపడ్డారు. ఆరు రౌండ్ల పోటీల్లో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి పురుషుల విభాగంలో కె.నారాయణభట్(షియోగా) మూడుకు మూడు పాయింట్లు, రవిప్రకాష్(మైసూరు) మూడుకి 2.5పాయింట్లు, మహిళల విభాగంలో రాధాకుమారి(రాజమహేంద్రవరం) మూడుకి మూడు పాయింట్లు, రాధికాదేవి(మచిలీపట్నం) మూడుకు మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారని చెస్ చీఫ్ ఆర్బిటర్ జి.వి.కుమార్ తెలిపారు.