28, 29 తేదీల్లో అంతర్ జిల్లా కుస్తీ పోటీలు
Published Fri, Aug 26 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
కాకినాడ సిటీ :
జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 3వ అంతర జిల్లా సబ్ జూనియర్ రెజ్లింగ్ (కుస్తీ) పోటీలు జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్నాయి. రెండు సంఘాల ప్రతినిధులు శుక్రవారం విలేకరులకు వివరాలు తెలిపారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన వారికి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేస్తారని, ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారు. రాష్ట్రజట్టుకి రెండు నెలలు శిక్షణనిచ్చి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చిత్తూరులో జరిగే జాతీయస్థాయి పోటీలకు పంపుతారు. అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొనేవారు 16, 17 ఏళ్ల వయసు (2000 లేదా 2001లో పుట్టినవారు) కలిగి ఉండాలి. 10 వెయిట్ కేటగిరీలలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు, 100 మంది టెక్నికల్ అధికారులు, కోచ్‌లు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరవుతారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు, కార్యదర్శి కె.పద్మనాభం, జిల్లా రెజ్లింగ్ సంఘ అధ్యక్షుడు డాక్టర్ ఎ.ఎలీషాబాబు, కార్యదర్శి పి.లక్ష్మణరావు, జిల్లా బేస్‌బాల్ సంఘం కార్యదర్శి డాక్టర్ స్పర్జన్‌రాజు, జిల్లా హాకీ సంఘం కార్యదర్శి వి.రవిరాజు పాల్గొన్నారు.
Advertisement