inter district
-
అంతర్ జిల్లా దొంగలు అరెస్టు
13 సెల్ఫోన్లు స్వాధీనం కర్నూలు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సెల్ఫోన్లను దొంగలించి తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్‌కు చెందిన డమ్మి రవి, హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అసద్లను.. కర్నూలులోని బళ్లారి చౌరస్తా.. హైదరాబాద్ బస్టాప్ వద్ద సీసీఎస్ పోలీసులు అనుమానంపై అదుపులోకి తీసుకొని విచారించగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడినట్లు బయటపడింది. గతేడాది నవంబరు నెలలో నందికొట్కూరులోని సెల్ దుకాణంలో 13 సెల్ఫోన్లు చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరుచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. సీసీఎస్ సీఐ లక్ష్మయ్య, ఎస్ఐ నయాబ్ రసూల్, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ సాహెబ్, కానిస్టేబుళ్లు సుదర్శనం, కిషోర్, సమీర్, నాగరాజు, రవికుమార్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు ప్రారంభం
ఆచంట : స్థానిక ఎంవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం అంతర్ జిల్లాల అండర్–19 కబడ్డీ పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరి చయం చేసుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన బాలుర, బాలికల జట్లు పోటీలకు తరలివచ్చారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్‌లో కబడ్డీని చేర్చాలి రాష్ట్రంలోనూ, దేశంలోనూ కబడ్డీకి విశేష ఆదరణ ఉందని ఒలింపిక్స్‌లో చేరిస్తే భారత జట్టు తప్పక బంగారు పతకం సాధిస్తుందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. కబడ్డీ పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను మరింత ప్రోత్సహిస్తుందని, బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తానని చెప్పారు. చదువుతో పాటు క్రీడలూ ప్రధానమని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. కళాశాలలో ప్రహరీ నిర్మాణానికి, మైదానం చదును చేసేందుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర పరిశీలకులు కేవీ శేషగిరిరావు, బి.రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాలరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు ఆదిరెడ్డి సత్యనారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐజాక్, కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరావు, సర్పంచ్ బీరా తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆయా జిల్లాల కోచ్‌లు, పీడీలు పోటీలను పర్యవేక్షించారు. -
28, 29 తేదీల్లో అంతర్ జిల్లా కుస్తీ పోటీలు
కాకినాడ సిటీ : జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 3వ అంతర జిల్లా సబ్ జూనియర్ రెజ్లింగ్ (కుస్తీ) పోటీలు జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్నాయి. రెండు సంఘాల ప్రతినిధులు శుక్రవారం విలేకరులకు వివరాలు తెలిపారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన వారికి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేస్తారని, ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారు. రాష్ట్రజట్టుకి రెండు నెలలు శిక్షణనిచ్చి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చిత్తూరులో జరిగే జాతీయస్థాయి పోటీలకు పంపుతారు. అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొనేవారు 16, 17 ఏళ్ల వయసు (2000 లేదా 2001లో పుట్టినవారు) కలిగి ఉండాలి. 10 వెయిట్ కేటగిరీలలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు, 100 మంది టెక్నికల్ అధికారులు, కోచ్‌లు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరవుతారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు, కార్యదర్శి కె.పద్మనాభం, జిల్లా రెజ్లింగ్ సంఘ అధ్యక్షుడు డాక్టర్ ఎ.ఎలీషాబాబు, కార్యదర్శి పి.లక్ష్మణరావు, జిల్లా బేస్‌బాల్ సంఘం కార్యదర్శి డాక్టర్ స్పర్జన్‌రాజు, జిల్లా హాకీ సంఘం కార్యదర్శి వి.రవిరాజు పాల్గొన్నారు. -
క్రికెట్ పోటీలు ప్రారంభం
వెంకటగిరి: పట్టణంలోని తారకరామా క్రీడాప్రాంగణంలో అండర్ –19 అంతర జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యాచ్‌లు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కృష్ణా, కర్నూలు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల మధ్యన పది రోజుల పాటు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలు త్రీడే మ్యాచ్‌లుగా ఉంటాయని వివరించారు. హోరాహోరీగా పోటీలు అండర్ –19 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నారు. తొలుత కర్నూలు–తూర్పుగోదావరి జట్ల మధ్యన పోటీ మొదలవగా కర్నూలు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 39.3 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. కర్నూలు జిల్లా జట్టు క్రీడాకారుడు యాదేష్ అత్యధికంగా 101 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తూర్పుగోదావరి జట్టు ఆటముగిసే సమయానికి 48 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అలాగే కృష్ణా–ప్రకాశం జట్ల మధ్యన జరిగిన పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కృష్ణా జట్టు 68 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కౌశిక్ అత్యధికంగా 64 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం జిల్లా జట్టు ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. గురువారం మ్యాచ్‌లను కొనసాగించనున్నారు. -
అంతర్జిల్లా దొంగ అరెస్టు
కర్నూలు: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న అంతర్ జిల్లా దొంగ ఉప్పరిగణ అలియాస్ ప్రవీణ్‌కుమార్‌ను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 తులాల బంగారు నగలు, రూ.3,500 నగదు రికవరీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కోనేరు బుక్కాపురం గ్రామానికి చెందిన ఇతను జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. తాళాలు వేసిన ఇళ్లను ఎంపిక చేసుకొని రెక్కి నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నాయి. కొత్తబస్టాండుకు ఎదురుగా ఉన్న స్వీట్స్ స్టాల్ దగ్గర ఉన్నట్లు సమాచారం అందడంతో నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేసి సీఐ నాగరాజు రావు ఎదుట హాజరు పరిచారు. నేరాల చిట్టా: – 2015 ఫిబ్రవరి 25న కర్నూలు శివారుల్లోని రాజీవ్‌గహకల్పకు ఎదురుగా ఉన్న ఇందిరమ్మ గహాల్లో నివాసం ఉంటున్న షేక్‌అహ్మద్ బీ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. – 2016 మార్చి 13న ఉల్చాల రోడ్డులోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్న మునెప్ప ఇంట్లోకి చొరబడి బంగారు నగలు చోరీ చేశాడు. – 2016 మే 10న అబ్బాస్‌నగర్‌లోని వరలక్ష్మి ఇంట్లో రాత్రి దొంగతనానికి పాల్పడ్డాడు. – 2016 జూన్ 23న ఉల్చాల రోడ్డులోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్న కరుణాకర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్టు
పెనమలూరు, న్యూస్‌లైన్ : పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను పెనమలూరు పోలీ సులు మంగళవారం కానూరులో అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.7లక్షల విలువైన వస్తువులను స్వాధీనపర్చుకున్నారు. కానూరులోని ఏసీపీ తూర్పు డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరు సమావేశంలో డీసీపీ ఎం.రవిప్రకాష్ వివరాలు వెల్లడించారు. గుం టూరులోని ఆనంద్‌పేటకు చెందిన షేక్అమీర్బాషా అలియాస్ షేక్జమీర్బాషా, కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తన సహచరులతో కలిసి అనేక దొంగతనాలు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. విజయవాడ, గుం టూరు, తెనాలి, రాజమండ్రి, ఏలూరు, గుడివాడలో 20కి పైగా చోరీలకు పాల్పడ్డాడు. ఏడు బైకులు, తొమ్మిది బంగారు గొలుసులు తస్కరించాడు. పలు ఇళ్లల్లో చొరబడి విలువైన వస్తువులు, నగదు దోచుకున్నాడు. ప్రస్తుతం కానూరులోని సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. గుంటూరులో ఉన్నప్పటినుంచే నేరాలు.. బాషా గతంలో గుంటూరులో పూల వ్యాపారం చేసేవాడు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. అతడి స్నేహితులు పఠాన్బుడే, అమీర్‌బేగ్, జోహార్, జావేద్ఖాన్, ముస్తాఫాఖాన్, అబ్దుల్లాతో కలిసి గుంటూరు, లాలాపేట, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అయితే జైలు నుంచి 2010లో బయటకు వచ్చిన అమీర్ బాషా, వివాహం చేసుకుని కానూరుకు మకాం మార్చాడు. జైల్లో పరిచయమైన పాత నేరస్తులు గంజి చిన్నా, తిరుపతయ్యతో కలిసి మళ్లీ దొంగతనాలు చేయడం మొదలెట్టాడు. గంజి చిన్నా, మరో పాత నేరస్తుడు ముస్తాఫాఖాన్లను మూడు నెలల క్రితం పటమట పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం జావేద్ఖాన్, నయీమ్‌లను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతయ్యను తెనాలి పోలీ సులు ఇటీవల అరెస్టు చేశారు. అమీర్‌బాషా కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు సనత్‌నగర్‌లో పట్టుబడ్డాడు. నిం దితుడి నుంచి నాలుగు బైక్‌లు, 104 గ్రాముల బంగారు అభరణాలు, రూ.17 వేల నగదు, రెండు ఎల్సీడీలు, ఒక డీవీడీ ప్లేయర్, వెండి నగలతోపాటు రాజమండ్రి గౌరీపట్నం వద్ద కొన్న ఇంటి స్థలం దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. బాషా మారు పేరుతో రాజమండ్రి లో ఆధార్ కార్డు కూడా పొందాడని చెప్పారు. తూర్పు డివిజన్ సిబ్బందికి అభినందన కొద్ది కాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న కరుడు కట్టిన నేరగాళ్లను తూర్పు డివిజన్ పరిధిలో పని చేస్తున్న సిబ్బంది చాకచక్యంగా పట్టు కోవ డాన్ని డీసీపీ అభినందించారు. ముఖ్యంగా పెనమలూరు పోలీసుల పనితీరుపట్ల ఆనందం వ్యక్తం చేశారు. సమావేశంలో తూర్పుడివిజన్ ఏసీపీ షకీలాబాను, సీఐలు ధర్మేంద్ర, ఉమర్, ఎస్.ఐలు సత్యసుధాకర్, కిషోర్, ప్రసాద్, ప్రకాష్ పాల్గొన్నారు.