అంతర్ జిల్లా దొంగ అరెస్టు
Published Wed, Oct 2 2013 1:54 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
పెనమలూరు, న్యూస్‌లైన్ : పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను పెనమలూరు పోలీ సులు మంగళవారం కానూరులో అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.7లక్షల విలువైన వస్తువులను స్వాధీనపర్చుకున్నారు. కానూరులోని ఏసీపీ తూర్పు డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరు సమావేశంలో డీసీపీ ఎం.రవిప్రకాష్ వివరాలు వెల్లడించారు. గుం టూరులోని ఆనంద్‌పేటకు చెందిన షేక్‌అమీర్‌బాషా అలియాస్ షేక్‌జమీర్‌బాషా, కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తన సహచరులతో కలిసి అనేక దొంగతనాలు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. విజయవాడ, గుం టూరు, తెనాలి, రాజమండ్రి, ఏలూరు, గుడివాడలో 20కి పైగా చోరీలకు పాల్పడ్డాడు. ఏడు బైకులు, తొమ్మిది బంగారు గొలుసులు తస్కరించాడు. పలు ఇళ్లల్లో చొరబడి విలువైన వస్తువులు, నగదు దోచుకున్నాడు. ప్రస్తుతం కానూరులోని సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.
గుంటూరులో ఉన్నప్పటినుంచే నేరాలు..
బాషా గతంలో గుంటూరులో పూల వ్యాపారం చేసేవాడు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. అతడి స్నేహితులు పఠాన్‌బుడే, అమీర్‌బేగ్, జోహార్, జావేద్‌ఖాన్, ముస్తాఫాఖాన్, అబ్దుల్లాతో కలిసి గుంటూరు, లాలాపేట, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అయితే జైలు నుంచి 2010లో బయటకు వచ్చిన అమీర్ బాషా, వివాహం చేసుకుని కానూరుకు మకాం మార్చాడు. జైల్లో పరిచయమైన పాత నేరస్తులు గంజి చిన్నా, తిరుపతయ్యతో కలిసి మళ్లీ దొంగతనాలు చేయడం మొదలెట్టాడు. గంజి చిన్నా, మరో పాత నేరస్తుడు ముస్తాఫాఖాన్‌లను మూడు నెలల క్రితం పటమట పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం జావేద్‌ఖాన్, నయీమ్‌లను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతయ్యను తెనాలి పోలీ సులు ఇటీవల అరెస్టు చేశారు. అమీర్‌బాషా కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు సనత్‌నగర్‌లో పట్టుబడ్డాడు. నిం దితుడి నుంచి నాలుగు బైక్‌లు, 104 గ్రాముల బంగారు అభరణాలు, రూ.17 వేల నగదు, రెండు ఎల్‌సీడీలు, ఒక డీవీడీ ప్లేయర్, వెండి నగలతోపాటు రాజమండ్రి గౌరీపట్నం వద్ద కొన్న ఇంటి స్థలం దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. బాషా మారు పేరుతో రాజమండ్రి లో ఆధార్ కార్డు కూడా పొందాడని చెప్పారు.
తూర్పు డివిజన్ సిబ్బందికి అభినందన
కొద్ది కాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న కరుడు కట్టిన నేరగాళ్లను తూర్పు డివిజన్ పరిధిలో పని చేస్తున్న సిబ్బంది చాకచక్యంగా పట్టు కోవ డాన్ని డీసీపీ అభినందించారు. ముఖ్యంగా పెనమలూరు పోలీసుల పనితీరుపట్ల ఆనందం వ్యక్తం చేశారు. సమావేశంలో తూర్పుడివిజన్ ఏసీపీ షకీలాబాను, సీఐలు ధర్మేంద్ర, ఉమర్, ఎస్.ఐలు సత్యసుధాకర్, కిషోర్, ప్రసాద్, ప్రకాష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement