అంతర్ జిల్లా దొంగలు అరెస్టు
13 సెల్‌ఫోన్లు స్వాధీనం
కర్నూలు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లను దొంగలించి తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్‌కు చెందిన డమ్మి రవి, హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అసద్‌లను.. కర్నూలులోని బళ్లారి చౌరస్తా.. హైదరాబాద్ బస్టాప్ వద్ద సీసీఎస్ పోలీసులు అనుమానంపై అదుపులోకి తీసుకొని విచారించగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడినట్లు బయటపడింది. గతేడాది నవంబరు నెలలో నందికొట్కూరులోని సెల్ దుకాణంలో 13 సెల్‌ఫోన్లు చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరుచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. సీసీఎస్ సీఐ లక్ష్మయ్య, ఎస్‌ఐ నయాబ్ రసూల్, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ సాహెబ్, కానిస్టేబుళ్లు సుదర్శనం, కిషోర్, సమీర్, నాగరాజు, రవికుమార్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.