క్రికెట్ పోటీలు ప్రారంభం
వెంకటగిరి: పట్టణంలోని తారకరామా క్రీడాప్రాంగణంలో అండర్ –19 అంతర జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యాచ్‌లు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కృష్ణా, కర్నూలు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల మధ్యన పది రోజుల పాటు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలు త్రీడే మ్యాచ్‌లుగా ఉంటాయని వివరించారు.
హోరాహోరీగా పోటీలు
అండర్ –19 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నారు. తొలుత కర్నూలు–తూర్పుగోదావరి జట్ల మధ్యన పోటీ మొదలవగా కర్నూలు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 39.3 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. కర్నూలు జిల్లా జట్టు క్రీడాకారుడు యాదేష్ అత్యధికంగా 101 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తూర్పుగోదావరి జట్టు ఆటముగిసే సమయానికి 48 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అలాగే కృష్ణా–ప్రకాశం జట్ల మధ్యన జరిగిన పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కృష్ణా జట్టు 68 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కౌశిక్ అత్యధికంగా 64 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం జిల్లా జట్టు ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. గురువారం మ్యాచ్‌లను కొనసాగించనున్నారు.