ఉత్సాహంగా అండర్ 19 క్రికెట్ పోటీలు ప్రారంభం
కడప స్పోర్ట్స్ :
కడప నగరంలోని కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రీడామైదానాల్లో బుధవారం అంతర్ జిల్లాల అండర్–19 ఎలైట్ గ్రూపు క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. ఈనెల 27 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో వివిధ జిల్లాల జట్లు తలపడనున్నాయి. కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో అనంతపురం, గుంటూరు జట్ల తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 381 పరుగుల భారీస్కోరు చేసింది. జట్టులోని మహబూబ్పీరా 1 సిక్స్ర్, 14 ఫోర్లతో 109 పరుగులు చేశాడు. ఈయనకు జతగా గిరినాథరెడ్డి 81, షకీర్ 46, ఖాదర్వల్లి 44 పరుగులు చేశారు. గుంటూరు బౌలర్లు సీహెచ్ మణికంఠస్వామి 2, మహీప్కుమార్ 2, హుస్సేన్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలిరోజు ఆటముగిసింది.
కడపపై విశాఖ జట్టు ఆధిక్యం..
కేఓఆర్ఎం క్రీడామైదానంలో విశాఖపట్టణం, కడప జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన విశాఖ జట్టు 38.2 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని శరణ్తేజ 34, వంశీకష్ణ 23 పరుగులు చేశారు. కడప బౌలర్లు భరద్వాజ్ 3, హరిశంకర్రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 34 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని సాయిసుధీర్ 31, నూర్బాషా 11 పరుగులు చేశారు. విశాఖ బౌలర్లు ప్రశాంత్ 2, అజయ్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన విశాఖ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 32 పరుగులు చేసింది. జట్టులోని జోగేష్ 20, శరణ్తేజ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆటముగిసింది.