అంతర్‌జిల్లా దొంగ అరెస్టు
కర్నూలు: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న అంతర్ జిల్లా దొంగ ఉప్పరిగణ అలియాస్ ప్రవీణ్‌కుమార్‌ను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 తులాల బంగారు నగలు, రూ.3,500 నగదు రికవరీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కోనేరు బుక్కాపురం గ్రామానికి చెందిన ఇతను జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. తాళాలు వేసిన ఇళ్లను ఎంపిక చేసుకొని రెక్కి నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నాయి. కొత్తబస్టాండుకు ఎదురుగా ఉన్న స్వీట్స్ స్టాల్ దగ్గర ఉన్నట్లు సమాచారం అందడంతో నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేసి సీఐ నాగరాజు రావు ఎదుట హాజరు పరిచారు.
నేరాల చిట్టా:
– 2015 ఫిబ్రవరి 25న కర్నూలు శివారుల్లోని రాజీవ్‌గహకల్పకు ఎదురుగా ఉన్న ఇందిరమ్మ గహాల్లో నివాసం ఉంటున్న షేక్‌అహ్మద్ బీ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.
– 2016 మార్చి 13న ఉల్చాల రోడ్డులోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్న మునెప్ప ఇంట్లోకి చొరబడి బంగారు నగలు చోరీ చేశాడు.
– 2016 మే 10న అబ్బాస్‌నగర్‌లోని వరలక్ష్మి ఇంట్లో రాత్రి దొంగతనానికి పాల్పడ్డాడు.
– 2016 జూన్ 23న ఉల్చాల రోడ్డులోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్న కరుణాకర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.