theef
-
చదువుకున్న దొంగ.. చిక్కాడు ఆలస్యంగా !
గచ్చిబౌలి: ఉన్నత చదువుని మధ్యలో ఆపి.. చోరీల బాట పట్టి కటకటాలపాలయ్యాడు ఓ యువకుడు. ఏడాదిన్నరగా మాదాపూర్ జోన్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి.. ఎట్టకేలకు మియాపూర్ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు గురువారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ డాక్టర్ వినీత్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కడకెళ్ల మండలం విక్రంపురానికి చెందిన బబ్బాడి అభిలాష్(29) నాగపూర్‌లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తూ మధ్యలో ఆపేశాడు. ఈజీ మనీకి అలవాటు పడి.. విలాసవంతమైన జీవితం కోసం చోరీలు చేయాలనుకున్నాడు. ఈక్రమంలో రెండేళ్ల నుంచి కేపీహెచ్‌బీలోని హెచ్ఎంటీ హిల్స్‌లో ఉంటున్నాడు. దాదాపు 20 కేసుల్లో నిందితుడు అభిలాష్‌పై 2022వ సంవత్సరం నుంచి దాదాపు 20 కేసులు ఉన్నాయి. మియాపూర్ పీఎస్ పరిధిలో 7 చోరీలు, చందానగర్ పీఎస్ పరిధిలో 7, గచ్చిబౌలి పీఎస్ పరిధిలో 4, కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో 2 చోరీలు చేసినట్టు డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.16 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి వస్తువులు, చోరీలకు ఉపయోగించే స్టీల్ బోల్ట్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా చోరీ చేసి సొత్తును జై సింగ్ అనే వ్యక్తికి అమ్ముతున్నాడని, అతనిపైనా కేసు నమోదు చేస్తామని డీసీపీ వినీత్ తెలిపారు. రెక్కీ నిర్వహించి చోరీలు డెలివరీ బాయ్ అని చెబుతూ సెక్యూరిటీ లేని అపార్ట్మెంట్లకు వెళ్లి తాళం వేసి ఉన్న ఫ్లాట్లను పరిశీలిస్తాడు అభిలాష్. తాళం వేసి ఉన్న ఫ్లాట్, సెంట్రల్ లాక్ లేని ఇళ్లే ఇతని టార్గెట్. వెంట తెచ్చు కున్న స్టీల్ కట్టర్‌తో ఇంటికున్న తాళం తొలగించి లోపలికి దూరి తన పని పూర్తి చేస్తాడు. చోరీల కోసం గతంలో ఎర్రగడ్డలో స్టీల్ స్టోన్ కట్టర్ కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. దీని ద్వారా తాళం కట్ చేసినా పెద్దగా శబ్ధం రాదన్నారు. దాదాపు 20 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అభిలాష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ చెప్పారు. సమావేశంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ ఎన్.నర్సింహారెడ్డి, మియాపూర్ ఏసీపీ నర్సింహ్మారావు, సీఐ ప్రేమ్‌కుమార్, డీఐ కాంతారెడ్డి, డీఎస్సై మల్సూర్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘బ్యూటీ’ కి‘లేడీ’ చిక్కింది!
సాక్షి, సిటీబ్యూరో : కేవలం బ్యూటీపార్లర్లే టార్గెట్‌గా రెచ్చిపోతూ... మూడు కమిషనరేట్ల అధికారుల్నీ ముప్పుతిప్పలు పెట్టిన కి‘లేడీ’ ఎట్టకేలకు చిక్కింది. నాలుగు నెలల్లో 25కు పైగా నేరాలు చేసిన ఈ ‘చెన్నై చంద్రాన్ని’ నార్త్‌జోన్ పరిధిలోని మారేడ్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్న పోలీసులు ఈ వ్యవహారాల్లో ఆమె భర్త పాత్రను ఆరా తీస్తున్నారు. ఈమె తమిళనాడులోనూ అనేక నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన డేసీ తండ్రి కొన్నేళ్ల క్రితం తమిళనాడుకు వలస వెళ్లి చెన్నైలో స్థిరపడ్డాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తన కుమార్తె డేసీని అదే తరహా కుటుంబానికి చెందిన వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం చేశాడు. జల్సాలకు అలవాటుపడిన డేసీ తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలను అన్వేషించింది. ఈ నేపథ్యంలోనే బ్యూటీపార్లర్స్‌ను టార్గెట్‌గా చేసుకుంటే తేలిగ్గా చోరీలు చేయవచ్చని నిర్ణయించుకుంది. కాలనీల్లో, సీసీ కెమెరాలు వంటివి లేని పార్లర్స్‌ను, కేవలం ఒకే మహిళ నేతృత్వంలో నడుస్తున్నవి ఎంచుకునేది. నేరం చేయడం తేలిక కావాలని, చేసిన తర్వాత తనను పట్టుకోవడానికి ఎలాంటి ఆధారాలు ఉండకూడదని ఈ జాగ్రత్తలు తీసుకునేది. కస్టమర్లు ఎక్కువగా ఉండని మధ్యాహ్న సమయంలోనే తన ‘పని’ ప్రారంభించేది. ఆ పార్లర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోనూ తన ముఖకవళికలు రికార్డు కాకుండా స్కార్ఫ్ కట్టుకునేది. ఆ పార్లర్‌లోకి ప్రవేశించిన తర్వాత యజమాని ఒంటరిగా ఉంటేనే ముందుకు వెళ్లేది. తొలుత ఆ మహిళతో మాటలు కలిపి తాము ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చామని చెప్పేది. తమకో, సంబంధీకులకో మేకప్ చేయాలని కోరేది. అది పెళ్లిళ్ల సీజన్ అయితే బ్రైడల్ మేకప్ కోసం భారీ మొత్తం చెల్లిస్తామంటూ ఒప్పందం చేసుకునేది. ఆపై తమ మతాచారం ప్రకారం బంగారు నగల్ని తాకమంటూ పార్లర్ యజమానికి చెప్పేది. తానో, తన వారో వచ్చి మీతో మేకప్ లేదా ఇతరాలు చేయించుకోవాలంటూ ఒంటి పైన బంగారు ఆభరణాలు తీసి పక్కన పెట్టాలని సూచించేది. పార్లర్ నిర్వాహకులు/యజమాని అలా చేసిన తర్వాత మేకప్ లేదా ఫేషియల్ తదితరాలు చేయించుకునేది. ఆపై అదును చూసుకుని వారి దృష్టి మళ్లించడం ద్వారా ఆ బంగారు ఆభరణాలను తస్కరించి అక్కడ నుంచి ఉడాయించేది. ఈ పంథాలో డేసీ చెన్నైతో పాటు తమిళనాడులోని అనేక నగరాలు, పట్టణాల్లో నేరాలు చేసింది. దీంతో అక్కడి పోలీసుల నిఘా పెరిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ తన ‘పని’ కష్టమని భావించిన డేసీ హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుంది. నాలుగు నెలల్లో 25 చోరీలు.. భర్తతో కలిసి ఫిబ్రవరిలో నగరాకినికి వచ్చి పటాన్చెరు ప్రాంతంలో అద్దె ఇంట్లో మకాం ఏర్పాటు చేసుకుంది. నగరంపై పెద్దగా పట్టులేని డేసీ ఇంటి నుంచి బయటకు వచ్చి తనకు కనిపించిన బస్సు ఎక్కేది. అక్కడ దిగిన తర్వాత అనువైన పార్లర్‌ను ఎంచుకుని యజమాని/నిర్వాహకురాలిని మోసం చేసి అందినకాడికి బంగారం ఎత్తుకుపోయేది. దీన్ని అమ్ముకోగా వచ్చిన డబ్బుతో భర్తతో కలిసి జల్సాలు చేసేది. ఈ పంథాలో గడిచిన నాలుగు నెలల కాలంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో దాదాపు 25 నేరాలు చేసింది. నగరంలోని మారేడ్‌పల్లి ఠాణా పరిధిలోని ఓ బ్యూ టీపార్లర్‌లో పంజా విసిరి దాదాపు ఐదు తు లాల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయింది. మూడు కమిషనరేట్లలో అదును చూసుకుని పంజా విసురుతూ, ఎలాంటి ఆధారాలు మిగల్చకుండా పోలీసులకు సవాల్ విసిరింది. ఈ కి‘లేడీ’ వ్యవహారాన్ని చాలెంజ్‌గా తీసుకున్న నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి నిందితురాలిని పట్టుకోవాల్సిందిగా మారేడ్‌పల్లి పోలీసులను ఆదేశించారు. దీంతో సాంకేతికంగా ముందుకు వెళ్లడంతో పాటు వ్యూ హాత్మకంగా వ్యవహరించి మారేడ్‌పల్లి పోలీసులు బుధవారం డేసీని పట్టుకున్నారు. ఈమె భర్తతో క లిసి ఉంటున్నట్లు తేలడంతో చోరీల్లో అతడి పాత్ర ఏమిటన్నది ఆరా తీస్తున్నారు. నిందితురాలిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్న పోలీసులు చోరీ సొత్తు రికవరీ చేయడంపై దృష్టి పెట్టారు. త మిళనాడులోనూ ఈమెపై ఏవైనా నాన్–బెయిలబుల్ వా రెం ట్లు పెండింగ్‌లో ఉన్నాయా? ఏదైనా కేసులో వాంటెడ్‌గా ఉందా? అని ఆరా తీస్తున్నారు. -
ప్రియుడితో జల్సాల కోసం దొంగపెళ్లి.!
లంగర్‌హౌస్: ప్రియుడితో జల్సాగా జీవించేందుకు ధనికుడిని పెళ్లి చేసుకొని అత్తవారి ఇంట్లో, స్నేహితురాలి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న కిలాడీని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసు వివరాలను లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ అంజయ్య విలేకరుల తెలిపారు. విజయవాడ ఆర్టీసీ కాలనీలో నివాసముండే పావని(28)కి అంబర్‌పేటలో నివాసముండే కిషోర్‌తో మూడు సంవత్సరాల క్రితం ఓ పెళ్లిలొ పరిచయమేర్పడింది. సట్టా నిర్వహిస్తున్న కిషోర్ డబ్బు కోసం మాయమాటలు చెప్పి పావనిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిని ఒప్పించాడు. అనంతరం ఆమె నుంచి డబ్బులు కూడా పలుమార్లు తీసుకున్నాడు. పావని ఇంటి సభ్యులతో మద్దతు ఉండడంతో అప్పటికే జల్సా జీవితంపై మోజు పెంచుకున్న పావని ప్రియుడితో కలిసి సట్టా నిర్వహిస్తు అప్పుడప్పుడు ముంబయి వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో పావని సొంత పిన్ని ఇంట్లో బంగారు నగలు చోరీ చేసింది. అనంతరం టర్కీ కరెన్సీని సరఫరా చేస్తు గతంలో పోలీసులకు పట్టుబడింది. కొన్ని నెలల క్రితం ఆమె ధనవంతుడైన రమేష్‌ను వివాహం చేసుకుంది. వివాహం జరిగిన 10 రోజులకు రమేష్‌కు ఉద్యోగం రావడంతో సౌతాఫ్రికాకు వెళ్లాడు. పావనిని కూడా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఆమె అత్తవారింట్లో పలుమార్లు చోరీలకు పాల్పడి ఆ సొత్తును ప్రియుడికి ఇస్తుండటాన్ని గుర్తించిన అత్తింటి వారు ఆమెను బయటికి గెంటేశారు. అయినా వైఖరి మార్చుకోని పావని అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉంటూ ఉస్మానియాలో ఎంబీఏ చేస్తున్నానని నకిలీ ఐడీ కార్డు చూపించి పలువురితో స్నేహం పెంచుకుంది. ఎవరికి అనుమానం రాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సట్టా నిర్వహిస్తోంది. వసతి గృహం స్నేహితుల ద్వారా పద్మనాభ నగర్‌కు చెందిన ఉషను పరిచయం చేసుకుంది. గతేడాది డిసెంబర్ 19 తేదీ ఉదయం ఉష ఇంటికి వెళ్లిన ఆమె ఎవరూ చూడకుండా బీరువా తాళాలు తీసుకుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత పావని ఉషకు ఫోన్ చేసి తన బ్యాగు ఇంట్లో మరిచిపోయానని చెప్పడంతో అక్కడ వార్డెన్ ద్వారా తాళాలు తీయించి ఇంట్లోకి వెళ్లింది. బీరువా నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు తీసుకొని ప్రియుడితో ముంబయి వెళ్లిపోయింది. భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం ఉదయం శంషాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చిన పావనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. -
వృత్తి మెకానిక్... ప్రవృత్తి చోరీలు
– బైక్‌ల దొంగ అరెస్ట్ – 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం కర్నూలు: మెకానిక్ షెడ్లో గుమాస్తాగా పనిచేస్తూ జల్సాల కోసం బైకుల చోరీకి పాల్పడిన దొంగ పోలీసుల వలకు చిక్కాడు. మహానంది మండలం అభాండం తండాకు చెందిన మెగావత్ నాగార్జున నాయక్ నంద్యాల పట్టణంలో మెకానిక్ షెడ్లో గుమాస్తాగా పనిచేస్తూ మారు తాళాలతో బైకులను చోరీ చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నంద్యాల ఒకటవ పట్టణ పోలీసులు నిందితుడు నాగార్జున నాయక్‌పై నిఘా వేసి పట్టుకుని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. శనివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నంద్యాల–మహానంది రోడ్డులోని బంగారుపుట్ట వద్ద నాగార్జున నాయక్ అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది. నంద్యాల, కడప పట్టణాల్లో బైక్‌లు చోరీ చేసినట్లు ఆయా పోలీస్స్టేషన్లలో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. నాగార్జున నాయక్ వినియోగిస్తున్న ఒక బైకును గుర్తించి విచారించగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద కంప చెట్లలో మరో 8 బైకులు దాచి వుంచినట్లు అంగీకరించడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. బైకు దొంగను అరెస్టు చేసి ద్విచక్ర వాహనాలను రికవరీ చేసినందుకు నంద్యాల ఒకటవ పట్టణ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్ఐలు రమణ, హరిప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు, శివయ్య, బాలదాసు, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, గంగాధర్, మద్దిలేటి, రమేష్ తదితరులను ఎస్పీ అభినందించారు. గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగిస్తే పోలీసు చర్యలు: ఎస్పీ గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే వారు ఎంతటివారైనా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. పాణ్యం సమీపంలోని కొండజూటూరు, వెల్దుర్తి మండలం చెరుకులపాడుతో పాటు ఆదోని ప్రాంతాల్లోని మరో రెండు గ్రామాల్లో కొంతమంది ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని వారికి సూచించారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేవారిపై రౌడీషీట్లు, బైండోవర్ కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసు అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఎక్కడైనా ఎవరైనా రౌడీయిజానికి, దౌర్జన్యానికి పాల్పడితే తక్షణమే డయల్ 100 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
ఇంటి యజమానికి విద్యార్థి టోకరా
నర్సంపేట : నమ్మి గదిని అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ దివాకర్ కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం పెద్ద తండాకు చెందిన గుగులోతు శ్రీనాథ్ ఖానాపురం మండలంలోని ఐనపల్లిలో విజేత ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. నర్సంపేట పట్టణంలోని టీఆర్ఎస్ కాలనీలో ఆకారపు కుమారస్వామి ఇంట్లోని గదిలో అద్దెకు ఉంటూ కళాశాలకు వెళ్లొస్తున్నాడు. కొద్దిరోజులు గా జల్సాలు, వ్యసనాలకు అలవాటుపడిన శ్రీనాథ్ ఆగస్టు 30న కుమారస్వామి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి బంగారు అభరణాలను ఎత్తుకెళ్లాడు. సాయంత్రం ఇంటి కి వచ్చిన కుమారస్వామి, కుటుంబ సభ్యులు ఇంట్లో చిందరవందరగా పడేసిన దుస్తులు, సామగ్రిని చూసి ఆందోళనకు గురై ఆభరణాలు చూసుకోగా అపహరణకు గురైనట్లు గుర్తించా రు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనాథ్‌ను రిమాం డ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశం లో ఎస్సైలు ఇ.హరికృష్ణ, హెడ్‌కానిస్టేబుళ్లు సదానందం, మల్లేశం పాల్గొన్నారు. -
బైక్‌ల దొంగ అరెస్టు
జనగామ : జనగామ నియోజకవర్గం పరిధిలో వరుస ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని రిమాండ్‌కు పంపించినట్లు డీఎస్పీ పద్మనాభరెడ్డి తెలిపారు. శనివారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ముసికె శ్రీనివాస్‌తో కలిసి డీఎస్పీ మాట్లాడారు. బచ్చన్నపేట మండ లం కొన్నె గ్రామానికి చెందిన పాత నేరస్తుడు యాట రమేష్ గత కొంత కాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. కోర్టు సమీపంలో సీఐ ముసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రమేష్ పారి పోయే ప్రయత్నం చేశాడన్నారు. అనుమానం కలిగి పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారణ చేశామన్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో రూ.2లక్షల విలువ చేసే నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రమేష్‌ను రిమాండ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ వెంట ఎస్సై సంతోషం రవిందర్, సిబ్బంది ఉన్నారు. -
బైక్‌ల దొంగ అరెస్టు
జనగామ : జనగామ నియోజకవర్గం పరిధిలో వరుస ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని రిమాండ్‌కు పంపించినట్లు డీఎస్పీ పద్మనాభరెడ్డి తెలిపారు. శనివారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ముసికె శ్రీనివాస్‌తో కలిసి డీఎస్పీ మాట్లాడారు. బచ్చన్నపేట మండ లం కొన్నె గ్రామానికి చెందిన పాత నేరస్తుడు యాట రమేష్ గత కొంత కాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. కోర్టు సమీపంలో సీఐ ముసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రమేష్ పారి పోయే ప్రయత్నం చేశాడన్నారు. అనుమానం కలిగి పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారణ చేశామన్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో రూ.2లక్షల విలువ చేసే నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రమేష్‌ను రిమాండ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ వెంట ఎస్సై సంతోషం రవిందర్, సిబ్బంది ఉన్నారు. -
దొరికిన మరాఠీ దొంగలు
నంద్యాల: మహానంది క్షేత్రంలోని కోనేరులో ఇటీవల ఓ భక్తుడు స్నానం చేస్తుండగా అతని బ్యాగ్‌లోని విదేశీ కరెన్సీని చోరీ చేసిన ముగ్గురు మహారాష్ట్రకు చెందిన దొంగలను పోలుసులు పట్టుకున్నారు. వారి నుంచి విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన మేకల రామాంజనేయులు 15వ తేదీన మహానంది క్షేత్రానికి కుటుంబ సభ్యులతో సహా విచ్చేశారు. ఆయన ఆలయం వెలుపల ఉన్న కోనేరు వద్ద స్నానం చేయడానికి వెళ్తూ, సమీపంలోని చెట్టు వద్ద బ్యాగ్ పెట్టాడు. స్నానం చేసి వచ్చాక బ్యాగ్ కనిపించలేదు. ఇందులో రూ.99వేలు అమెరికా డాలర్లు, సౌదీకి చెందిన రియాజ్ నోట్లు ఉన్నాయి. దీంతో ఆయన మహానంది ఎస్ఐ కష్ణుడుకు ఫిర్యాదు చేశారు. అయితే ముగ్గురు మరాఠీ దొంగలు బ్యాగ్‌లో నుంచి నోట్లను కాజేస్తుండగా ఆ దశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు విదేశీ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులు, వ్యాపారస్తుల దగ్గర ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని సోలార్‌పూర్‌కు చెందిన విశాల్ మానిక్ చౌహాన్, ధాన్‌సింగ్ బాపు చౌహాన్, చెన్నాసింగ్‌భగవత్‌లను అరెస్ట్ చేసి రూ. 99,344లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో మహానంది ఎస్ఐ కష్ణుడు, రూరల్ ఏఎస్ఐ మహబూబ్‌పీరా పాల్గొన్నారు. -
అప్పులు తీర్చేందుకు చోరీలు
కర్నూలు: అప్పులు తీర్చేందుకు చోరీలు చేస్తూ పోలీసుల వలకు చిక్కి ఓ దొంగ కటకటాలపాలయ్యాడు. కర్నూలు శివారులోని చదువులరామయ్య నగర్లో నివాసముంటున్న కొమ్ము వంశీని మూడవ పట్టణ పోలీసులు దొంగతనం కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో వ్యసనాలకు బానిసై నేరాల బాట పట్టాడు. చిన్నప్పుడు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడ్డాడు. గౌండ పనిచేస్తూ జీవనం సాగించే వంశీ కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు చోరీలకు పాల్పడేవాడు. ఠాగూర్ నగర్‌కు చెందిన కురువ శ్రీనివాసులు బిర్లాగేట్ దగ్గర శివ మొబైల్స్ నడుపుతున్నాడు. కొమ్ము వంశీ ఫోన్ రిచార్జ్ కోసం శివ మొబైల్స్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించాడు. చోరీ చేసేందుకు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారించుకుని ఈనెల 20వ తేదీన చోరీకి పాల్పడ్డాడు. దుకాణం షెట్టర్‌ను పెకిలించి లోనికి ప్రవేశించి సుమారు రూ.30 వేలు విలువ చేసే 15 సెల్ఫోన్లు చోరీ చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఘా వేసి వంశీని అదుపులోకి తీసుకుని కటకటాలకు పంపారు. ఇతని వద్ద నుంచి సెల్ఫోన్లను రికవరీ చే సినట్లు సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. -
అంతర్జిల్లా దొంగ అరెస్టు
కర్నూలు: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న అంతర్ జిల్లా దొంగ ఉప్పరిగణ అలియాస్ ప్రవీణ్‌కుమార్‌ను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 తులాల బంగారు నగలు, రూ.3,500 నగదు రికవరీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కోనేరు బుక్కాపురం గ్రామానికి చెందిన ఇతను జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. తాళాలు వేసిన ఇళ్లను ఎంపిక చేసుకొని రెక్కి నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నాయి. కొత్తబస్టాండుకు ఎదురుగా ఉన్న స్వీట్స్ స్టాల్ దగ్గర ఉన్నట్లు సమాచారం అందడంతో నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేసి సీఐ నాగరాజు రావు ఎదుట హాజరు పరిచారు. నేరాల చిట్టా: – 2015 ఫిబ్రవరి 25న కర్నూలు శివారుల్లోని రాజీవ్‌గహకల్పకు ఎదురుగా ఉన్న ఇందిరమ్మ గహాల్లో నివాసం ఉంటున్న షేక్‌అహ్మద్ బీ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. – 2016 మార్చి 13న ఉల్చాల రోడ్డులోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్న మునెప్ప ఇంట్లోకి చొరబడి బంగారు నగలు చోరీ చేశాడు. – 2016 మే 10న అబ్బాస్‌నగర్‌లోని వరలక్ష్మి ఇంట్లో రాత్రి దొంగతనానికి పాల్పడ్డాడు. – 2016 జూన్ 23న ఉల్చాల రోడ్డులోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్న కరుణాకర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.