నేడు, రేపు సాక్షి టీవీలో స్పెల్‌బీ ఫైనల్స్
సాక్షి, హైదరాబాద్: విజ్ఞాన్ యూనివర్సిటీ సహకారంతో సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ-2015’ ఫైనల్ పోటీలు శని, ఆదివారాల్లో సాక్షి టీవీలో ప్రసారం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఫైనల్స్ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, తెలంగాణకు సంబంధించిన ఫైనల్ పోటీలు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సాక్షి టీవీలో ప్రసారమవుతాయని నిర్వాహకులు వెల్లడించారు.