హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు | badminton compitations | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు

Published Thu, Sep 22 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు

  • ప్రీ క్వార్టర్స్‌ దశకు చేరిన టోర్నీ
  • కొత్తపేట:
    కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్‌ ఇండోర్‌ షటిల్‌ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్‌–19 షటిల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌–2016లో భాగంగా రెండోరోజు గురువారం నాటి మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. మెయిన్‌ డ్రా ఉదయం పది గంటలకు ప్రారంభం కాగా పోటీలను ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు,జిల్లా అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బాలురు, బాలికల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు.  
     
    రెండో రౌండ్‌ విజేతలు..
    గురువారం మొదటి, రెండో రౌండు మ్యాచ్‌లు ముగిసి టోర్నీ ప్రీక్వార్టర్స్‌ దశకు చేరింది. బాలుర విభాగంలో రెండో రౌండ్‌లో సాయికిరణ్‌(విశాఖ)పై  జశ్వంత్‌(చిత్తూరు), జి.శ్రీనివాసరావు(విజయనగరం)పై టి. విజయ్‌కుమార్‌(పశ్చిమ గోదావరి), సుజిత్‌(కృష్ణ)పై చారి(విశాఖ), పాల్‌ప్రీత్‌ శిలాస్‌(అనంతపురం)పై శ్రీకర్‌(శ్రీకాకుళం), గణేష్‌(ప్రకాశం)పై గిరిష్‌నాయుడు(తూర్పుగోదావరి), మనోహర్‌ (కర్నూలు)పై దత్తాత్రేయరెడ్డి(కడప), అమన్‌గౌడ్‌(తూర్పుగోదావరి)పై సాయికిషోర్‌(పశ్చిమగోదావరి), ప్రశాంత్‌కుమార్‌(పశ్చిమగోదావరి)పై చంద్రాజ్‌పట్నాయక్‌(విశాఖ), కార్తీక్‌(కృష్ణ)పై శివసుందర్‌సాయి(చిత్తూరు), సాయిదత్తా(శ్రీకాకుళం)పై రోహిత్‌కుమార్‌(విశాఖ), వరప్రసాద్‌(విజయనగరం)పై ప్రణయ్‌(విశాఖ), రాహుల్‌(కర్నూలు)పై రాయుడు(తూర్పుగోదావరి), శ్రీకర్‌(అనంతపురం)పై డి.శరత్‌(గుంటూరు), యశ్వంత్‌(విశాఖ)పై వేదవ్యాస్‌సాయి(ప్రకాశం) గెలుపొంది ప్రీక్వార్టర్స్‌కు చేరారు. 
    బాలికల విభాగంలో జయశ్రీ(ప్రకాశం)పై మేఘన(పశ్చిమ గోదావరి), దీక్షితారాణి(అనంతపురం)పై నివేదిత(విశాఖ), షర్మిలా(కృష్ణా)పై వెన్నెల(తూర్పుగోదావరి), యామినిశ్రీ(శ్రీకాకుళం)పై వెన్నెల(కడప), మల్లిక(కృష్ణా)పై షన్విత(తూర్పుగోదావరి), హర్షిణి(పశ్చిమగోదావరి)పై బాలభువనేశ్వరి(విజయనగరం), పద్మజ(కృష్ణా)పై లక్ష్మి(విశాఖ) అంజలి(ప్రకాశం)పై నవ్యస్వరూప(తూర్పుగోదావరి), కాశీబాయ్‌(చిత్తూరు)పై సంజన(పశ్చిమగోదావరి), శ్రీలత(కడప)పై ^è రిష్మా(పశ్చిమగోదావరి), తేజా(తూర్పుగోదావరి)పై అసియా(కర్నూలు), సుష్మ(శ్రీకాకుళంపై)పై శ్వేత(అనంతపురం) గెలుపొంది ప్రీక్వార్టర్స్‌కు చే రారని ఛీప్‌ రిఫరీ ఎస్‌.సూరిబాబు, డిప్యూటీ రిఫరీ బి.పాపయ్యశాస్త్రి, మ్యాచ్‌ కంట్రోలర్‌ కె.రమేష్‌ తెలిపారు.
     
    స్టేట్, నేషనల్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు
    స్టేట్, నేషనల్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో జిల్లా నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొంటూ ఖ్యాతి తీసుకువస్తున్నారు. క్రికెట్‌ తరువాత షటిల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్తపేటలో అండర్‌–19 సెలక్షన్స్‌ చక్కగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో బ్యాడ్మింటన్‌ అభివృద్ధికి పున్నయ్యచౌదరి కృషి ఎంతగానో ఉంది. 
    –కాశీ విశ్వనాథ్, ఏపీబీఏ అంపైర్‌ 
     
    ఆరోగ్యానికి దోహదపడే క్రీడ 
    షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడను ఎక్కువ మంది ఆరోగ్యపరంగా ఎంచుకుని ఆడుతున్నారు. ప్రభుత్వం పట్టణ, పలు గ్రామీణ ప్రాంతాల్లో స్టేడియంలను అందుబాటులోకి తీసుకువస్తే మరింత మంది దేశానికి పేరుతెచ్చే క్రీడాకారులు తయారవుతారు. ఖరీౖదైన ఈ క్రీడ ప్రధానంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు వెళుతుంది.
    –భద్రం, ఏపీబీఏ సీనియర్‌కోచ్‌
     
    అంతర్జాతీయస్థాయిలో ఆడడమే లక్ష్యం
    షటిల్‌ బ్యాడ్మింటన్‌లో ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌గా రాణించాలన్నదే నా లక్ష్యం. షటిల్‌ ఎంజాయ్‌మెంట్‌ గేమ్‌. కాన్ఫిడెంట్‌గా ఆడవచ్చు. జైపూర్‌లో జరిగిన అండర్‌–17 నేషనల్స్‌ ఆడాను. ఇక్కడ పోటీల ప్రారంభం కార్యక్రమం ఎంతో అందంగా జరిగింది. సౌకర్యాలు, మర్యాదలు చాలా బాగున్నాయి.
    – పి.నిషిత, విశాఖ
     
    శ్రీకాంత్‌ నాకు స్ఫూర్తి
    షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఇండియా నెంబర్‌ వన్‌ ప్లేయర్‌ శ్రీకాంత్‌ నాకు స్ఫూర్తి. కోచ్‌ సుధాకరరెడ్డి శిక్షణలో రాణిస్తున్నాను. గతేడాది అండర్‌–19 సౌత్‌ జోన్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించాను. ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాను. ఇక్కడ సౌకర్యాలు ఎంతో బాగున్నాయి. 
    – ఎ.వేదవ్యాస్, ప్రకాశం జిల్లా 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement