బరువు మోసే రిలే పోటీల విజేత
బరువు మోసే రిలే పోటీల విజేత
Published Thu, Jan 12 2017 11:07 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
అమృతలూరు : సంక్రాంతి సంబరాల్లో భాగంగా అమృతలూరులో గురువారం సాయంత్రం దావులూరి నాగేశ్వరరావు (చిన్న) స్మారక జిల్లాస్థాయి 50 కేజీల బరువు మోసే రిలే పోటీలను నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. నిర్ణీత దూరాన్ని నలుగురు మోసే రిలే పోటీలలో అమృతలూరుకు చెందిన నవభారత్ (సీహెచ్ వినీల్) యూత్ 1 నిమిషం, 36 సెకన్లలో మోసి ప్రథమస్థానం, చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి చెందిన కె. హనుమాన్ టీమ్ 1 నిమిషం, 46 సెకన్ల మోసి ద్వితీయస్థానం, అమృతలూరుకు చెందిన ప్రతాప్ యూత్ 1 నిమిషం, 53 సెకన్లలో మోసి తృతీయ స్థానం, అమృతలూరుకు చెందిన నవభారత్ (జి. విజయ్‌కుమార్) యూత్ 1 నిమిషం, 56 సెకన్లలో మోసి నాల్గో స్థానం సాధించాయి. ప్రథమ బహుమతి రూ. 3,200, ద్వితీయ బహుమతి రూ.2,400, తృతీయ బహుమతి రూ.1,600, నాల్గో బహుమతి రూ.1,000 విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కరరావు, సర్పంచ్ కూచిపూడి సతీష్‌కుమార్, గొట్టిపాటి భానుగంగాధర్, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా రాపర్ల మల్లికార్జునరావు, దేవరకొండ నాగరాజు వ్యవహరించారు.
Advertisement
Advertisement