కొవ్వూరులో బ్యాడ్మింటన్ సందడి
కొవ్వూరులో బ్యాడ్మింటన్ సందడి
Published Fri, Aug 5 2016 7:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
కొవ్వూరు : రియో ఒలింపిక్స్‌నకు ముందే కొవ్వూరులో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల సందడి మొదలైంది. గురువారం ప్రారంభమైన ఈ పోటీలు శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు నువ్వానేనా అన్నట్టు రాకెట్‌లతో షటిల్‌కాక్ కే చెమటలు పట్టించారు. వినూత్నమైన షాట్‌లతో సైనా నెహ్వాల్, సింధు, శ్రీకాంత్‌లను మరిపించారు. కోర్టు నలుదిక్కుల షార్ట్‌లు కొడుతూ క్రీడాభిమానులకు కనువిందు చేశారు.
కొవ్వూరు సత్యవతినగర్‌లోని అల్లూరి వెంకటేశ్వరరావు, మునిసిపల్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులో రాష్ట్రస్థాయిæబ్యాడ్మింటన్ అండర్–17 పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి 63 మంది క్రీడాకారులు హాజరు కాగా ఎనిమిది మందిని రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీలకు, డబుల్స్ విభాగంలో ఎనిమిది జట్లును ఎంపిక చేసినట్టు టోర్నమెంట్ చీఫ్ రిఫరీ, నేషనల్ రిఫరీ కె.రమేష్ తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నట్టు చెప్పారు. శని, ఆదివారాలు కూడా పోటీలు కొనసాగుతాయని బ్యాడ్మింటన్ అసోసియోషన్ అధ్యక్ష, కార్యదర్శులు సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్, పొట్రు మురళీకృష్ణ తెలిపారు.
సింగిల్స్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు
ఎస్.అబ్దుల్ రెహమాన్(వైఎస్సార్ కడప), ఎం.సాయికిరణ్, పి.చంద్రరాజ్ పట్నాయక్ (విశాఖ పట్నం), బి.రోహిత్‌కుమార్(విశాఖపట్నం), ఎ.వంశీకష్ణంరాజు, ఎస్‌వీ రాయుడు (తూర్పుగోదావరి), పి.చంద్ర గోపీనాథ్, కె.చరణ్‌నాయక్(గుంటూరు) ఎంపికయ్యారు.
డబుల్స్ విభాగంలో...
కె.వరప్రసాద్ (విజయనగరం), ఎం.శ్రీకర్(శ్రీకాకుళం), ఎం.సాయికిరణ్(విశాఖపట్నం), పి.గోపీనాథ్(ప్రకాశం), బి.రోహిత్‌కుమార్, ఎస్.సౌరభ్‌కుమార్(విశాఖపట్నం), పి.సునీల్, టి.పార్ధసారథి( తూర్పుగోదావరి), కె.చరణ్ నాయక్, పి.విజయసాయి రెడ్డి(గుంటూరు), ఎ.వంశీ కష్ణ, ఎస్.శైలేష్‌కుమార్(పశ్చిమ గోదావరి), పి.చంద్ర గోపీనా«థ్(గుంటూరు), ఎస్‌వీ రాయుడు(తూర్పుగోదావరి) ఎంపికయ్యారు.
Advertisement
Advertisement