Players selection
-
జిల్లాస్థాయి త్రోబాల్ క్రీడాకారుల ఎంపిక
కీసర: నాగారం గ్రామంలోని విజ్ఞాన్ బోట్రి పాఠశాల ఆవరణలో గురువారం జిల్లా త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొమ్ము వెంకట్ ఆద్వర్యంలో జిల్లా త్రోబాల్ క్రీడాకారుల ఎంపికను నిర్వహించారు. పురుషుల విభాగంలో కెప్టెన్‌గా నిఖిల్, వైస్ కెప్టెన్‌గా హరీష్, సభ్యులుగా దుర్గా, సాయిజేత, రాకేష్, వంశి, జీవన్, హరికృష్ణ, భార్గవ్, సాయి, కీర్తిరామ్, నితిన్, భార్గవ్, బిము, సాయిచరణ్, కోచ్‌లుగా నానాజీ, మనేందర్, సుభాన్లు ఎంపికయ్యారు. మహిళల విభాగం కెప్టెన్‌గా దీపిక, వైస్ కెప్టెన్‌గా అనిశా, సభ్యులుగా శ్రీలత, మమత, శ్రీలేఖ, శృతి, సరిత, రజిని, హేమ, శ్వేత, హర్షిత, రేవతి, మేద, శృతి, కోచ్‌లుగా జాన్‌రెడ్డి, మనేందర్లు ఎంపికయ్యారు. కాగా నేటినుంచి నగరంలోని అల్వాల్‌లో జరిగే రాష్ర్ట స్థాయి త్రోబాల్ పోటీల్లో జిల్లా తరపున ఈ రెండు జట్లు పాల్గొననున్నట్లు జిల్లా త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొమ్ము వెంకట్ తెలిపారు. క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో విజ్ఞాన్ బోట్రి పాఠశాల ఏఓ నాగేంద్ర, ప్రిన్సిపాల్ కవిత, సెలక్షన్స్ కమిటీ చైర్మన్ రేవంత్, పాఠశాల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
కొవ్వూరులో బ్యాడ్మింటన్ సందడి
కొవ్వూరు : రియో ఒలింపిక్స్‌నకు ముందే కొవ్వూరులో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల సందడి మొదలైంది. గురువారం ప్రారంభమైన ఈ పోటీలు శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు నువ్వానేనా అన్నట్టు రాకెట్లతో షటిల్‌కాక్ కే చెమటలు పట్టించారు. వినూత్నమైన షాట్లతో సైనా నెహ్వాల్, సింధు, శ్రీకాంత్‌లను మరిపించారు. కోర్టు నలుదిక్కుల షార్ట్‌లు కొడుతూ క్రీడాభిమానులకు కనువిందు చేశారు. కొవ్వూరు సత్యవతినగర్‌లోని అల్లూరి వెంకటేశ్వరరావు, మునిసిపల్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులో రాష్ట్రస్థాయిæబ్యాడ్మింటన్ అండర్–17 పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి 63 మంది క్రీడాకారులు హాజరు కాగా ఎనిమిది మందిని రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీలకు, డబుల్స్ విభాగంలో ఎనిమిది జట్లును ఎంపిక చేసినట్టు టోర్నమెంట్ చీఫ్ రిఫరీ, నేషనల్ రిఫరీ కె.రమేష్ తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నట్టు చెప్పారు. శని, ఆదివారాలు కూడా పోటీలు కొనసాగుతాయని బ్యాడ్మింటన్ అసోసియోషన్ అధ్యక్ష, కార్యదర్శులు సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్, పొట్రు మురళీకృష్ణ తెలిపారు. సింగిల్స్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ఎస్.అబ్దుల్ రెహమాన్(వైఎస్సార్ కడప), ఎం.సాయికిరణ్, పి.చంద్రరాజ్ పట్నాయక్ (విశాఖ పట్నం), బి.రోహిత్‌కుమార్(విశాఖపట్నం), ఎ.వంశీకష్ణంరాజు, ఎస్వీ రాయుడు (తూర్పుగోదావరి), పి.చంద్ర గోపీనాథ్, కె.చరణ్‌నాయక్(గుంటూరు) ఎంపికయ్యారు. డబుల్స్ విభాగంలో... కె.వరప్రసాద్ (విజయనగరం), ఎం.శ్రీకర్(శ్రీకాకుళం), ఎం.సాయికిరణ్(విశాఖపట్నం), పి.గోపీనాథ్(ప్రకాశం), బి.రోహిత్‌కుమార్, ఎస్.సౌరభ్‌కుమార్(విశాఖపట్నం), పి.సునీల్, టి.పార్ధసారథి( తూర్పుగోదావరి), కె.చరణ్ నాయక్, పి.విజయసాయి రెడ్డి(గుంటూరు), ఎ.వంశీ కష్ణ, ఎస్.శైలేష్‌కుమార్(పశ్చిమ గోదావరి), పి.చంద్ర గోపీనా«థ్(గుంటూరు), ఎస్వీ రాయుడు(తూర్పుగోదావరి) ఎంపికయ్యారు. -
29న జోనల్ స్థాయి క్రికెట్ క్రీడాకారులు ఎంపిక
శామీర్‌పేట్: మేడ్చల్ జోనల్ స్థాయి క్రికెట్ క్రీడాకారుల ఎంపిక కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ పరిధిలోని జ్యోతిరావు పూలే స్టేడియంలో ఈ నెల 29న నిర్వహించనున్నట్లు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జోనల్ కార్యదర్శి అరుణజ్యోతి బుధవారం సాయంత్రం తెలిపారు. పూలే స్టేడియంలో అండర్ 14, అండర్ 17 స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ ఎంపికలో పాల్గొని తమ క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు. విద్యార్థులు తమ స్కూల్ బోనఫైడ్‌తో ఎంపిక ప్రదేశానికి హజరుకావాలన్నారు.