వాలీబాల్ పోటీలు ప్రారంభం
బాపట్ల : క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం, దాతలు ముందుకు రావాలని వేగేశన ఫౌండేషన్ చైర్మన్ వేగేశన నరేంద్రవర్మరాజు కోరారు. బాపట్ల మండలం వెదుళ్ళపల్లి కొత్తపాలెం గ్రామంలో వేగేశన ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాలీబాల్‌పోటీలను సోమవారం ఆట్టహాసంగా ప్రారంభించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన జట్లును పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామపెద్దకాపు కోటా శ్రీరామిరెడ్డి, పెద్ది సుబ్రమణ్యం, కోటా వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు.